AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతికి బాక్సాఫీస్ ఖాయం.. మహేష్- ప్రభాస్ కంటే ముందే బరిలోకి దిగనున్న పవర్ స్టార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమాకోసం ఎంతో

సంక్రాంతికి బాక్సాఫీస్ ఖాయం.. మహేష్- ప్రభాస్ కంటే ముందే బరిలోకి దిగనున్న పవర్ స్టార్..
Pawan
Rajeev Rayala
| Edited By: Rajitha Chanti|

Updated on: Aug 03, 2021 | 10:01 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న పవర్ స్టార్ ఇప్పుడు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రానా కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లో పవన్ – రానా పైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు పవన్. రానా కూడా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పాత్రలో కనిపించనుండగా.. రానా రిటైర్ట్ హవల్దార్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘అతిపెద్ద ఆత్మగౌరవ యుద్ధానికి సన్నద్ధం అవ్వండి’ అంటూ 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

సక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే సంక్రాంతి రావడానికి ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ సిద్ధంగాఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా జనవరి జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్రయూనిట్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. ఇప్పుడు వాటి కంటే ఒకరోజు ముందు పవన్ సినిమా థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇలా వరుసగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు వరుసగా జనవరి 12,13,14 న విడుదల అవుతుండటంతో అభిమానులకు  సంక్రాంతి సంబరాలు రెట్టింపు అవ్వనున్నాయనే చెప్పాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rakshasudu 2: ఈసారి లండన్‌లో రాక్షసుడి ఆకృత్యాలు.. సీక్వెల్‌ సినిమాకు ఎంత ఖర్చు చేయనున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Rashi Khanna: జోరు మీదున్న అందాల రాశి.. ఒకేసారి మూడు భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీ..

సాక్ష్యాధారాలు నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం.. రాజ్ కుంద్రా కేసులో ముంబై పోలీసుల వాదన