AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ రోడ్డెక్కిన మోనిత!

కుటుంబ బంధాల మాధుర్యం.. వైవాహిక జీవితంలో అనుమాన భూతం తెచ్చే అనర్ధం.. ప్రేమ వికృత రూపం దాలిస్తే వచ్చే ఉపద్రవం.. అన్నిటినీ కలబోసి ధారావాహికగా ప్రతిరోజూ ఇంటిల్లపాదినీ అలరిస్తున్న సీరియల్ కార్తీకదీపం.

Karthika Deepam: దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ రోడ్డెక్కిన మోనిత!
Karthika Deepam Episode 1123
KVD Varma
|

Updated on: Aug 20, 2021 | 8:43 AM

Share

Karthika Deepam: కుటుంబ బంధాల మాధుర్యం.. వైవాహిక జీవితంలో అనుమాన భూతం తెచ్చే అనర్ధం.. ప్రేమ వికృత రూపం దాలిస్తే వచ్చే ఉపద్రవం.. అన్నిటినీ కలబోసి ధారావాహికగా ప్రతిరోజూ ఇంటిల్లపాదినీ అలరిస్తున్న సీరియల్ కార్తీకదీపం. తెలుగు ప్రేక్షకులకు నిత్యం వినోదాన్ని అందిస్తూ వస్తోంది కార్తీకదీపం. ఇప్పటివరకూ ఎన్నో మలుపులు తిరుగుతూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకూ 1122 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1123వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ప్రతి రోజు.. ప్రతి ఎపిసోడ్ అక్షరరూపంలో మీకోసం అందిస్తున్నాం. ఈరోజు (ఎపిసోడ్ 1123)లో ఏం జరగబోతోందో తెలుసుకోబోయే ముందు గతంలో ఏం జరిగిందో చూద్దాం..

ఇదీ జరిగింది..

మోనిత ఆడిన నాటకంలో చిక్కుకుని కటకటాల పాలవుతాడు కార్తీక్. దీప కార్తీక్ ను బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న తండ్రిని చూడాలని పిల్లలు సౌర్య, హిమ తల్లి దీప దగ్గర గొడవ చేస్తారు. దీంతో ఇష్టం లేకపోయినా.. దీప పిల్లలను తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. అక్కడ కార్తీక్ ను చూసి పిల్లలు బాధ పడతారు. ఎందుకు జైల్లో పెట్టారు అని అడుగుతారు. కార్తీక్ కు టిఫిన్ తినిపించడానికి పిల్లలు అక్కడి ఎస్ఐ ని పర్మిషన్ అడుగుతారు. దానికి అతను ఒప్పుకోడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ రామసీత అతన్ని ఒప్పించి కార్తీక్ ను బయటకు తీసుకువచ్చి టిఫిన్ పెట్టమని చెబుతుంది. ఈలోపు ఏసీపీ రోషిణి వచ్చి రామసీతపై కోప్పడుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉండగా దీపకు భాగ్యం ఫోన్ చేస్తుంది. ఆలయంలో పూజ చేయించడానికి వేలుతున్నామనీ, దీప కూడా వస్తే బావుంటుంది అనీ చెబుతుంది. దీప గుడికి వస్తానని అంటుంది. ఈ మాట కానిస్టేబుల్ రామసీత వింటుంది. ఇదీ నిన్నటి ఎపిసోడ్ (1122)లో జరిగింది. ఈరోజు (1123) ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో తెలుసుకుందాం.

పిల్లల ముందే కార్తీక్..దీపలను అవమాన పరుస్తుంది. దీంతో పిల్లలను తీసుకుని ఇంటికి వస్తుంది. పిల్లలు ఇద్దరూ తండ్రికి పోలీస్ స్టేషన్ లో అవమానపరచినందుకు తల్లిదగ్గర బాధపడతారు. అసలు కార్తీక్ ఎందుకు జైలులో ఉన్నాడో చెప్పమంటూ దీపను ఒత్తిడి చేస్తారు. చదువు మీద దృష్టి పెట్టమనీ..ఆ విషయాలు తీసుకొని తాము చూసుకుంటామనీ చెబుతుంది.

దీపను కొండెక్కిస్తాను..

భాగ్యం తన భర్తను తీసుకుని గుడికి వెళుతుంది. అక్కడ పూజారితో పూజ చేయిస్తుంది. దీప విషయం ఆయనతో మాట్లాడుతుంది. ఆయన మర్నాడు దీపను తీసుకుని గుడికి రమ్మని చెబుతాడు. అప్పుడు దీపతో ప్రత్యెక పూజ చేయిస్తాను అని అంటాడు. రామసీత..దీప గుడికి వస్తోంది అని ఇచ్చిన సమాచారంతో మోనిత సోది చెప్పే ఆమెలా వేషం వేసుకుని పిస్టల్ పట్టుకుని కారులో గుడికి వస్తుంది. దారిలో దీపను చంపేస్తాను అని అనుకుంటూ వస్తుంది. కానీ, అక్కడకు దీప రాలేదని తెలిసి నిరుత్సహపడుతుంది. వెంటనే కొత్తనాటకం మొదలు పెడుతుంది..భాగ్యంకు సోది చెబుతుంది. దీప జీవితం బాగుపడాలి.. కార్తీక్ బయటపడాలి అంటే మర్నాడు ఉదయం ఆరున్నర గంటలకు ప్రత్యేకంగా దీప ఒక్కదానితోనే పూజలు చేయించాలి తీసుకు రమ్మని చెబుతుంది. దీపను కొందేక్కేలా చూసే బాధ్యత తనదే అంటుంది. దీంతో అనుమానంగా చూసిన భాగ్యంకు దీప కష్టాలను తీర్చే బాధ్యత తనదే అని అంటున్నాను అని చెబుతుంది.

ఇక కార్తీక్ తల్లి సౌందర్య, తండ్రి ఆనందరావు కార్తీక్ ను బయటకు తీసుకురావడం కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తుంటారు. ఆనందరావు రోషిణి కంటె పై ఆఫీసర్ తో మాట్లాడినా ప్రయోజనం లేదన్నారని సౌందర్యకు చెబుతాడు. ఇక సౌందర్య లాయర్ తో మాట్లాదాననీ..మర్నాడు బెయిల్ కోసం ప్రయత్నిస్తాననీ చెబుతుంది.

నేను మిత్రుడిలానే ఉన్నాను..

మరోవైపు ఏసీపీ రోషిణి కార్తీక్ ను ఇంటరాగేట్ చేయడం మొదలు పెడుతుంది. కార్తీక్ జరిగిన విషయం ఆమెకు చెబుతాడు. తాను ప్రాణం పోసే డాక్టర్ అనీ..ప్రాణాలు తీయడం తనకు చాతకాదనీ చెబుతాడు. దానికి రోషిణి.. మోనితను చంపి.. మొన్నటివరకూ వైరాగ్యంతో మాట్లాడి.. ఇప్పుడు కొత్త కథ అల్లుతున్నారా? ఇక్కడే మీరు రెండు రకాలుగా మారి కనిపిస్తున్నారు. మీరు చెప్పే కట్టుకథలు నమ్మి మిమ్మల్ని వదిలేస్తాను అనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్.. మీరు నన్ను వదలరని తెలుసు. కానీ, మీరు నన్ను అడిగారు. నాకు తెలిసింది చెప్పాను. నేను మోనితకు మిత్రుడిలానే ఉన్నాను. ఆమె నన్ను శత్రువుని చేసుకుంది. నాలా ఇంకెంతమందిని శత్రువులుగా చేసుకుందో నాకేం తెలుస్తుంది? అని రోషిణికి సమాధానం ఇస్తాడు. దీంతో రోషిణి ఆలోచనలో పడుతుంది. ఇదీ ఈరోజు జరిగిన కథ. మరి రోషిణి ఈ కేసు విషయంలో ఏమి చేస్తుంది? దీపను చంపడం కోసం మోనిత చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? కార్తీక్ బయటకు వస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

మరిన్ని కార్తీకదీపం కథనాలు:

Karthika Deepam: దీపను చంపేస్తాను..కార్తీకదీపంలో మోనిత ఆట మళ్ళీ మొదలైంది..

Karthika Deepam: కార్తీకదీపంలో పెద్ద ట్విస్ట్..మోనిత కొత్త నాటకం …

Karthika Deepam: నీ భర్త మోనితను చంపేశాడు.. దీపకు షాక్ ఇచ్చిన రోషిణి..అంతా వాళ్ళే చేశారంటున్న కార్తీక్!

Karthika Deepam: మీ అమ్మనూ చంపేస్తాను..నిస్సిగ్గుగా నిజాలు కక్కిన మోనిత..నిజాలు విని కార్తీక్ షాక్..!