AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA OTT: ఆహా నుంచి మరో ఆసక్తికర వెబ్‌ సిరీస్‌.. ఆకట్టుకుంటోన్న తరగతి గది దాటి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌..

AHA OTT: తొలి తెలుగు ఓటీటీ 'ఆహా' సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓవైపు వెబ్‌సిరీస్‌లు, మరో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఫుల్‌ మీల్స్‌ను అందిస్తోంది....

AHA OTT: ఆహా నుంచి మరో ఆసక్తికర వెబ్‌ సిరీస్‌.. ఆకట్టుకుంటోన్న తరగతి గది దాటి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌..
Aha New Movie
Narender Vaitla
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 02, 2021 | 5:31 PM

Share

AHA OTT: తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓవైపు వెబ్‌సిరీస్‌లు, మరో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఫుల్‌ మీల్స్‌ను అందిస్తోంది. ఇక కేవలం సినిమాలకే కాకుండా సరికొత్త ప్రోగ్రామ్స్‌తో ఓటీటీ వేదికకు సరికొత్త అర్థం చెప్పి ఆడియన్స్‌తో ‘ఆహా’ అనిపించుకుంటోంది. ఇప్పటికే తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన నీడ, సూపర్‌ డీలక్స్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ఇక ఇటీవల అమల్‌ పాల్‌ నటించిన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ‘ఆహా’ తాజాగా మరో ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించే పనిలో పడింది. హిందీలో మంచి విజయాన్ని అందుకున్న ‘ఫ్లేమ్స్‌’ సిరీస్‌కు రీమేక్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు.

‘తరగతి గది దాటి’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఇద్దరు టీనేజర్ల మధ్య ఏర్పడ్డ అందమైన ప్రేమ కథను అద్భుతంగా చూపించనున్నారు. ‘పెళ్లిగోల’ వెబ్‌ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన మల్లిక్‌ ‘తరగతి గది దాటి’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో హ‌ర్షిత్ రెడ్డి, పాయ‌ల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హిందీలో మంచి రెస్పాన్స్‌ సంపాదించుకున్న ‘ఫ్లెమ్స్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగానే రాజమండ్రి నేపథ్యంగా వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. కృష్ణ, జాస్మిన్‌ అనే ఇద్దరు టీనేజర్ల మధ్య ప్రేమ ఇతి వృత్తంగా ఈ వెబ్‌ సిరీస్‌ కథ ఉండనుంది. ఈ వెబ్‌ సిరీస్‌ను మొత్తం 5 ఎపిసోడ్లుగా విడుదల చేయనున్నారు. మరి మరో క్యూట్‌ లవ్‌ స్టోరీ రూపంలో డిజిటల్ ప్రేక్షకులకు ఆకట్టుకోవడానికి వస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Sonu Sood : సోనుసూద్‌‌పై ఇది వేరే లెవల్ అభిమానం..! 50 వేల చదరపు విస్తీర్ణంలో భారీ చిత్రం

Shilpa Shetty: ప్లీజ్.. మా కుటుంబాన్ని ఇలా వదిలేయండి.. మీడియాకు శిల్పా శెట్టి వినతి

ఈ చిన్నోడికి ఇప్పుడు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే… ఈ స్టార్ హీరోను గుర్తుపట్టండి..