AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో ‘అదానీ ఎయిర్ పోర్టు’ బోర్డును ధ్వంసం చేసిన శివసేన కార్యకర్తలు..పేరు మార్చరాదని ఆందోళన

ముంబైలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేరును 'అదానీ ఎయిర్ పోర్టు' గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు సోమవారం ఈ బోర్డును లాగివేసి ధ్వంసం చేశారు. అదానీ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని అదానీ ఎయిర్ పోర్టుగా మార్చాలని...

ముంబైలో 'అదానీ ఎయిర్ పోర్టు' బోర్డును ధ్వంసం చేసిన శివసేన కార్యకర్తలు..పేరు మార్చరాదని ఆందోళన
Shivsena Workers Vandalise Adani Airport Board
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 02, 2021 | 5:41 PM

Share

ముంబైలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేరును ‘అదానీ ఎయిర్ పోర్టు’ గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు సోమవారం ఈ బోర్డును లాగివేసి ధ్వంసం చేశారు. అదానీ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని అదానీ ఎయిర్ పోర్టుగా మార్చాలని తీసుకున్న నిర్ణయాన్ని శివసేన తీవ్రంగా తప్పు పడుతోంది. ఈ ఎయిర్ పోర్టు పేరును మార్చడానికి ఈ గ్రూప్ కు హక్కు లేదని పేర్కొంది. విమానాశ్రయ ఏరియా లోని వీఐపీ గేటు వద్ద ఈ కొత్త బోర్డును గ్రూప్ ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రతిపాదనను తాము ఏనాడో వ్యతిరేకించామని, అలాంటిది మళ్ళీ ఈ బోర్డు పెట్టారేమిటని శివసేన ప్రశ్నిస్తోంది. జీవీకే గ్రూపు నుంచి ఈ ఎయిర్ పోర్టు నిర్వహణ కార్యకలాపాలను అదానీ గ్రూప్ గత జులైలో చేపట్టింది. ఈ కొత్త యాజమాన్యంలో ఈ గ్రూప్ కి 74 శాతం వాటా ఉండగా జీవీకే గ్రూపు 50.5 శాతం, ఇతర ఎయిర్ పోర్ట్స్ కంపెనీ, సౌతాఫ్రికా, బిద్వెస్ట్ గ్రూప్ వంటి చిన్న సంస్థలు 23.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

అయితే దీని పేరు మార్పు కోసం తాము ఏనాటి నుంచో యత్నిస్తున్నామని అదానీ గ్రూప్ అంటోంది. ఇక ఇది మహారాష్ట్రలో..ముఖ్యంగా ముంబైలో చినికి చినికి గాలివానగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విమానాశ్రయం పేరు మార్పును ఎట్టి [పరిస్థితుల్లోనూ తాము అంగీకరించే ప్రసక్తి లేదని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన శివసేన తేల్చి చెబుతోంది. ఇక ఇతర పార్టీలు కూడా దీనికి పరోక్షంగా మద్దతునిస్తున్నట్టు కనిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి : ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్‌ పెట్టుకోలేదని..:Police attack Video.

 పోర్నోగ్రఫీ కేసులో తిరగబడిన శిల్పా శెట్టి..!మీడియాపై ఫైర్ అయినా హీరోయిన్..:Pornography case Video.

 చిరుతలతో దోస్తాన్ ఏంద్రా సామీ..!మూడు చిరుతలను హాగ్ చేసుకొని పడుకున్న వ్యక్తి..(వీడియో):Man with Cheeta video.

 పాతిపెట్టిన శవం.. ఎలా బయటకు వచ్చింది..?నడిరోడ్డుపై శవ పేటిక..:Buried corpse video.