Exams In Telangana: తెలంగాణలో మొదలైన పరీక్షల సందడి.. ఈ నెలంతా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌తో బిజీ బిజీ..

Exams In Telangana: కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడ్డట్లే విద్యా రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. లాక్‌డౌన్‌, వైరస్‌ ఉధృతంగా వ్యాపించడంతో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన...

Exams In Telangana: తెలంగాణలో మొదలైన పరీక్షల సందడి.. ఈ నెలంతా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌తో బిజీ బిజీ..
Exams In Telangana

Exams In Telangana: కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడ్డట్లే విద్యా రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. లాక్‌డౌన్‌, వైరస్‌ ఉధృతంగా వ్యాపించడంతో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం.. తాజాగా కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడడంతో మళ్లీ ఎంట్రెన్స్‌ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని రకాల ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. దీంతో ఆగస్టు నెల మొత్తం పరీక్షల సందడి నెలకొననుంది. పరీక్ష హాళ్లు విద్యార్థులతో, పరీక్షా హాళ్ల బయట విద్యార్థుల తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొనుంది.

రాష్ట్రంలో మొదట ఆగస్టు 3న ఈసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఇక అనంతరం ఆగస్టు 4 నుంచి 10 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు 9,10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 2.51లక్షల మంది వరకు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు దాదాపు 1.64 లక్షల మంది విద్యార్థులకు హాజరు అవుతుండగా, మెడికల్ పరీక్షకు 86వేలకు పైగా మంది హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 105 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆగస్టు 11 నుంచి 14 వరకు పీజీ సెట్ నిర్వహించనున్నారు. అటు తర్వాత ఆగస్టు 19, 20 తేదీల్లో ఐ సెట్, ఆగస్ట్ 23 న లాసెట్, ఆగస్టు 24 ,25 తేదీల్లో ఎడ్ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇలా ఈ నెలంతా పరీక్షల హడావుడి ఉండనుంది.

కరోనా నిబంధనల నడుమ..

ఓవైపు కరోనా ప్రభావం ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పరీక్షలను పూర్తిగా కరోనా నిబంధనల నడుమ ఏర్పాటు చేయనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొవిడ్ లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ చూపించాలనీ అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారికి చివరి సెషన్లో పరీక్ష నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా… అభ్యర్థులకు హాల్ టికెట్‌తో పాటు సెంటర్ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. అభ్యర్థులను పరీక్షా హాల్‌లోకి రెండు గంటల ముందే అనుమతించనున్నారు.

(వెంకటరత్నం, టీవీ9 తెలుగు, హైదరాబాద్)

Also Read: ఆగస్టు 15 న శ్రీనగర్ లోని ఎత్తయిన చరిత్రాత్మక కోటపై ఎగురనున్న 100 అడుగుల జాతీయ జెండా

13 ఏళ్ళ బాలుడి సూసైడ్ కేసు..ఆన్ లైన్ గేమ్ డెవలపర్స్ పై మధ్యప్రదేశ్ పోలీసుల కేసు

Nellore: మొన్న కుప్పులు తెప్పలుగా చాక్లెట్స్.. ఇప్పుడేమో కేసులకు కేసులు కూల్ డ్రింక్స్.. నెల్లూరులో ఏంటీ రచ్చ..?

Click on your DTH Provider to Add TV9 Telugu