AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్‏లలో మళ్లీ సినిమాల సందడి.. ఒకేరోజు ఐదు చిత్రాలు విడుదల..

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరచుకుంటున్నాయి. అయితే సినీ ప్రియుల సందడి మాత్రం కనిపించడం లేదు.

థియేటర్‏లలో మళ్లీ సినిమాల సందడి.. ఒకేరోజు ఐదు చిత్రాలు విడుదల..
Movies Theaters
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2021 | 12:20 PM

Share

Cinemas In Theaters: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరచుకుంటున్నాయి. అయితే సినీ ప్రియుల సందడి మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు థియేటర్లు సిద్ధమయ్యాయి. వరుసగా సినిమాలను విడుదల చేస్తూ.. సినీ ప్రియులను థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే తిమ్మరుసు, ఇష్క్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేశాయి. ఇక త్వరలో మరికొన్ని సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇక ఈ వారం అనేక సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అవెంటో చుద్దామా..

Sr Kalyana Mandapam

Sr Kalyana Mandapam

ఎస్.ఆర్.కళ్యాణ మండపం.. రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్.. ఇప్పుడు ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమాతో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యారు. సీనియర్ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్ గాదె దర్శకత్వం వహించగా.. ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Merise Merise

Merise Merise

మెరిసే మెరిసే.. హుషారు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటిస్తోన్న చిత్రం మెరిసే మెరిసే. వెంకటేష్ కొత్తూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్‏టైన్మెంట్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై పవన్ కుమార్. కె నిర్మిస్తున్నారు. లవ్, కామెడీ, ఎమోషన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందిన ఈ సినిమా పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదల కానుంది.

Mugguru Monagallu

Mugguru Monagallu

ముగ్గురు మోనగాళ్లు.. శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ముగ్గురు మోనగాళ్లు. చిత్రమందిర్ స్టూడియో బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, దివంగత నటుడు టీఎన్ఆర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్ట్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Ippudu Kaka Inkeppudu

Ippudu Kaka Inkeppudu

ఇప్పుడు కాక ఇంకెప్పుడు.. హస్వంత్ వంగ, నమ్రత దరేకర్, కళ్యాణ్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇప్పుడు కాక ఇంకెప్పుడు. తనికెళ్ల భరణి, తులసి, రాజా రవీంద్ర, పూజా రామచంద్రన్, ఐడ్రీమ్ అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు వై. యుగంధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆగస్ట్ 6న విడుదల కాబోతుంది.

Kshira Sagara Madanam

Kshira Sagara Madanam

క్షీర సాగర మథనం.. మానస్‌ నాగులపల్లి, సంజయ్‌ కుమార్‌ హీరోలుగా, అక్షత సోనావని హీరోయిన్‌గా నటించిన చిత్రం క్షీర సాగర మధనం. శ్రీ వెంకటేశ పిక్చర్స్, ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ రావు, గౌతమ్ ఎస్ శెట్టి, ఛరిష్మా, మహేశ్ కొమ్ముల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కూడా ఆగస్ట్ 6న థియేటర్లలోకి రాబోతుంది.

Also Read:

Nagarjuna: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా కింగ్ నాగార్జున.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్..

Suriya: మరో రియల్ హీరో కథతో రానున్న సూర్య.. జై భీమ్ సినిమా స్టోరీ ఇదేనా..