Karthika Deepam: నీ భర్త మోనితను చంపేశాడు.. దీపకు షాక్ ఇచ్చిన రోషిణి..అంతా వాళ్ళే చేశారంటున్న కార్తీక్!

అందర్నీ ఆకట్టుకుంటూ సాగుతున్న కార్తీకదీపం సీరియల్ కథ ట్విస్ట్ లతో సాగుతోంది. ఇప్పటికే మోనిత నిజస్వరూపం కార్తీక్ కు దీప వీడియో ద్వారా చూపించింది. అది చూసిన కార్తీక్ మోనిత వద్దకు ఆవేశంగా వెళతాడు.

Karthika Deepam: నీ భర్త మోనితను చంపేశాడు.. దీపకు షాక్ ఇచ్చిన రోషిణి..అంతా వాళ్ళే చేశారంటున్న కార్తీక్!
Karthika Deepam Episode 1114
Follow us
KVD Varma

|

Updated on: Aug 10, 2021 | 7:53 AM

Karthika Deepam: అందర్నీ ఆకట్టుకుంటూ సాగుతున్న కార్తీకదీపం సీరియల్ కథ ట్విస్ట్ లతో సాగుతోంది. ఇప్పటికే మోనిత నిజస్వరూపం కార్తీక్ కు దీప వీడియో ద్వారా చూపించింది. అది చూసిన కార్తీక్ మోనిత వద్దకు ఆవేశంగా వెళతాడు. ఆమెను నిలదీస్తాడు. దానికి ఏమాత్రం భయపడని మోనిత అదంతా కార్తీక్ మీద ప్రేమతోనే చేశాను అని ఉన్మాదిలా చెబుతుంది. పైగా తాను చేసిన నేరాలన్నిటినీ పూసగుచ్చినట్టు వివరిస్తూ గొప్పపని చేసినట్లుగా చెప్పుకొస్తుంది. ఆఖరుకు కార్తీక్ తల్లి గురించి కూడా ఎదో అనబోతుంది.. ఇదీ నిన్నటి ఎపిసోడ్ (1113) ఎపిసోడ్ లో జరిగింది. మరి ఈరోజు (ఎపిసోడ్ 1114) ఏమి జరగబోతోందో చూద్దాం..

నీ రాక్షస ప్రేమ కోసం చచ్చిపో!

”ఏమిటి ఆలోచిస్తున్నావు? దీప ఏమనుకుంటుంది అనా.. ఇన్ని చేసిన దాన్ని దీప ఓ లెక్కా.. అవసరమైతే మీ అమ్మను..అంటూ ఎదో చెప్పబోతున్న మోనితపై కార్తీక్ స్టాపిట్ అని అరుస్తాడు.. అయిపొయింది.. నీ చావు నా చేతిలో రాసిపెట్టి ఉంది. ఏ ప్రేమ కోసం నువ్వింతా చేశావో.. ఏ ప్రేమ కోసం ఉన్మాదిగా మారావో.. ఏ ప్రేమ కోసం నువ్వు రాక్షసిగా మారావో ఆ ప్రేమ కోసమే నువ్వు ఇప్పుడు చచ్చిపో..”అని గట్టిగా అరుస్తాడు. గదిలో బంధించి ఉన్న భాగ్యం ఈ మాటలు వింటూ టెన్షన్ పడుతుంటుంది. ఈలోపు కార్తీక్.. అని మోనిత అరుపు వినిపిస్తుంది.. తరువాత రెండుసార్లు తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది.

అంతా మీరే చేశారు..

ఇక అక్కడ దీప ఇంటి దగ్గర కంగారుగా అటూ ఇటూ తిరుగుతుంది. ఎక్కడికి వెళ్లి ఉంటారు అని కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈలోపు కార్తీక్ నీరసంగా ఇంటికి వస్తాడు. గబగబా దీప అతని దగ్గరకు వెళుతుంది. కార్తీక్ ఇంటిబయటే మెట్ల మీద కూచిండిపోతాడు. ఏమైంది డాక్టర్ బాబు.. ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది అలా ఉన్నారు? అంటుంది. ”అలసిపోయాను దీపా.. అందరూ కలసి నన్ను ఈ పరిస్థితికి దిగాజార్చేశారు. నా పరిస్థితికి కారణం నువ్వే దీపా. నిన్ను నేను అనుమానించిన రోజు.. నువ్వు ఆత్మాభిమానం అంతో ఇల్లువదిలి వెళ్ళిపోయావు. నువ్వు నిలబడి నన్ను నిలదీసి ఉంటె పరిస్థితి ఇంకోరకంగా ఉండేది అంటాడు. ఇక మా అమ్మ స్టుపిడ్ అని తిట్టడం తప్ప మరేమీ చేయకుండా నన్ను వదిలేసి.. నీ పక్కన చేరి నీకు న్యాయం చేయాలని ప్రయత్నించింది. కానీ, నన్ను ఇలా చేసింది. ఇంట్లో నా వాళ్ళు అందరూ. మీరంతా మీ గురించి ఆలోచించారు కానీ, నా గురించి ఆలోచించలేదు. నన్ను ఒంటరిని చేశారు. ఒంటరిని చేశారు. ఒక్కరైనా నా చెంప పగలగొట్టి నిజాన్ని నాకు తెలిసేలా చేస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వు ఆత్మాభిమానం అంటూ నన్ను వదిలి వెళ్ళిపోయావు. నాతో ఉండాల్సిన సమయంలో నా పక్కన లేవు. నేను అంత నింద నీమీద వేసినప్పుడు నా చెంప పగలగొట్టి.. ఆ విహారిని తీసుకువచ్చి నాముందు నిలబెట్టి ఉంటే.. లేదా నన్ను లాక్కెళ్ళి డీఎన్ఏ పరీక్షలు చేయించి ఉంటె పరిస్థితి ఇంతవరకూ వచ్చేదా. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే.. ఒక నింద మీదపడినపుడు దానిని చేరిపివేసుకుని నిజాయతీ నిరూపించుకోవడం. కానీ, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. నా వాళ్ళందరూ నన్ను దూరంపెట్టారు. అప్పుడు నాకు ఓదార్పు కోసం ఆ మోనిత దగ్గరకు వెళ్లాను. కేవలం ఓదార్పు కోసమే. అదే నా కొంప ముంచింది.

ఇది నేను నన్ను సమర్ధించుకోవాలని చెప్పడం లేదు. ఇక అన్నిటికన్నా విచిత్రం..ఆదిత్య నన్ను పిల్లలు పుట్టే అవకాశం ఉందొ లేదో టెస్ట్ చేయించుకోమని రెచ్చగొట్టడం. దాంతో నేను టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాను. అక్కడ తులసిని చూసి జరిగింది తెలుసుకున్నాను. నేను టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళడంతో మోనిత అలా చేసింది. మోనిత గర్భవతి ఎలా అయిందో తెలుసా? నేను ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా.. నేను టెస్ట్ చేయించుకోవడానికి వెళితే నా వీర్యంతో ఆమె కృత్రిమంగా గర్భవతి అయింది.” అని కార్తీక్ చెబుతాడు. దీంతో దీప షాక్ అవుతుంది. ”నేను నాకే తెలియకుండా మోనిత గర్భానికి కారణం అయ్యాను.” అంటూ కార్తీక్ బాధపడతాడు. నా పిల్లలు మంచి వాళ్ళు. మా అమ్మ చేసిన పనికి నా కూతురుని నేనే దత్తత తీసుకుని ఎవరి పిల్లనో పెంచినట్టు పెంచాను. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అని ప్రశ్నిస్తాడు. ఇంత చేసిన మోనిత మీద ఎవరికైనా చంపేయాలన్నంత కోపం రాదా? చెప్పు కోపం రాదా అని అడుగుతాడు కార్తీక్. ఈలోపు పిల్లలు వచ్చి డాడీ ఎక్కడికి వెళ్లావు? అని అడుగుతారు. ఇక్కడే ఉన్నాను. మనం అందరం కలసి దూరంత ఎక్కడికైనా వెళ్లిపోదాం అని అంటాడు.

కార్తీక్ ను చూడాలని ఉంది..

మరోవైపు కార్తీక్ తండ్రి ఆనందరావు కార్తీక్ ను చూడాలని ఉందని ఆదిత్య తో చెబుతాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు. పెద్దోడిని చూడాలని ఉంది. రాత్రే వెళదామని అనుకున్నాను. కానీ, మీరు కంగారు పడతారని వెళ్ళలేదు. మీ అమ్మ వచ్చేసరికి టైం పడుతుంది. అందుకే..మనం వెళ్లి కార్తీక్ ను చూసి వద్దాం అని అంటాడు ఆనందరావు. సరే డాడీ మీరు ఫ్రెష్ అయి రండి వెళదాం అని చెబుతాడు ఆదిత్య.

మోనిత శవం ఎక్కడ దాచావు?

కార్తీక్ ఇంటిదగ్గర దీప సెల్ ఫోన్ తెచ్చి కార్తీక్ కి ఇచ్చి పడండి వెళదాం అంటుంది. ఈలోపు ఏసీపీ రోషిణి అక్కడకు వస్తుంది. కార్తీక్ ఏమిటి విషయం ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నారు? అంటుంది. దీనికి దీప రండి మేడం మీ దగ్గరకే బయలుదేరాం అని అంటుంది. ఎందుకు సరెండర్ కావడానికా? అని ప్రశ్నిస్తుంది రోషిణి. సరెండర్ ఏమిటి మేడం. అని దీప అడుగుతుంది. మరి పారిపోవదానికా అని మళ్ళీ రోషిణి ప్రశ్నిస్తుంది. అసలు సరెండర్ ఏమిటి? పారిపోవడం ఏమిటి మేడం అని ప్రశ్నిస్తుంది దీప. ఏం నీ భర్త నీకేం చెప్పలేదా? అని అడుగుతుంది రోషిణి. దీప అయోమయంగా చూస్తుంది. చెప్పండి మిస్టర్ కార్తీక్ ఎక్కడ దాచారు? అని ప్రశ్నిస్తుంది రోషిణి. దాయడం ఎవరిని అని ప్రశ్నిస్తాడు కార్తీక్. మిస్టర్ కార్తీక్ మీ కళ్ళలో నిజాయితీ చూసి.. మోనితలో తడబాటు చూసి మీ మీద జాలి పడ్డాను. కానీ, మీరు ఇలాంటి పని చేస్తారని అనుకోలేదు. పైగా నన్ను ఎమీతెలియని వారిలా ప్రశ్నిస్తున్నారా? అంటుంది రోషిణి. దీంతో దీప అసలు ఏమైంది మేడం.. ఏమిటి మీరలా మాట్లాడుతున్నారు. మేము మోనిత నిజస్వరూపం మీకు చెప్పడం కోసం బయలుదేరాం అంటుంది. ఇప్పుడది అనవసరం దీపా.. ఎందుకంటే మోనిత చనిపోయింది అని చెబుతుంది. ఆమె శవం కూడా దొరకలేదు. పడండి మిస్టర్ కార్తీక్ అని అంటుంది రోషిణి.. ఇదీ ఈరోజు కథ. మరి తరువాత ఏమైంది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

మోనితను చంపింది నేనే!

కార్తీక్ పోలీస్ స్టేషన్ లో కటకటాల వెనుక ఉన్నాడు. ఇంతలో అక్కడికి అతని తల్లి వచ్చి రోషిణి ముందు నిలబడుతుంది. మేరు వచ్చారు ఏమిటి మేడం అని అడుగుతుంది రోషిణి. మోనితను చంపింది నేనే.. అందుకు ఉపయోగించిన రివాల్వర్ ఇదే.. అని అంటుంది ఆమె. మా అబ్బాయి కార్తీక్ కు నేనంటే పిచ్చి ప్రేమ అందుకే ఆ నేరం తనమీద వేసుకున్నాడు అని చెబుతుంది.. ఇది కార్తీకదీపం తాజా ప్రోమో. మరి ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Also Read: మరిన్ని కార్తీకదీపం సీరియల్ కథనాల కోసం ఇక్కడ చూడండి:

Karthika Deepam: మీ అమ్మనూ చంపేస్తాను..నిస్సిగ్గుగా నిజాలు కక్కిన మోనిత..నిజాలు విని కార్తీక్ షాక్..!

Karthika Deepam: కార్తీకదీపం షాకింగ్ ట్విస్ట్..మోనితను చంపేసిన కార్తీక్..!

Karthika Deepam: నిజం తెలుసుకోలేని కార్తీక్..తప్పించుకున్న అంజి..మోనిత ముహూర్తం చుట్టూ కార్తీకదీపం ట్విస్ట్!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీప చాకచక్యం..డాక్టర్ బాబు బయటపడినట్టేనా?

Karthika Deepam: మోనితకు దొరికిన అంజి..దీపకు షాక్..కార్తీక్ టెన్షన్..