Nellore: మొన్న కుప్పులు తెప్పలుగా చాక్లెట్స్.. ఇప్పుడేమో కేసులకు కేసులు కూల్ డ్రింక్స్.. నెల్లూరులో ఏంటీ రచ్చ..?
మొన్న చాక్లెట్లు పారబోశారు. ఇవాళ కూల్‌డ్రింక్స్ రోడ్డున బడ్డాయి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నెల్లూరులో అని. అవును...
మొన్న చాక్లెట్లు పారబోశారు. ఇవాళ కూల్‌డ్రింక్స్ రోడ్డున బడ్డాయి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నెల్లూరులో అని. అవును… నెల్లూరులో కొండాయపాళెం దగ్గర రోడ్డుపై కేసులకు కేసుల కూల్‌డ్రింక్స్ కనిపించాయి. వాటిని లారీల్లో తెచ్చి అక్కడ పడేసినట్టు స్థానికులు చెప్తున్నారు. మొన్నటి చాక్లెట్ల మాదిరే ఇవి కూడా కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌గా చెప్తున్నారు. మిల్కా కంపెనీకి చెందిన సరుకుగా గుర్తించారు. అయితే.. స్థానికులు కొందరు వాటిని ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితం ఏసీ నగర్‌లో కాలం చెల్లిన చాక్లెట్లు కలకలం రేపాయి. ఇప్పుడు కొండాయపాలెంలో కూల్‌డ్రింక్స్ కేసులను పారబోశారు. కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ తాగితే రోగాల బారిన పడే అవకాశం ఉందని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. అయితే.. వీటిని ఎవరు పారబోస్తున్నారు? ఎక్స్‌పైరీ డేట్ వరకు ఎందుకు మురగబెడుతున్నారు? అనేది తేలాల్సి ఉంది.
ఇది ప్రజల ప్రాణాల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా!
కాలం చెల్లిన సరుకును పారబోసేందుకు ఓ పద్ధతంటూ ఉంటుంది. అలాకాకుండా.. ఇలా ప్రజలు తిరిగే చోట రోడ్డుపై పడేయటం వల్ల కొందరు వాటిని ఎత్తుకెళ్తున్నారు. ఫలితంగా రోగాల బారిన పడే ప్రమాదం కనిపిస్తోంది. పైగా.. వాళ్లు ఒకచోట చాక్లెట్లు పడేసి.. మరోచోట కూల్‌డ్రింక్స్ పారబోశారు. రేపు ఇంకోచోట ప్రమాదకర రసాయనాలు పారబోసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: “విద్యుత్ శాఖకు వద్దు.. మాకు పర్సనల్‌గా ఇస్తే పని అయిపోతుంది”.. అవినీతి చేపలు అడ్డంగా బుక్కయ్యాయి