Prakasam District: “విద్యుత్ శాఖకు వద్దు.. మాకు పర్సనల్‌గా ఇస్తే పని అయిపోతుంది”.. అవినీతి చేపలు అడ్డంగా బుక్కయ్యాయి

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంలో వినియోగదారుడి నుంచి 33 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు విద్యుత్‌ శాఖ...

Prakasam District: విద్యుత్ శాఖకు వద్దు.. మాకు పర్సనల్‌గా ఇస్తే పని అయిపోతుంది.. అవినీతి చేపలు అడ్డంగా బుక్కయ్యాయి
Bribe
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 02, 2021 | 7:14 PM

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంలో వినియోగదారుడి నుంచి 33 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు విద్యుత్‌ శాఖ ఉద్యోగులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మర్రిచెట్లపాలెంలో విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఏఈ ప్రసన్నకుమార్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ రాము ఇద్దరూ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. గ్రామానికి చెందిన విద్యుత్‌ వినియోగదారుడు తిరుపతయ్య తన రేకుల షెడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్‌ లైన్లను పక్కకు తప్పించాలని విద్యుత్‌ అధికారులను కోరాడు. వాస్తవానికి విద్యుత్‌శాఖకు 3,500 రూపాయలు చలానా చెల్లిస్తే వెంటనే పని పూర్తిచేయాల్సి ఉంది. అయితే అలా కాకుండా విద్యుత్‌శాఖకు డబ్బులు కట్టకుండా తమకు 50 వేల రూపాయలు ఇస్తే పనిపూర్తి చేస్తామని లేకుంటే పనులు కావని అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ రాములు వినియోగదారుడు తిరుపతయ్యకు కరాఖండిగా చెప్పాడు. ఏఈ ప్రసన్నకుమార్‌ కూడా ఇదే మాట చెప్పడంతో చేసేది బేరసారాలు సాగించాడు. చివరకు 33 వేలు లంచానికి  బేరం కుదిరింది. తొలుత 15 వేల రూపాయలు ఫోన్‌పే ద్వారా చెల్లించిన తిరుపతయ్య.. అనంతరం మిగిలిన డబ్బులు 18 వేల రూపాయలను లంచం ఇచ్చేముందు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు ఏసీబీ అధికారులు తిరుపతయ్య నుంచి లంచం తీసుకున్న అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ రామును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసిన ఏఈ ప్రసన్నకుమార్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు… వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు… అంతేకాకుండా నిందితులు విద్యుత్‌శాఖకు చెల్లించాల్సిన చలానా కట్టకుండా సంస్థకు నష్టం కలిగించినందున దీనిపై కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read:  మద్యం మత్తులో యువకుడి ర్యాష్ డ్రైవింగ్… పల్టీలు కొట్టిన కారు, యువతి స్పాట్ డెడ్

ఏపీలో కొత్తగా 1,546 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా