Murder: మామతో కలిసి భర్తను చంపిన మహిళ.. వివాహేతర సంబంధమే కారణం.? మంచంపైనే ప్రాణాలు వదిలిన..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Aug 02, 2021 | 6:46 PM

Murder In Prakasam: సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు సమాజం ఎటు వైపు వెళుతుందన్న ప్రశ్నలు తలెత్తక మానదు. ఇటీవల చిత్తూరులో ఓ మహిళ అల్లుడితో కలిసి భర్తను చంపిన...

Murder: మామతో కలిసి భర్తను చంపిన మహిళ.. వివాహేతర సంబంధమే కారణం.? మంచంపైనే ప్రాణాలు వదిలిన..
Murder

Murder In Prakasam: సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు సమాజం ఎటు వైపు వెళుతుందన్న ప్రశ్నలు తలెత్తక మానదు. ఇటీవల చిత్తూరులో ఓ మహిళ అల్లుడితో కలిసి భర్తను చంపిన సంఘటన మరిచిపోక ముందే తాజాగా ప్రకాశం జిల్లాలో మరో దారుణ సంఘటన జరిగింది. మామతో కలిసి సొంత కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో సునీత అనే మహిళ భర్తను దారుణంగా హతమార్చింది.

వివరాల్లోకి వెళితే.. ప్రకాశంజిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన సల్లూరి లక్ష్యయ్యకు సునీత అనే మహిళతో వివాహం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య సునీత తన తండ్రి కరుణయ్యతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన లక్ష్మయ్య సునీతతో నిత్యం గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మంచంపై మద్యం మత్తులో నిద్రిస్తున్న లక్ష్మయ్యపై భార్య సునీత తన మామ కరుణయ్యతో కలిసి అత్యంత దారుణంగా హతమార్చింది. లక్ష్మయ్యపై బండరాయి, కర్రలతో దాడి చేసి గ్రామం విడిచి పారిపోయారు. ఈ క్రమంలోనే లక్ష్మయ్య తలకు, మర్మాంగాలకు తీవ్ర గాలయ్యాయి.. ఇలా ఎలా పడితే అలా దాడి చేయడంతో అతను మంచంపైనే ప్రాణౄలు వదిలాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్థులంతా సునీతనే మామతో కలిసి లక్ష్మయ్యను హతమార్చారని చెబుతున్నారు. సమాజంలో విలువను ప్రశ్నార్థకంగా మార్చేసిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Murder In Ap

 

Also Read: Kondapur Accident: మద్యం మత్తులో యువకుడి ర్యాష్ డ్రైవింగ్… పల్టీలు కొట్టిన కారు, యువతి స్పాట్ డెడ్

Ants Trouble: చీమలు ఇల్లంతా తిరిగేస్తూ ఇబ్బంది పెట్టేస్తున్నాయా? ఇలా చేస్తే చీమలు కనిపించమన్నా కనిపించవు!

ముంబైలో ‘అదానీ ఎయిర్ పోర్టు’ బోర్డును ధ్వంసం చేసిన శివసేన కార్యకర్తలు..పేరు మార్చరాదని ఆందోళన

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu