బాబోయ్ ఇదేం వింత ఆచారం! తలపై కొబ్బరి కాయ పగలగొట్టి
సాధారణంగా మనం గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటాం. అయితే ఆ ఆలయంలోకి వెళ్లాలంటే మాత్రం సాహసమే చేయాలి. సాహసమా.. ఏంటి అనుకుంటున్నారా.. ఏం లేదండి ఓ కొబ్బరి కాయను నెత్తిమీద కొట్టించుకోవాలి. మాడు పగిలితేనే అమ్మవారి దర్శనం దొరుకుతుంది. మరి ఆ ఆలయం ఏంటి, దాని ప్రత్యేకత ఏంటో చూద్దామా ? తమిళనాడులోని కరూర్ జిల్లా మెట్టుమహదానపురంలో శ్రీ మహాలక్ష్మి అమ్మన్ ఆలయం ఉంది.
అక్కడే ప్రస్తుతం పెరుక్కు ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో అక్కడికెళ్లే భక్తులు తమ తలలపై కొబ్బరి కాయలు కొట్టించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. వినేందుకు చాలా వింతగా అనిపిస్తున్నప్పటికీ.. చాలా ఏళ్లుగా అక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఎందుకంటే ఆలయ పూజారులు.. ఒకరి తరువాత మరొకరి భక్తుల తలలపై కొబ్బరికాయలు కొడతారు. ఈ టైమ్‌లో తలలకు గాయాలు కావడం సర్వసాధారణం. భక్తులు దైవం పట్ల తమకున్న భక్తిని ప్రదర్శించడానికి ఈ ఆచారాన్ని పాటిస్తారు. కొబ్బరి కాయలు కొట్టిన తర్వాత రక్తం కారుతున్నా, విపరీతమైన నొప్పి తమను వేధిస్తున్నా వారు మాత్రం నవ్వుతూ.. అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే కొన్ని దురదృష్టకర ఘటనలు కూడా జరిగాయి. మొన్నామధ్య చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి తలల నుంచి రక్తం కారింది. దీంతో ఆలయ సిబ్బంది గాయాలకు పసుపు రాసి, నొప్పి తగ్గించే ప్రయత్నం చేసారు. అయితే గాయపడినవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆలయ సమీపంలోనే ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అక్కడ 40 మందికి పైగా భక్తులకు చికిత్స అందించారు. వారిలో చాలామందికి తల గాయాలకు కుట్లు వేయాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా ఆ తర్వాత కూడా మరెంతో మంది భక్తులు తమ తలలపై కొబ్బరి కాయలు కొట్టించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

