అమ్మబాబోయ్.. చెట్టుకి దెయ్యం పట్టిందా.. ఏం జరిగిందో చూస్తే..!
వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇంతలోనే ఒక చెట్టు ఆకస్మాత్తుగా దగ్గరకు ముడుచుకుని.. ఒక్కసారిగా ఊగిపోవడం మొదలుపెట్టింది. దాన్ని చూసిన జనం గజగజ వణికిపోయారు. అక్కడినుంచి పరుగందుకున్నారు. ఇప్పుడు చెప్పండి.. పార్కుల్లో ప్రశాంతంగా నడుస్తారా లేదా దెయ్యాలతో పోరాడతారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత అందరూ ఈ ప్రశ్న అడుగుతున్నారు.
ఓ పార్క్‌లో ఓ పెద్ద చెట్టు గాలికి ఊగుతూఉంది. ఆ చెట్టును గమనిస్తే విఠలాచార్య సినిమాల్లో కనిపించే ఓ పెద్ద మాయావిలా ఉంది. గాలికి ఆ చెట్టు ఊగుతున్న తీరు చూస్తూ ఎవరో రాక్షసుడు చెట్టను ఆవహించి దాడికి వస్తున్నాడేమో అనిపిస్తుంది. చుట్టూ ఉన్న చెట్లు కూడా అంతాగా ఏమీ ఊగడంలేదు. కానీ ఈ చెట్టు పెద్ద పెద్ద కొమ్మలతో భారీగా ఉండటంతో గాలికి ఆ కొమ్మలు ఊగుతున్న తీరుచూస్తే మాయా రాక్షసిలా ఉంది. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చెట్టు ఆకారం సరిగ్గా పెద్ద దెయ్యంలా కనిపించింది. అది గాలికి ఊగుతున్నప్పుడు, ఒక దెయ్యం నృత్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అదృష్టవశాత్తూ, ఈ దృశ్యం పగటిపూట కెమెరాలో బంధించారు. ఈ దృశ్యాన్ని రాత్రిపూట ఎవరైనా చూసి ఉంటే హడలిపోవాల్సిందే. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒకరు “అమ్మా, చెట్టును భూతవైద్యుడు అని పిలవండి” అని అంటున్నారు. మరొకరు “ఈ చెట్టు కింద కూర్చుని చదువుకునే వారు ఉగ్రవాదులు కావచ్చు, టాపర్లు కాదు” అని రాశారు. ఓ యూజర్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటివరకు లక్షలాది మంది వీడియోను వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. తమైదనశైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

