Chiranjeevi: చిరంజీవి సాయం చేయకపోతే నా కూతురు చదువు ఆగిపోయేది అంటున్న లంకేశ్వరుడు కో డైరెక్టర్

Chiranjeevi: సామాన్య కుటుంబం నుంచి సినిమాలపై ఆసక్తితో వెండితెరపై అడుగు పెట్టి.. స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందరికో నేటి తరం నటీనటులకు..

Chiranjeevi: చిరంజీవి సాయం చేయకపోతే నా కూతురు చదువు ఆగిపోయేది అంటున్న లంకేశ్వరుడు కో డైరెక్టర్
Chiranjeevi
Follow us
Surya Kala

|

Updated on: Aug 03, 2021 | 10:50 AM

Chiranjeevi: సామాన్య కుటుంబం నుంచి సినిమాలపై ఆసక్తితో వెండితెరపై అడుగు పెట్టి.. స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందరికో నేటి తరం నటీనటులకు ఆదర్శం. చిరంజీవి .. మంచి నటుడే కాదు.. మంచి మనసున్న మనిషి. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే.. తప్పకుండా వారికి సాయం అందిస్తారు. ప్రకృతి భీభత్సం సృష్టించినప్పుడే కాదు.. ఎవరైనా అభిమానులు, తోటి నటీనటులు కష్టంలో ఉంటె నేనున్నా అంటూ ఆర్ధికంగా అండగా నిలబడతారు. కరోనా సమయంలో కూడా సినీ కార్మికులకు అండగా నిలబడిన చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన పిల్లల చదువు కోసం ఆర్ధిక సాయం అందించారని కో డైరెక్టర్ చెప్పారు. చిరంజీవి దాసరి నారాయణ రావు కాంబోలో తెరకెక్కిన లంకేశ్వరుడు సినిమాకు కో డైరెక్టర్‌గా పనిచేసిన ప్రభాకర్ చిరు చేసిన సాయం గురించి తెలిపారు. తాను కో డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా మారుతూ.. తీసిన ‘హెల్ప్ లైన్’ సినిమాని ఎవరూ రిలీజ్ చేయడానికి ముందుకు రాలేదని.. దీంతో ఈ సినిమాతో ద‌ర్శ‌క‌నిర్మాత‌గా చాలా న‌ష్ట‌పోయానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓ వైపు మా అబ్బాయి సీబీఐటీలో ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు. రెండేళ్లంది. ఇక సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఆ కాలేజీలో డబ్బులు కట్టాలి.. మరోవైపు మా పాప బీబీఏ ఫైన‌ల్ ఇయ‌ర్‌కి వ‌చ్చింది. 2.5 ల‌క్ష‌ల ఫీజు క‌డితేనే పరీక్షలు రాయగలదు.. దీంతో తాను చాలా చోట్ల డబ్బు కోసం ప్రయత్నించానని ఎక్కడా డబ్బులు దొరకలేదు.. దీంతో ఎవరిని సాయం అడగాలని అని ఆలోచిస్తుంటే.. ఇంతలో నా ఉద్యోగం పక్కన పెట్టు నాన్నా.. చెల్లి చదువు ఆగకుండా పరీక్ష ఫీజు కట్టు అని నా కుమారుడు చెప్పాడు.. దీంతో ఇద్దరి పిల్లల భవిష్యత్ కళ్ళ ముందు మెదిలింది. ఎలాగైనా డబ్బులు కట్టి.. వారి భవిష్యత్‌ను కాపాడాలని అని నేను ఆలోచిస్తూనే ఉన్న అని ప్రభాకర్ చెప్పారు.

ఈ విషయం చిరంజీవి దృష్టికి తీసుకుని వెళ్లాను.. ఆయన 30 ఏళ్ల క్రితం లంకేశ్వ‌రుడికి ప‌ని చేసిన‌ప్పుడు ఎంత ప్రేమ‌గా చూసుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమ‌ను క‌న‌బ‌రిచారు. తాను పిల్లల చదువు గురించి చెప్పిన వెంటనే చిరంజీవి స్పందించారు.. ఫీజు ఏర్పాటు చేశారని ప్రభాకర్ చెప్పారు. అప్పటి వరకూ కాలేజీ యాజమాన్యం ఫీజును ఇన్‌టైమ్‌లో క‌ట్ట‌లేక‌పోవ‌డంతో హాల్ టికెట్ ఇవ్వ‌లేమ‌ని అన్నారు. ఎప్పుడైతే చిరంజీవి సాయం చేశారని చెప్పానో వెంటనే అక్కడ స్టాఫ్ చాలా సాయం చేశారు.

గ‌జేంద్ర మోక్షంలో మొస‌లికి చిక్కిన గ‌జేంద్రుని కాపాడేందుకు వ‌చ్చిన మ‌హా విష్ణువులా చిరంజీవి న‌న్ను ఆదుకున్నారు.  నా క‌ష్టం విని రామ్ చ‌ర‌ణ్‌ సహా స్టాఫ్ కూడా అంతే సాయం చేశారు. నేను ఈరోజు ఇలా మాట్లాడానంటే దానికి చిరంజీవి .. రామ్ చ‌ర‌ణ్‌ చేసిన సాయమే కారణమని ప్రభాకర్ చెప్పారు.

Also Read: మార్షల్ ఆర్ట్స్‌లో తండ్రికి తగ్గ తనయుడు.. మెగావారసుడి కర్రసాము వీడియో వైరల్

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!