Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీప చాకచక్యం..డాక్టర్ బాబు బయటపడినట్టేనా?

జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టు సాగదు. అదేవిధంగా ఎంత చదువుకున్నా.. ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎదుటివారిని అంచనా వేయడం కష్టం. అందులోనూ వైవాహిక జీవితంలో అనుమానం అనే బీజం పడ్డాకా ఆలోచనలన్నీ అస్తవ్యస్తంగానే సాగుతాయి.

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీప చాకచక్యం..డాక్టర్ బాబు బయటపడినట్టేనా?
Karthika Deepam Episode 1110
Follow us
KVD Varma

|

Updated on: Aug 05, 2021 | 8:27 AM

Karthika Deepam: జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టు సాగదు. అదేవిధంగా ఎంత చదువుకున్నా.. ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎదుటివారిని అంచనా వేయడం కష్టం. అందులోనూ వైవాహిక జీవితంలో అనుమానం అనే బీజం పడ్డాకా ఆలోచనలన్నీ అస్తవ్యస్తంగానే సాగుతాయి. ఆ మానసికస్థితిలో తీసుకునే నిర్ణయాలు.. చేసే పనులూ ఒక్కోసారి వికటిస్తాయి. ఇప్పడు కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పరిస్థితి అదే. కార్తీక్ పై ఉన్న రాక్షస ప్రేమతో అతని దాంపత్య జీవితాన్ని నాశం చేయాలని చూసింది మోనిత. స్నేహం ముసుగులో రాక్షసక్రీడ మొదలు పెట్టింది. కార్తీక్ కు తనభార్య దీపపై అనుమానం కలిగేలా చేసింది. అయితే, దీప సహనానినికి మరోపేరు. ఆత్మవిశ్వాసం..సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మహిళ. భర్త తనను అనుమానిస్తే మౌనంగా వెళ్ళిపోయింది. వంటలక్కగా జీవితం ప్రారంభించి.. తన భర్త తనను అర్ధం చేసుకుంటాదనే నమ్మకంతో పదేళ్ళు ఎదురు చూసింది. ఈ పదేళ్ళలో మోనిత చేసిన ప్రతి కుట్రనూ చాకచాక్యంగా ఎదుర్కొంటూ వచ్చ్చింది. చివరికి కార్తీక్ కు అసలు విషయం తెలిసింది. దీప నిప్పు అని గ్రహించాడు. దీంతో తన భార్య, పిల్లల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలోకి వచ్చాడు.

ఇటువంటి సమయంలో దీపకు కార్తీక్ దగ్గర అవడం తట్టుకోలేని మోనిత కొత్త నాటకం ప్రారంభించింది. మరో ఎత్తు వేసింది. కానీ, దీప మోనిత చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకుంటూ వస్తోంది. మోనిత పాపాలకు ఒక సాక్ష్యం ఉంది. అదే అంజి. అతని ద్వారానే కార్తీక్ మొదటి ప్రియురాలు హిమను ఏక్సిడెంట్ చేయించి చంపేస్తుంది మోనిత. ఆ విషయం దీపకు తెలుసు. ఇప్పుడు ఆ అంజిని పట్టుకుని మోనిత నిజస్వరూపం బయటపెట్టాలని దీప ప్రయత్నిస్తుంది. అదే అంజిని అడ్డుతోలగించు కోవాలని మోనిత ప్రయత్నం. ఇప్పడు ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? దీప తన కాపురం నిలబెట్టుకునే పని చేయగలదా? అంజిని చంపి అయినా సరే కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్న మోనిత పంతం నెగ్గుతుందా? ఇదీ ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగిపోతున్న కార్తీకదీపం మెగా సీరియల్ ఇప్పటివరకూ జరిగిన కథ. నిన్నటితో 1109 ఎపిసోడ్లు పూర్తి చెసుకుని ఈరోజు 1110వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. కార్తీకదీపం సీరియల్ కు అక్షరరూపం ఇది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందో చూద్దాం..

మోనితను బెదిరించిన అంజి..

అంజి సూర్యాపేటలో ఉన్నాడని తలిసి అతన్ని కలవడం కోసం ఒకపక్క మోనిత.. మరో పక్క దీప బయలు దేరారు. మోనిత టైం బాగోక తన కారు చెడిపోయి.. అనుకోని పరిస్థితిలో దీప ఉన్న కారు ఎక్కింది. అయితే, దీప తాను విజయవాడ వెళుతున్నానని నమ్మించింది మోనితను. మోనిత అది నిజమని నమ్మి తాను విజయం సాధించాననే అందంలో సూర్యాపేటలో అంజి ఉన్న హోటల్ దగ్గర కారు దిగిపోతుంది. దీప విజయవాడ వెళుతున్నట్టు కారును ముందుకు తీసుకువెళ్ళిపోతుంది. తరువాత కొద్ది సేపటికి మళ్ళీ వెనక్కి వస్తుంది. మెల్లగా అంజి ఉన్న గది వద్దకు చేరుతుంది. అక్కడ మోనిత..అంజితో మాట్లాడుతో ఉండటాన్ని ఫోన్ లో వీడియో తీస్తూ ఉంటుంది. మోనిత మొదట అంజి కాళ్ళు పట్టుకుంటుంది. తను మరిపోయాననీ.. తన పెళ్ళికి పెద్దగా ఉండమనీ అజ్నిని అడుగుతుంది మోనిత. కానీ, అంజి మాత్రం ఆమెను నమ్మడు. ”ఎం జుట్టు అందలేదా? కాళ్ళు పట్టుకున్తున్నావు?” అని అడుగుతూనే.. నీ నిజస్వరూపం బయటపెడతాను అని అంటాడు. అయితే మోనిత దీప గురించి మాట్లాడుతుంది. దీంతో అంజి ”దీపమ్మ కు ఏదైనా జరిగిందో నిన్ను నేను ఏంచేస్తానో చూడు.” అని మోనితను బెదిరిస్తాడు.

చంపించిన నేను నేరస్తురాలిని అయితే..

అంజి తనకు రివర్స్ కావడం..దీపను గొప్పగా చెప్పడంతో మోనిత ఒక్కసారిగా క్రూరంగా మారిపోతుంది. ”ఆపరా..ఏంట్రా అందరూ దీప అంటూ దాని భజన చేస్తున్నారు? దాని గొప్ప ఏమిటిరా? అసలు నువ్వు నన్ను ఏమిచేయగలవు. అంత దమ్మున్నవాడివి అయితే కార్తీక్ కాలర్ పట్టుకుని హిమను చంపించింది నేనే అని కార్తీక్, దీపాలకు అర్ధం అయ్యేలా ఎందుకు చెప్పలేదు? నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. యాక్సిడెంట్ చేసి ఒకే కారులో కార్తీక్, హిమా ఉన్నా హిమను మాత్రమే చచ్చిపోయేలా చేసావు. నా కార్తీక్ ఏమీకాకుండా జాగ్రత్తగా యాక్సిడెంట్ చేశావు. అయినా దానికోసం కూడా నా దగ్గర నుంచి బోలెడు డబ్బులు గుంజారు కదరా. ఇంకోటి.. హిమను చంపించిన నేను నేరస్తురాల్ని అయితే, చంపిన నువ్వూ నేరస్తుడివే. అందుకే నాకు సహాయం చేయి. రేపు నా పెళ్లి. అసలే నిద్ర వస్తోంది. పడుకోకపోతే నా గ్లామర్ పోతుంది.” అని అంటుంది. దీంతో అంజి.. అదీ సంగతి.. ఇప్పుడు నీకు నా జుట్టు అందింది. నిన్ను ఎవరు నమ్ముతారే. ఒక్క నిమిషంలో నీలో పిశాచి బయటకు వచ్చేసింది. నువ్వు ఎక్కువసేపు నటించలేవు. నాకు తెలుసు అని అంటాడు. గదిలో జరుగుతున్న ఈ ఘటనలు అన్నీ దీప వీడియో తీస్తూ ఉంటుంది.

అంజిని బంధించిన మోనిత

అంజి అలా అనగానే..మోనిత తన బ్యాగ్ లోంచి తుపాకీ తీస్తుంది. నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపెయగలను. కానీ, నిన్ను చంపితే నా పెళ్లి ఆగిపోతుంది. అందుకే..నిన్ను వేరేవాళ్ళతో చంపించడానికి ప్లాన్ చేశాను. అని అంటుంది. ద్రాక్షారామం.. అని పిలుస్తుంది. ఒక వ్యక్తి లోపలి వస్తాడు. అతనితో అంజిని కట్టేసి డిక్కీలో వేయమని చెబుతుంది. అతను అంజి చేతులు కట్టేస్తాడు. దీప అక్కడ నుంచి తిరిగి బయలుదేరిపోతుంది.

కార్తీక్ టెన్షన్

అక్కడ కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు. వారణాశిని ఫోన్ చేసి పిలుస్తాడు. వారణాశి కంగారుగా వస్తాడు. ”ఏమైంది డాక్టర్ బాబూ..ఇంత అర్ధరాత్రి నన్ను పిలిచారు.” అని టెన్షన్ గా అడుగుతాడు. దీప ఎక్కడికి వెళ్ళింది నీకు తెలుసా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నిజంగా నాకు తెలీదు డాక్టర్ బాబు అని చెబుతాడు వారణాశి. ”ఒరే..నిన్ను నాలుగు పీకి అడగకుండా..ఇంత మెల్లగా అడుగుతున్నాను అంటే అర్ధం చేసుకోరా నా పరిస్థితి నిజం చెప్పరా” అని కార్తీక్ అడుగుతాడు. ‘నిజంగా నాకేమీ తేలీదు. అక్క మా ఫ్రెండ్ వెంకటేష్ కారు పిలిపించమంది. పిలిపించాను.” అంటాడు. వెంకటేష్ నెంబర్ ఉంటె ఫోన్ చేయి అని వారణాశికి చెబుతాడు కార్తీక్. వారణాశి ఫోన్ చేస్తాడు. అయితే..ఫోన్ స్విచాఫ్ వస్తుంది. దీంతో వారణాశిని వెళ్ళిపొమ్మని చెప్పి కార్తీక్ కోర్చుని ఆలోచిస్తుంటాడు.

వెనుదిరిగిన దీప

దీప కారులో వెనక్కి వచ్చేస్తుంటుంది. డ్రైవర్ వెంకటేష్ ”అక్కా..విజయవాడ అని చెప్పావు.. దారిలో ఆ డాక్టరమ్మ కారెక్కింది. సూర్యాపేటలో దిగిపోయింది. నువ్వు విజయవాడ వెళ్ళకుండా కారు వెనక్కి తిప్పావు. హోటల్ లోకి వెళ్లి వచ్చావు.. ఏమి జరుగుతోంది అర్ర్ధం కావడం లేదు.” అంటడు. నాకూ అర్ధం కావడంలేడురా అని చెప్పిన దీప నీ ఫోన్ ఒకసారి ఇవ్వు డాక్టర్ బాబుకు ఫోన్ చేస్తాను అంటుంది. అయ్యో అక్క ఇపుడే ఫోన్ చార్జింగ్ అయిపొయింది అంటాడు వెంకటేష్. చార్జింగ్ పెట్టారా అంటుంది దీప. కంగారులో చార్జర్ తీసుకురాలేదక్కా అని చెబుతాడు వెంకటేష్. సరేలే త్వరగా పోనివ్వు అని చెబుతుంది దీప.

షాక్ లో మోనిత

మోనిత అలసిపోయి ఇంటికి వస్తుంది. ప్రియమణిని పిలిచి వేన్నీళ్ళు పెట్టు స్నానం చేయాలి అంటుంది. ఇందాకే గీజర్ ఆన్ చేశానమ్మా అని చెబుతుంది ప్రియమణి. అలిసినట్టుగా ఉన్న మోనితను చూసిన ప్రియమణి అమ్మ..రాత్రి కార్తీక్ అయ్య వచ్చి వెళ్లారు అని చెబుతుంది. దాంతో మోనిత షాక్ అవుతుంది. కార్తీక్ ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది. ఏమో అమ్మ వచ్చారు. మిమ్మల్ని అడిగారు. మీరు లేరని చెప్పాను. ఎప్పుడు వస్తారని అడిగారు.. ఉదయం వస్తారని చెప్పాను అంటుంది. తర్వాత ”అమ్మ నేను ఒకటి చెబుతాను. మీ జీవితం చేజారిపోకుండా చూసుకోండి.” అని చెప్పి వెళ్ళిపోతుంది. దీంతో మోనిత కార్తీక్ ఎందుకు వచ్చాడు? ఎక్కడో అపశ్రుతి కొడుతోంది. కార్తీక్ తో నా పెళ్లి జరగదా? అనుకుంటుంది.

ఇంటికి చేరిన దీప

అక్కడ కార్తీక్ సోఫాలో పడుకుని ఉంటాడు. తెల్లవారిపోతుంది. కార్తీక్ కు మెలుకువ వస్తుంది. దీప ఉదయాన్నే వచ్చేస్తాను అంది తలుపు తీసే ఉంది.. వచ్చి పిల్లల దగ్గర పాడుకుందా? అనుకుంటూ పిల్లల గదిలో చూస్తాడు. దీప కనిపించదు. ఏమైపోయింది అనుకుంటూ బయటకు వస్తాడు ఈలోపు దీప వస్తుంది. పాలప్యాకెట్లు తీసుకుని లోపలి వెళుతున్న దీపను ఆపి ఎక్కడికి వెళ్లావు? నాకు అబద్ధం చెప్పి వెళ్లావు. మీ పిన్ని ఫోన్ చేసింది. నాకు నువ్వు అక్కడకు వెళ్లలేదని అర్ధం అయింది. కానీ, ఎక్కడికి వెళ్లావు? నువ్వు నాకోసమే ప్రయత్నాలు చేస్తున్నావని తెలుసు. కానీ ఇంత రిస్క్ తీసుకున్తున్నవెందుకు? మోనిత కూడా కనిపించలేదు. అంటే ఇద్దరూ కలిసి వెళ్ళారా? మోనిత నువ్వు ఘర్షణ పడ్డారా అర్ధం కాక తెల్లవార్లూ నేనూ ఆదిత్య ఊరంతా వెతుకుతూనే ఉన్నాం అని గబగబా చెప్పేస్తుంటాడు కార్తీక్. అతన్ని ఆపు చేసిన దీప వేడిగా కాఫీ చేసి ఇచ్చాకా.. స్నానాలు చేసి మాట్లాడుకుందాం అంటూ లోపలి వెళ్ళిపోతుంది.

బెడిసికొట్టిన నాటకం

ఇక ఇక్కడ మోనిత ఇంటిదగ్గరకు భాగ్యం వస్తుంది. ఈరోజుతో నీ పీడ దీపకు వదిలిపోవాలి. ఈ మాస్ మహారాణి అర్ధపావు భాగ్యం అంటే ఏమిటో నీక ఉ చూపిస్తానే మోనిత అనుకుంటూ లోపలి వస్తుంది. మోనిత ఆమెను చూసి ఏమిటి ఈవిడ వస్తోంది అనుకుంటుంది. ఏమిటి విషయం ఎందుకు వచ్చారు అంటుంది. దానితో..కార్తీక్ రాత్రి నుంచి నిన్ను చంపాలని కత్తి పట్టుకు తిరుగుతున్నాడు. అని చెబుతుంది. కార్తీక్ నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నాడు అని ప్రశ్నిస్తుంది మోనిత. ఎవరో అంజి అంట నీ గురించి మొత్తం అంతా కార్తీక్ కి చెప్పడంట అని చెబుతుంది. దీంతో భాగ్యం ఎదో నాటకం ఆడుతోంది అని తెలిసిపోతుంది మోనితకు. ఆమెను ఒక గదిలోకి తీసుకువెళ్ళి.. కూచోపెట్టి.. పిన్నిగారు..తప్పు కార్తీక్ చేస్తే అందరూ నన్ను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ఆత్మహత్య చేసుకునదాం అనుకుంటున్నాను అంటూ చెబుతుంది. దీంతో భాగ్యం షాక్ అవుతుంది.

ఏం జరగబోతోంది..

25 వ తేదీ వచ్చేసింది.. ఒక పక్క మోనిత అంజిని బంధించేసి తనకు అడ్డు లేకుండా చేసుకున్నాను అనుకుంటోంది. మరోపక్క ఈ విషయం కార్తీక్ కు చెప్పకుండా ఒక ఎడ్రస్ చెప్పి అక్కడకు వెళ్ళమని చెబుతుంది దీప. అక్కడ అన్నీ మీకే తెలుస్తాయి అని పంపిస్తుంది. ఇప్పుడు ఏమి జరుగుతుంది? అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే!

Also Read: మరిన్ని కార్తీకదీపం సీరియల్ కథనాల కోసం ఇక్కడ చూడండి:

Karthika Deepam: మోనితకు దొరికిన అంజి..దీపకు షాక్..కార్తీక్ టెన్షన్..

Karthika Deepam: ధర్మం కోసం ఒకరు.. పంతంతో మరొకరు.. ఒకే కారులో ఉప్పూ..నిప్పూ.. కార్తీకదీపంలో యాక్షన్ సెగ!

Karthika Deepam: మోనితను నిలదీసిన ప్రియమణి..దొరికిన ఆచూకీ.. అంజి కోసం బయలుదేరిన దీప!

Karthika Deepam: ట్విస్ట్ ఇద్దమనుకుంటే షాక్ ఇచ్చిన కార్తీక్..దీప..మోనిత నషాళానికి అంటిన అంజి ‘పాన్’ మసాలా!

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..