AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: జోరు మీదున్న అందాల రాశి.. ఒకేసారి మూడు భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీ..

Rashi Khanna: 2013లో వచ్చిన 'మద్రాస్‌ కేఫ్‌' చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. తొలిసినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకుందీ చిన్నది. ఇక రెండో చిత్రంగా...

Rashi Khanna: జోరు మీదున్న అందాల రాశి.. ఒకేసారి మూడు భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీ..
Rashi
Narender Vaitla
|

Updated on: Aug 02, 2021 | 6:19 PM

Share

Rashi Khanna: 2013లో వచ్చిన ‘మద్రాస్‌ కేఫ్‌’ చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. తొలిసినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకుందీ చిన్నది. ఇక రెండో చిత్రంగా తెలుగులో అక్కినేని కుటుంబ హీరోలు నటించిన ‘మనం’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో నటించిన రాశీ.. మూడో చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో తన క్యూట్‌ నటన, అందంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అనంతరం జోరు పెంచిన ఈ చిన్నది వరుస సినిమాల్లో నటిస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు తన సినిమాల జోరును మరింత పెంచేసింది. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘థ్యాంక్యూ’తో పాటు గోపీ చంద్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘పక్కా కమర్షియల్‌’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తమిళంలో ఇప్పటికే ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’ సినిమాలను పూర్తి చేసి ప్రస్తుతం.. కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్దార్‌’ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా తాజాగా కోలీవుడ్‌లో మరో ఛాన్స్‌ను కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ధనుష్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో రాశీ ఖన్నాకు ఛాన్స్‌ దక్కినట్లు వార్తలు వచ్చాయి. వీటితో పాటు హిందీలో షాహిద్‌ కపూర్ హీరోగా ఓ సినిమాతో పాటు అజయ్‌ దేవగణ్‌ నటిస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇలా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా దూసుకుపోతోంది రాశీ. కేవలం సినిమాలే కాకుండా మారుతోన్న కాలానికి అనుగుణంగా వెబ్‌ సిరీస్‌లకు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటోందీ చిన్నది.

Also Read: సాక్ష్యాధారాలు నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం.. రాజ్ కుంద్రా కేసులో ముంబై పోలీసుల వాదన

AHA OTT: ఆహా నుంచి మరో ఆసక్తికర వెబ్‌ సిరీస్‌.. ఆకట్టుకుంటోన్న తరగతి గది దాటి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌..

Pushpa First Song: ‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ కోసం భారీగానే ప్లాన్ చేసిన సుకుమార్.. రిలీజ్ అప్పుడే

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ