Bigg Boss 9 Telugu Promo: వామ్మో.. ఇంత వైల్డ్‌గా ఉన్నారేంట్రా సామీ.. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం కంటెస్టెంట్స్ కొట్లాట..
బిగ్‌బాస్ సీజన్ 9.. ఐదు వారాల తర్వాత ఆట పూర్తిగా మారిపోయింది. వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన కంటెస్టెంట్స్ మాట్లాడితే చాలు గొడవ పెట్టుకుందామని రెడీగా ఉంటున్నారు. లేదంటే పక్కనే కూర్చుని ఒక్కొ కంటెస్టెంట్ గురించి నోటికి పనిచెబుతున్నారు. గత నాలుగు రోజులుగా హౌస్ లో గొడవలు, కోట్లాటలతో ప్రేక్షకులకు విసుగుపుట్టిస్తున్నారు. ఇక ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం ఇచ్చిన టాస్కులో వైల్డ్ గా మారిపోయారు.

బిగ్‌బాస్ సీజన్ 9.. ఐదో వారం కెప్టెన్ గా కళ్యాణ్ కొనసాగుతున్న సంగతి తెలిసింది. ఇక ఈ వారం ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్ ఇంటిసభ్యులతోపాటు ప్రేక్షకులకు సైతం చిరాకు పుట్టిస్తున్నారు. మాట్లాడితే చాలు గొడవ పెట్టుకుందాం అని చూస్తున్నారు. అవసరం లేకపోయినా కల్పించుకుని మరీ గొడవలు సృష్టిస్తూ అటు ఇంటి సభ్యులతోపాటు.. ఇటు ప్రేక్షకులకు సైతం విసుగు తెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం పాత హౌస్మేట్స్, వైల్డ్ కార్డ్స్ మధ్య గట్టిగానే పోటీ నడిచినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో రెండు టీమ్స్ మధ్య భీకరమైన పోరు జరిగింది. తాజాగా విడుదలైన ప్రోమోలో.. కెప్టెన్సీ కంటెండర్ షిప్ కాపాడుకోవడానికి ఫైర్ స్ట్రామ్స్ , వారు ఎంచుకున్న సభ్యులు రెండు టీమ్స్ గా ఏర్పడి ఒక టాస్కులో తలపడాల్సి ఉంటుంది. అందుకు ఇచ్చిన టాస్క్ కెప్టెన్సీ ఏ.. అంటూ చెప్పుకొచ్చాడు బిగ్‌బాస్.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఇక ఈ టాస్కులో ప్రతి రౌండ్ లో బజర్ మోగగానే సెంటర్ లైన్ రెడ్ మార్క్ మీద ఉంచిన బాల్ తీసుకుని ప్రత్యర్థి టీమ్ గేమ్ పోస్ట్ లో గోల్ చేయగలిగితే వారి టీమ్ నుంచి ఏ ఒక్కరిని ఈ నుంచి తప్పించాలని అన్నది గోల్ చేసిన సభ్యులు నిర్ణయిస్తారు. పాత కంటెస్టెంట్స్ నుంచి సుమన్ శెట్టి, తనూజ, భరణి, సంజన, దివ్య ఈ టాస్కులో పాల్గోన్నారు. అయితే రెండు గ్రూపులు బాల్ కోసం గట్టిగానే పోటీపడ్డారు. ఈ క్రమంలోనే భరణి వెళ్లి రమ్య పైన పడడంతో ఆమె తలకు దెబ్బ తగిలింది. ఇక తర్వాత ఫైర్ స్ట్రామ్ గోల్ చేయడంతో ఒక పాయింట్ వచ్చింది. వెంటనే వాళ్లు భరణిని ఎలిమినేట్ చేశారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
అ తర్వాత గౌరవ్ తనను పుష్ చేశాడంటూ తనూజ కంప్లైయింట్ చేసింది. ఇక గౌరవ్, నిఖిల్, తనూజ మాట్లాడుతుండగా.. మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది మాధురి. దీంతో తనూజకు కోపం వచ్చింది. నేను సంచాలక్ తో మాట్లాడుతున్నా.. అంటూ గట్టిగానే వాదించింది. మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ గట్టిగానే ప్రయత్నించారు.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
ఇవి కూడా చదవండి : ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.








