Kalyani Menon: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సింగర్ కళ్యాణి మీనన్ మృతి..

ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ (80) మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

Kalyani Menon: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సింగర్ కళ్యాణి మీనన్ మృతి..
Kalyani Menon
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 03, 2021 | 1:12 PM

Kalyani Menon: ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ (80) మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణి సోమవారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తల్లి కళ్యాణి మీనన్. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన కళ్యాణి తెలుగు, తమిళం, మలయాలం భాషలలో ఏకంగా 100కి పైగా పాటలు పాడారు. 1979 తమిళ సినిమా నల్లతోరు కుటుంబం సినిమాకు ఇళయరాజా సంగీత సారథ్యంలో పాటలు ఆలపించారు. అలాగే కాధలన్, ముత్తు, అలైపాయుథే, విన్నైతంది వరువాయ, ఏక్ దీవానా థా వంటి చిత్రాలకు ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో పలు పాటలను ఆలపించారు.

ఎర్నాకుళంలో జన్మించిన కళ్యాణి.. పదేళ్ల వయసులోనే పాటలు ప్రారంభించింది. సుజాత (1980), నీ వరువై ఎనా వంటి చిత్రాలలో పాటలు పాడింది. ఏఆర్ రెహమాన స్వరపరచిన వందేమాతరం ఆల్బమ్‏లోనూ కళ్యాణి పాడింది. 2000 లో, కళ్యాణి ఆమె కుమారుడు రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన కందుకొండెయిన్ కందుకొండేన్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించింది. 2010 లో ఆమె భక్తి సంగీతానికి చేసిన కృషికి తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డు, కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకుంది. గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమ్యలతో బాధపడుతున్ కళ్యాణి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం తుది శ్యాస విడిచారు. కళ్యాణి మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ .. తమిళ, మళయాళ చిత్ర పరిశ్రమ నివాళుర్పిస్తుంది. అలాగే ఏఆర్ రెహమాన్ తన ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. అలాగే సింగర్ చిత్ర ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.

Also Read:

Aham Brahmasmi: ‘అహం బ్రహ్మస్మి’ కోసం రంగంలోకి మరో హీరో.. కీలక పాత్రలో అల్లరి నరేష్..

థియేటర్‏లలో మళ్లీ సినిమాల సందడి.. ఒకేరోజు ఐదు చిత్రాలు విడుదల..

Chiranjeevi: చిరంజీవి సాయం చేయకపోతే నా కూతురు చదువు ఆగిపోయేది అంటున్న లంకేశ్వరుడు కో డైరెక్టర్

నాసా మిషనంత ఖర్చుతో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమా..!కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్..:Prabhas movie Video.