AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాక్ష్యాధారాలు నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం.. రాజ్ కుంద్రా కేసులో ముంబై పోలీసుల వాదన

పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటే తాము మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకోలేమని ముంబై పోలీసులు బాంబేహైకోర్టుకు తెలిపారు. తన అరెస్టును సవాలు చేస్తూ రాజ్ కుంద్రా దాఖలు...

సాక్ష్యాధారాలు నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం..  రాజ్ కుంద్రా కేసులో ముంబై పోలీసుల వాదన
We Can't Be Silent Spectators While Kundra Tried To Destroy Evidence Says Mumbai Police
Umakanth Rao
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 02, 2021 | 5:55 PM

Share

పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటే తాము మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకోలేమని ముంబై పోలీసులు బాంబేహైకోర్టుకు తెలిపారు. తన అరెస్టును సవాలు చేస్తూ రాజ్ కుంద్రా దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరుపుతున్న సందర్భంగా వారీ విషయాన్ని స్పష్టం చేశారు. పైగా తమ ఇంటరాగేషన్ కి ఈ నిందితుడు సహకరించడంలేదన్నారు. తనను కస్టడీలోకి తీసుకోక ముందు ఈ పోలీసులు తనకు సమన్లు జారీ చేయలేదని, అందువల్ల తన అరెస్టు చట్ట విరుద్ధమని కుంద్రా తన పిటిషన్ లో పేర్కొన్నాడు. కానీ ఈ వాదనను ఖాకీలు ఖండిస్తూ.. పోర్న్ క్లిప్స్ ను తొలగించాల్సిందిగా తమను కుంద్రా ఆదేశించినట్టు ఇతని కంపెనీలో పని చేసిన నలుగురు ఉద్యోగులు తెలిపారని వివరించారు. వారి వాంగ్మూలాన్ని తాము నమోదు చేశామన్నారు. రాజ్ కుంద్రా తన ఐక్లౌడ్ అకౌంటును డిలీట్ చేశాడని, కానీ అతని లాప్ టాప్ లో 61 పోర్న్ వీడియోలను, అడల్ట్ కంటెంట్ స్క్రిప్ట్ ను..అలాగే డిజిటల్ స్టోరేజీలో మరో 51 వీడియోలను తాము కనుగొన్నామని పోలీసులు చెప్పారు.

నిందితులతో ఇతడు చాటింగ్ చేసిన వైనం ఇతని వాట్సాప్ గ్రూప్ లో తాము కనుగొన్నట్టు కూడా ఖాకీలు వెల్లడించారు. అయితే కుంద్రా తరఫు లాయర్ అబాద్ పాండా వీరి వాదనను ఖండిస్తూ.. తన క్లయింటు లాప్ టాప్ పోలీసుల ఆధీనంలోనే ఉందని, అలాంటప్పుడు ఆయన కంటెంట్ లేదా సమాచారాన్ని డిలీట్ చేశాడని ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు. ఇలా సోమవారం కోర్టులో ఇరు పక్షాల మధ్య వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. అటు-కుంద్రా సహచరుడు ర్యాన్ థార్పే /వాట్సాప్ గ్రూప్ లోని మెసేజులను డిలేట్ చేయడం ప్రారంభించాడని కూడా పోలీసులు కోర్టుకు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్‌ పెట్టుకోలేదని..:Police attack Video.

 పోర్నోగ్రఫీ కేసులో తిరగబడిన శిల్పా శెట్టి..!మీడియాపై ఫైర్ అయినా హీరోయిన్..:Pornography case Video.

 చిరుతలతో దోస్తాన్ ఏంద్రా సామీ..!మూడు చిరుతలను హాగ్ చేసుకొని పడుకున్న వ్యక్తి..(వీడియో):Man with Cheeta video.

 పాతిపెట్టిన శవం.. ఎలా బయటకు వచ్చింది..?నడిరోడ్డుపై శవ పేటిక..:Buried corpse video.