Bigg Boss 5 Telugu : ఉత్కంఠకు తెరపడినట్టేనా..? బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేది వీళ్ళేనా..?

Bigg Boss 5 Telugu : ఉత్కంఠకు తెరపడినట్టేనా..?  బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేది వీళ్ళేనా..?

బిగ్ బాస్ సీజన్ 5 మొదలవ్వకుండానే హడావిడి మాత్రం గట్టిగానే జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వెళ్లనున్నారన్నదని పై ఇప్పటి వరకు స్పష్టత..

Rajeev Rayala

|

Aug 19, 2021 | 6:16 PM

Bigg Boss Telugu 5 : బిగ్ బాస్ సీజన్ 5 మొదలవ్వకుండానే హడావిడి మాత్రం గట్టిగానే జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వెళ్లనున్నారన్నదని పై ఇప్పటి వరకు స్పష్టత అయితే రాలేదుకాని కొన్ని పేర్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో బిగ్ బాస్ రికార్డులను క్రియేట్ చేసింది. సీజన్1 నుంచి బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తూవస్తుంది. సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ సీజన్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సీజన్ 2కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేశారు. ఈ సీజన్ కూడా మంచి టీఆర్ఫీతో రన్ అయ్యింది. ఆ తర్వాత సీజన్3, 4లకు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ  సీజన్ 5కు కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే  బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేది ఎవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లలో యాంకర్ రవి – షణ్ముఖ్ జస్వంత్- ఆర్జే కాజల్ (యాంకర్)- నవ్య స్వామి (సీరియల్ హీరోయిన్)- నిఖిల్ (యాంకర్)- సిరి హనుమంత్ (సీరియల్ నటి)- శ్రీహాన్ (సీరియల్ నటుడు)- జస్వంత్ పాదాల (మోడల్)- వీజే సన్నీ (సీరియల్ నటుడు)- ప్రియాంకా రామన్ (క్రాక్ ఫేమ్)- జబర్దస్త్ ప్రియాంక అలియాస్ సాయి (ట్రాన్స్ జెండర్)- లోబో (యాంకర్)- సినీ నటి ప్రియ- ఈషా చావ్లా- ఉమాదేవి (కార్తీకదీపం భాగ్య)- ఆనీ మాస్టర్ (కొరియోగ్రాఫర్)-యాంకర్ రోజా – మానస్ (టీవీ నటుడు)- 7 ఆర్ట్స్ సరయు- జ్యోతి రాజ్ (ఆట సందీప్ భార్య)- ఆట సందీప్

ఈ పేర్లు దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తుంది. ఇప్పటికే వీరిలో కొంతమంది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నారని హింట్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నాడని కో యాంకర్ లాస్య హింట్ ఇచ్చింది. ఓ ఆడియో ఫంక్షన్‌లో ‘కొన్ని రోజుల్లో రవి కూడా కనిపించకుండా పోతాడేమో అని నా డౌట్.. ఏదో హౌస్‌లోకి వెళ్తున్నాడు కదా’.. అని నవ్వుతూనే అసలు మ్యాటర్ లీక్ చేసింది. అయితే యాంకర్ రవి  కవర్ చేసుకునే ప్రయత్నం చేయడంతో.. లాస్య కూడా ‘అదే మీ హౌస్‌లోకి వెళ్తున్నావ్’ కదా అని కవర్ చేసింది. దాంతో రవి ఎంట్రీ కన్ఫామ్ అంటూ హింట్ దొరికింది. ఇదిలా ఉంటే మరి కొద్దిరోజుల్లోనే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ పేర్లను విడుదల చేశే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం చేసాయడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna: విలన్ పాత్రకోసం విలక్షణ నటుడు.. బాలయ్య కోసం బరిలోకి తమిళ్ హీరో

Sai Dharam Tej – Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

Nayanthara : మెగాస్టార్ లూసిఫర్ రీమేక్‌లో నయనతార పాత్ర అదేనా..? క్లారిటీ వచ్చేసినట్టే.. ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu