AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aham Brahmasmi: ‘అహం బ్రహ్మస్మి’ కోసం రంగంలోకి మరో హీరో.. కీలక పాత్రలో అల్లరి నరేష్..

Allari Naresh: హీరో మంచు మనోజు ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం అహం బ్రహ్మస్మి. ఎం.ఎం ఆర్ట్స్ బ్యానర్‏ను నిర్మించి ఈ సినిమాను

Aham Brahmasmi: 'అహం బ్రహ్మస్మి' కోసం రంగంలోకి మరో హీరో.. కీలక పాత్రలో అల్లరి నరేష్..
Allari Naresh
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2021 | 12:22 PM

Share

Allari Naresh: హీరో మంచు మనోజు ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం అహం బ్రహ్మస్మి. ఎం.ఎం ఆర్ట్స్ బ్యానర్‏ను నిర్మించి ఈ సినిమాను నిర్మిస్తున్నారు మంచు మనోజ్. ఈ మూవీతో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అయితే గతేదాడి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్‏డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఇందులో హీరోయిన్‏గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. జర్మలిస్ట్ పాత్రలో లావణ్య కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక లాక్‏డౌన్ సమయంలో ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఓ అతిథి పాత్రలో చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఇందులో సాయి తేజ్ కాదు.. అల్లరి నరేష్ కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో అల్లరి నరేష్ పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా.. కథను మలుపు తిప్పే పాత్ర అని కూడా తెలుస్తోంది. ఇక ఇంతకు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్.. ఇటీవల పూర్తి స్తాయి క్యారెక్టర్ ఆరిస్టుగానూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంటున్నారు. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నరేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అల్లరి నరేష్. ఇక ఎం.ఎం.ఆర్స్ బ్యానర్‏లో నవతరానికి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తానని గతంలోనే తెలిపారు మంచు మనోజ్.

Also Read:

Nagarjuna: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా కింగ్ నాగార్జున.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్..

Suriya: మరో రియల్ హీరో కథతో రానున్న సూర్య.. జై భీమ్ సినిమా స్టోరీ ఇదేనా..

సంక్రాంతికి బాక్సాఫీస్ ఖాయం.. మహేష్- ప్రభాస్ కంటే ముందే బరిలోకి దిగనున్న పవర్ స్టార్..

థియేటర్‏లలో మళ్లీ సినిమాల సందడి.. ఒకేరోజు ఐదు చిత్రాలు విడుదల..