15 October 2025
ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.
Rajitha Chanti
Pic credit - Instagram
మలైకా అరోరా.. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్. చాలా సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు థామా సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది.
రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న థామా చిత్రంలో స్పెషల్ పాటలో నటించింది. మంగళవారం విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ మంచి రెస్పాన్స్ వస్తుంది.
అయితే 51 ఏళ్ల వయసులో క్రేజీ స్టెప్పులతో ఇరగదీసింది మలైక. దీంతో ఈ బ్యూటీ ఫిట్నెస్, స్కిన్ కేర్ రహస్యం గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.
మలైకా అరోరా.. రోజు క్యారెట్, దోసకాయ, నారింజ, నిమ్మకాయతో తయారు చేసిన స్పెషల్ డ్రింక్ తీసుకుంటుందట. ఆ జ్యూస్ ను రెటినోల్ డ్రింక్ అని పిలుస్తుందట.
ఇందులో ఉండే క్యారెట్ రసంలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించడంతోపాటు చర్మ రంగును మెరుగుపరిచి కణజాలాలను మరింత ఎనర్జీ చేస్తుంది.
నారింజ, నిమ్మకాయలలో ఉండే విటమిన్ సి.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజెన్ చర్మాన్ని దృఢంగా, మృదువుగా, యవ్వనంగా ఉంచుతుంది.
దోసకాయలో నీరు, ఫైబర్ శాతం ఉంటుంది. నిమ్మకాయ కడుపును శుద్ది చేస్తుంది. అలాగే నారింజ, నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని మరింత పెంచుతాయి.
ఈ రసం రోజూ తీసుకోవడం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, బొద్దుగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లను అందించి హైడ్రేట్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్