5

Premi Vishwanath: న్యూలుక్‏తో అభిమానులను కట్టిపడేస్తున్న వంటలక్క.. రెడ్ డ్రెస్‏లో ఏంజెల్‏గా ప్రేమి విశ్వనాథ్..

బుల్లితెరపై కార్తీక దీపం ఓ పెద్ద సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్‏కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Premi Vishwanath: న్యూలుక్‏తో అభిమానులను కట్టిపడేస్తున్న వంటలక్క.. రెడ్ డ్రెస్‏లో ఏంజెల్‏గా ప్రేమి విశ్వనాథ్..
Premi Vishwanth
Follow us

|

Updated on: Aug 03, 2021 | 1:47 PM

బుల్లితెరపై కార్తీక దీపం ఓ పెద్ద సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్‏కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఎన్ని సీరియల్స్ అలరిస్తున్న కార్తీక దీపం మాత్రం నెంబర్ వన్‏లో దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్‏లోని నటీనటులకు కూడా క్రేజ్ మాములుగా ఉండుదు. ముఖ్యంగా వంటలక్క.. తెలుగమ్మాయి కాకపోయినా.. యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వంటలక్కగా సుపరిచితం. వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ అయినా.. ప్రేక్షకులు మాత్రం దీప, వంటలక్క అంటేనే ఠక్కున గుర్తుపడుతుంటారు. ప్రేమి విశ్వనాథ్ ఇంతవరకు మరే సీరియల్లోనూ కనిపించలేదు. ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సినిమాలో వంటలక్క కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంతరవరకు అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే.. అటు బుల్లితెరపై అలరించడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా వంటలక్క యమా యాక్టివ్. తాజాగా ఆమె తన ఇన్‏స్టాలో లెటేస్ట్ లుక్ పోస్ట్ చేసింది. రెడ్ డ్రెస్‏లో ఏంజెల్‏గా కనిపిస్తోందంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓ యాడ్‌ షూట్‌లో ఉన్న ఈనటిని చూసేందుకు… సెల్ఫీలు తీసుకునేందుకు కొందరు హార్డ్‌ కోర్ ఫ్యాన్స్‌ వచ్చారు. అయితే వారందరికీ తీరిగ్గా సెల్ఫీలకు ఫోజిచ్చిన ప్రేమి.. మరో సారి వారి మనసులు గెలుచుకున్నారు. అంతేకాదు అప్పటి వరకు వంటలక్కగా ఉన్న ఈ నటి ఒక్కసారిగా బ్లూ పట్టుచీరలో.. లూస్‌ హెయిర్‌తో మరింత అందంగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Premi Vishwanath (@premi_vishwanath)

వీడియో..

Also Read:

Simran: సోషల్ మీడియాలో హీరోయిన్ రచ్చ.. డ్యాన్స్‏తో అదరగొట్టిన సిమ్రాన్.. ఇందంతా అందుకేనా..

Kalyani Menon: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సింగర్ కళ్యాణి మీనన్ మృతి..

Aham Brahmasmi: ‘అహం బ్రహ్మస్మి’ కోసం రంగంలోకి మరో హీరో.. కీలక పాత్రలో అల్లరి నరేష్..

థియేటర్‏లలో మళ్లీ సినిమాల సందడి.. ఒకేరోజు ఐదు చిత్రాలు విడుదల..