ఆగస్టు 15 న శ్రీనగర్ లోని ఎత్తయిన చరిత్రాత్మక కోటపై ఎగురనున్న 100 అడుగుల జాతీయ జెండా
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు శ్రీనగర్ లోని చరిత్రాత్మక హరి పర్బాత్ కోటపై 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించింది. 2002 నాటి ఫ్లాగ్ కోడ్ ను అనుసరించి ఈ భారీ జెండాను ఎగురవేస్తామని...
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు శ్రీనగర్ లోని చరిత్రాత్మక హరి పర్బాత్ కోటపై 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించింది. 2002 నాటి ఫ్లాగ్ కోడ్ ను అనుసరించి ఈ భారీ జెండాను ఎగురవేస్తామని ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ లో తెలిపింది. ఇది నిబంధనలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. అత్యంత ఎత్తయిన ఈ ఫోర్ట్ పై ఎగురవేయడానికి అనువుగా ఇంత పెద్ద జెండాను ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. 18 వ శతాబ్దంలో దాల్ సరస్సు వద్ద ఆఫ్ఘన్ గవర్నర్ మహమ్మద్ ఖాన్ ఈ కోటను నిర్మించాడని చెబుతారు. ఈ కోటను ఆర్కియాలజీ విభాగం అధికారులు దీని సంరక్షణ బాధ్యతలను చూస్తున్నారు.
హరి పర్బాత్ కోట నుంచి దాల్ సరస్సును, ఇతర అందమైన లొకేషన్స్ ని చూడవచ్చునని అంటున్నారు. ఇలా ఉండగా పంద్రాగస్టును పురస్కరించుకుని శ్రీనగర్ లోను…, ఇంకా జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కేంద్రం నుంచి అప్పుడే అదనపు బలగాలను రప్పిస్తున్నారు. ఉగ్ర దాడులు జరగవచ్చునని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో అన్ని పోలీసు, సెక్యూరిటీ దళాలను అప్రమత్తం చేశారు. జమ్మూలో సోమవారం కూడా డ్రోన్ల వంటి వస్తువులు నాలుగు ఎగిరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత శనివారం, కూడా జమ్మూ లో మూడు డ్రోన్ల వంటి వాటిని స్థానికులు గుర్తించారు. వీటికోసం భద్రతా దళాలు గాలించినా ఫలితం లేకపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి : ఫస్ట్ నైట్ రూమ్ ఒకే.. కానీ మనం..?పెళ్లికూతురి డౌట్ తో షాక్ లో వరుడు పెళ్ళికొడుకు..:First Night Funny video.
ఉద్యోగాలుల పేరుతో యువతను మోసం చేసిన కి’లేడీ’..నిరుద్యోగ అమాయకత్వమే పెట్టుబడి..:Job cheating Video.
ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్ పెట్టుకోలేదని..:Police attack Video.