AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshasudu 2: ఈసారి లండన్‌లో రాక్షసుడి ఆకృత్యాలు.. సీక్వెల్‌ సినిమాకు ఎంత ఖర్చు చేయనున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Rakshasudu 2: బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా వచ్చిన 'రాక్షసుడు' చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సైకో కిల్లర్‌ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేసింది....

Rakshasudu 2: ఈసారి లండన్‌లో రాక్షసుడి ఆకృత్యాలు.. సీక్వెల్‌ సినిమాకు ఎంత ఖర్చు చేయనున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.
Rakshasudu 2 Budget
Narender Vaitla
|

Updated on: Aug 02, 2021 | 8:43 PM

Share

Rakshasudu 2: బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సైకో కిల్లర్‌ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేసింది. ఇక ఈ సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి మరింత ఆసక్తికరమైన కథాంశంతో సినిమాను తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే రాక్షసుడు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్‌ హీరోగా నటించడం లేదని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఇంత వరకు తెలియజేయలేదు. అప్పట్లో వచ్చిన వార్తల మేరకు విజయ్‌ సేతుపతి నటించనున్నట్లు వినిపించింది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలై రెండేళ్లు గడుస్తోన్న నేపథ్యంలో సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ సీక్వెల్‌ చిత్రానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్‌ చిత్రాన్ని మరింత థ్రిల్లింగ్‌గా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. హాలీవుడ్‌ స్థాయిలో ఈ సినిమా ఉండనుందని, సినిమాను పూర్తిగా లండన్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సీక్వెల్‌ చిత్రం కోసం భారీ ఖర్చు చేయనున్నట్ల తెలిపారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ రైట్స్‌ కోసం అక్షయ్‌ కుమార్‌ తమను సంప్రదించారని నిర్మాత నిర్మాత తెలిపారు. ఈ సినిమా దర్శకుడు రమేశ్‌ వర్మ, నిర్మాత కోణేరు సత్యనారాయణ కాంబినేషన్‌లో రవితేజ ‘ఖిలాడి’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

Also Read: Viral Video: పామే కదా అని ఆడిద్దామనుకున్నాడు..ఒళ్ళుమండిన పాము ఏం చేసిందో చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం!

కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..

Exams In Telangana: తెలంగాణలో మొదలైన పరీక్షల సందడి.. ఈ నెలంతా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌తో బిజీ బిజీ..

ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్