Karthika Deepam: మోనితకు దొరికిన అంజి..దీపకు షాక్..కార్తీక్ టెన్షన్..

KVD Varma

KVD Varma |

Updated on: Aug 04, 2021 | 8:09 AM

కార్తీకదీపం..ప్రతిరోజూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్. ఇంటిల్లిపాదీ ఆసక్తిగా చూస్తున్న సీరియల్. కుటుంబ బంధాలు.. మంచీ,చెడుల మధ్య ఉండే సన్నని గీతలు.. అనుబంధాల మధ్యలో అపార్ధాలు..

Karthika Deepam: మోనితకు దొరికిన అంజి..దీపకు షాక్..కార్తీక్ టెన్షన్..
Karthika Deepam Episode 1109

Follow us on

Karthika Deepam: కార్తీకదీపం..ప్రతిరోజూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్. ఇంటిల్లిపాదీ ఆసక్తిగా చూస్తున్న సీరియల్. కుటుంబ బంధాలు.. మంచీ,చెడుల మధ్య ఉండే సన్నని గీతలు.. అనుబంధాల మధ్యలో అపార్ధాలు.. అన్నిటినీ కలగలిపి బిగి సడలని కథనంతో ముందుకు సాగుతోంది కార్తీకదీపం. కుటుంబ సమేతంగా చూడదగ్గ అతి కొద్దీ కార్యక్రమాల్లో ఒకటిగా కార్తీకదీపం విజయయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ 1108 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. అయినా.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని ప్రేక్షకాదరణతో కార్తీకదీపం ప్రసారం అవుతోంది.

నిన్న (ఎపిసోడ్ 1108) ఏం జరిగిందంటే..

అంజి గురించి తెలిస్తే చెప్పమని ఏసీపీ రోషిణిని అడుగుతాడు కార్తీక్. అయితే, ఆ పని తనది అని.. ఇటువంటి వాటిలో తల దూర్చి మరో చిక్కులో పడవద్దు అని చెబుతుంది. ఇక దీపకు రోషిణి ఫోన్ చేసి అంజి సూర్యాపేటలో ఉన్నాడనీ, వెంటనే బయలుదేరి అక్కడకు వెళ్ళమనీ చెబుతుంది. మరోవైపు మోనితకు కూడా అంజి సూర్యాపేటలో ఉన్నదన్న విషయం తెలుస్తుంది. దీంతో ఆమె సూర్యాపేట వెళ్ళడానికి రెడీ అవుతుంది. దీప తాను భాగ్యం వద్దకు వేలుతున్నననీ, ఉదయం వచేస్తాననీ కార్తీక్ కు చెప్పి టాక్సీలో సూర్యాపేట బయలుదేరుతుంది. మోనిత కూడా తన కారులో సూర్యాపేట వెళుతుంటుంది. ఈలోపు భాగ్యం దీపకు ఫోన్ చేస్తుంది. కానీ, దీప ఫోన్ ఇంటిలోనే వదిలి వెళుతుంది. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేస్తే దీపతో మాట్లాడాలని చెబుతుంది. కార్తీక్ కు దీప భాగ్యం దగ్గరకు వెళుతున్నాను అంది. మరి ఎక్కడికి వెళ్ళింది అని ఆందోళన మొదలవుతుంది. ఆదిత్యతో విషయం చెప్పి కంగారు పడుతుంటాడు. మరో వైపు సూర్యాపేట బయలుదేరిన మోనిత దారిలో అంజి దొరికినందుకు సంబరపడిపోతుంటుంది. అంజి చెప్పిన మాట వింటే సరే.. లేకపోతే కాల్చి చంపేయాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో కారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోతుంది. ఎలాగైనా సూర్యాపేట వెళ్లాలని..లిఫ్ట్ కోసం ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయంలో దీప కారు మోనిత ఉన్న ప్రాంతానికి వస్తుంది. దీప కారులో వెనుక పడుకుని.. మోనితను కారు ఎక్కించుకొమ్మని డ్రైవర్ కు చెబుతుంది. ఇప్పుడు ఒకే కారులో ఇద్దరూ ఒకే వ్యక్తి కోసం సూర్యాపేట వెళుతున్నారు. మరి తరువాత ఏమైంది.. ఈరోజు (ఎపిసోడ్ 1109) లో తెలుస్తుంది.

కారులో దీపను చూసిన మోనిత..

కారులో కూచున్న మోనిత అంజి దొరికిన వెంటనే ఏం చేయాలనే ప్లాన్స్ వేస్తుంటుంది. యాదగిరిగుట్ట వద్ద ఉన్న ఫాం హౌస్ కు సూర్యాపేట నుంచి కారు బుక్ చేయమని ఫోన్ లో తన మనుషులకు చెబుతుంది. అలాగే, అక్కడి తన విల్లా క్లీన్ చేయమని చెబుతుంది. మనసులో దీపా ఇప్పడు చెబుతాను నీ పని. కనుబొమలు ఎగరేసి.. అదేదో వజ్రాలహారం అన్నట్టు మాటి మాటికీ తాళిబొట్టు తీసి చూపిస్తావు కదా. రేపు మధ్యాహ్నం అయ్యేసరికి కార్తీక్ ను నేను పెళ్లి చేసుకుంటాను ఏమి చేస్తావో చూస్తాను అని అనుకుంటుంది. కారులో వెనుక పడుకున్నట్టు నటిస్తున్న దీప మోనిత ఫోన్ లో మాట్లాడిన మాటలు వింటుంది. తన ఫోన్ ఇంటిలో వదిలేసినందుకు బాధపడుతుంది. మోనితకు ఝలక్ ఇవ్వాలని డ్రైవర్ ను లైట్ వేయమని చెబుతుంది. మోనితకు అది దీప గొంతులా అనిపించి వెనక్కి తిరిగి చూసి అక్కడ దీపను చూసి షాక్ అవుతుంది. అయినా, వెంటనే తేరుకుంటుంది. దీప ”ఎక్కడికో బయలుదేరినట్టున్నావు” అంటూ మోనితను ప్రశ్నిస్తుంది. నువ్వా..దీపక్కా అంటూ మోనిత డ్రైవర్ ను కారు ఆపమంటుంది. వెనుక సీట్ లోకి మారిన మోనిత అక్కా కారులో నువ్వున్నావని తెలీదు అంటూ చెబుతుంది.

అంతవరకూ రానీయకూడదు..

మరోవైపు దీప కోసం ఆదిత్యతో కలిసి వెతుకుతుంటాడు కార్తీక్. ఆదిత్య మోనితకు ఫోన్ చేస్తాడు. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అదేవిషయాన్ని కార్తీక్ కు చెబుతాడు. దీంతో కార్తీక్ మరింత కంగారు పడతాడు. ఆదిత్య..నాకు తెలిసి వదిన, మోనిత ఒకే దగ్గర ఉండి ఉంటారు.. అంటాడు. రేపు ఉదయం కల్లా వదిన తిరిగి రాకపోతే ఏసీపీకి ఫోన్ చేసి విషయం చెప్పు అన్నయ్యా.. మోనితను నాలుగు పీకితే విషయం చెబుతుంది అంటాడు ఆదిత్య. అంతవరకూ రానీయకూడదు. అని కార్తీక్ అంటూనే దీప ఫోన్ తీసుకెళ్లలేదని చిరాకు పడతాడు.

దుర్గ కోసం వెళుతున్నా..

ఇక్కడ హైవేలో దీప..మోనిత కారు పక్కన నిలబడి ఉంటారు. మోనిత”డ్రైవర్ వెంకటేష్ టీ తాగి వచేలోపు.. మనం ఓపెన్ గా మాట్లాడుకుందామా అక్కా.” అంటుంది మోనిత. ”ఓపెన్ గా ఎందుకు క్లోజ్ గా మాట్లాడుకుందాం” అని దీప చెబుతుంది. మోనిత దీపను నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది. దుర్గ దగ్గరకి అని చెబుతుంది దీప దీంతో మోనిత షాక్ అవుతుంది. మోహంలో రంగులు మారతాయి. అది చూసిన దీప ”దుర్గ విజయవాడలోనే కదా ఉండేది. నా జీవితంలో కష్టాలు పోవాలని దుర్గమ్మను దర్శనం చేసుకుని వద్దామని వెళుతున్నాను” అంటుంది. దీంతో సర్దుకున్న మోనిత దీపకు అంజి గురించి తెలియదు అని సమాధాన పడుతుంది. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోతుంది. ”రేపు జరుగుతున్న నా పెళ్లికి వంటవాళ్ళను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నువ్వు దుర్గమ్మ దర్శనం చేసుకుని వచ్చేసరికి మా పెళ్లి అయిపోతుంది.” అని చెబుతుంది. దీంతో దీప అది నీ వల్ల కాదు అని చెబుతుంది. సరిగ్గా అదే సమయానికి నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను అని చెబుతుంది. ఈలోపు వెంకటేష్ రావడంతో ఇద్దరూ కారులో ఎక్కుతారు. సూర్యాపేట హోటల్ 8 దగ్గరకు వచ్చిన తరువాత మోనిత కారు అపమంటుంది. కారు దిగిన మోనిత ”ఏమిటి దీపా అలా చూస్తున్నావు” అంటుంది. ఇక్కడ చూడటానికి ఏముంది అంతా చీకటి అని చెబుతుంది. తరువాత దీప కారును ముందుకు పోనీయమని చెబుతుంది. దీప కారు దూరంగా వెళ్ళేవరకు మోనిత చూస్తుంది. ”పిచ్చి దీపా.. ఎలా నమ్మేశావే” అనుకుంటూ హోటల్ లోకి వెళుతుంది. కొద్దిగా ముందుకు వెళ్ళిన దీప తరువాత కారు వెనక్కి తిప్పి హోటల్ వద్దకు తీసుకువెళ్ళమని డ్రైవర్ వెంకటేష్ కు చెబుతుంది.

పాము వానపాము అవుతుందా?

మోనిత హోటల్ లో అంజి రూమ్ తెలుసుకుని అక్కడికి వెళుతుంది. అక్కడ అంజి మోనితను చూసి ఆశ్చర్యపోతాడు. ఈలోపు మోనిత అతని కాళ్ళ మీద పడుతుంది. నన్ను క్షమించు అని అడుగుతుంది. రేపు తన పెళ్లి అని చెబుతుంది. ”ఎవరితో నీ పెళ్లి.. ఆ డాక్టర్ కార్తీక్ తోనేనా అని అడుగుతాడు. కాదు..ఈయన కూడా డాక్టరు అని చెబుతుంది. ”ఆపవే..నీ నాటకాలు. ఎవరికి చెబుతావు ఈ కథలు? అంటూ అంజి సీరియస్ అవుతాడు. నువ్వు మారావంటే నేను ఎలా నమ్ముతాను. విషపు పాము వానపాము అయ్యిందంటే ఎవ్వరూ నమ్మరు. జుట్టు అందలేదా? కాళ్ళు పట్టుకున్నావ్” అని కోపంగా అంటాడు. దీంతో మోనిత అతనిని బ్రతిమిలాడుతుంది. ”హిమను చంపించాను. నిన్ను చంపించాలని ప్రయత్నించాను. దీపను కార్తీక్ ను విడదీశాను. కానీ, ఈ పాపాలన్నీ కదిగేసుకోవాలని.. దీపను కార్తీక్ ను ఒక్కటి చేశాను. రేపు వాళ్ళిద్దరూ నా పెళ్ళికి పెద్దలు. నేను మా అన్నయ్య లాంటి వాడు ఉన్నాడు అతను కూడా పెళ్ళికి వస్తాడు అని చెప్పను. అది నువ్వే అంజీ. నా పెళ్ళికి పెద్దగా వచ్చి సాక్షి సంతకం చేయాలి” అని అంటుంది. దీంతో ఒళ్ళు మండిన అంజి.. చూడూ నిన్ను నేనే కాదు ఎవరూ నమ్మరు. అయినా ఏమిటీ కొత్త నాటకం. నువ్వు దీపమ్మకు ఏదైనా హాని చేయాలని చూశావో అంటూ చేయి ఎత్తుతాడు..

నిన్ను చంపేస్తాను.. 

దీంతో ఒక్కసారిగా మోనిత కోపంతో ఊగిపోతుంది. ”అపరా! ఎంటిరా దీప అంటున్నావు?” అంటూ పర్స్లో పిస్టల్ తీసి అంజికి ఎక్కుపెడుతుంది. దీప ఈ దృశ్యాన్ని చూసి భయపడుతుంది. మోనిత”అసలు దీపమ్మ అని దాని భజన చేస్తారేమిటిరా? ఎప్పుడన్నా పచ్చడి వేసి నాలుగు మెతుకులు పెట్టిందా ఆ వంటలక్క. నేను బోలెడు డబ్బులు మీకు ఇచ్చాను.మీరేమిటిరా దీప.. అంటూ దాని భజన చేస్తున్నారు అని అంటుంది. ఇప్పుడు ఇంకో మాట మాట్లాడినా నిన్ను చంపేస్తాను” అని బెదిరిస్తుంది. ఇది చూసిన దీప భయపడుతుంది. ఇదీ ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన కథ.

మరి ఇప్పుడు అంజిని మోనిత ఏం చేస్తుంది. దీప అంజిని రక్షిస్తుందా? అసలు దీపను అంజి కోసం పంపిన రోషిణి ప్లాన్ ఏమిటి? ఇవన్నీ రేపటి ఎపిసోడ్ (1110) తెలుసుకోవలసిందే.

Also Read: మరిన్ని కార్తీకదీపం సీరియల్ కథనాల కోసం ఇక్కడ చూడండి:

Karthika Deepam: ధర్మం కోసం ఒకరు.. పంతంతో మరొకరు.. ఒకే కారులో ఉప్పూ..నిప్పూ.. కార్తీకదీపంలో యాక్షన్ సెగ!

Karthika Deepam: మోనితను నిలదీసిన ప్రియమణి..దొరికిన ఆచూకీ.. అంజి కోసం బయలుదేరిన దీప!

Karthika Deepam: ట్విస్ట్ ఇద్దమనుకుంటే షాక్ ఇచ్చిన కార్తీక్..దీప..మోనిత నషాళానికి అంటిన అంజి ‘పాన్’ మసాలా!

Karthika Deepam: అంజిని ప్రేమించావా మోనితా.. వంటలక్క భలే ఇరికించింది.. రంగంలోకి దిగిన డాక్టర్ బాబు!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu