Evaru Meelo Koteeswarulu: కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది… రండి గెలుద్దాం అంటున్న తారక్..
Jr. NTR Evaru Meelo Koteeswarulu: జూ. ఎన్టీఆర్ ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతూనే.. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా అలరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ లో హోస్ట్ గా చేసిన బుల్లి తెర..
Jr. NTR Evaru Meelo Koteeswarulu: జూ. ఎన్టీఆర్ ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతూనే.. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా అలరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ లో హోస్ట్ గా చేసిన బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ని హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రోగ్రాం షూట్ మొదలు పెట్టుకుంది. జెమిని టివిలో ప్రసారం కానున్న ఈ షో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ మొదటి ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ సాగిన ప్రోమో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. మొదటి సీజన్ మొత్తం కల్యాణకృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ జరుపుకున్నాయి. షో కి సంబంధించిన ప్రోమోలు కూడా షూట్ జరుపుకున్నాయి. తాజాగా మొదటి ప్రోమో రిలీజ్ చేసింది జెమిని యూనిట్. ఇక రెండో ప్రోమో నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
స్వాతంత్య దినోత్సవం ఆగష్టు 15న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ మొదటి ఎపిసోడ్‌లో రామ్ చరణ్ హాట్ సీట్ లో కూర్చుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ చరణ్ ను క్విజ్ చేయబోతున్నాడు. ఈ షో లో చరణ్ రూ. 25 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తాను గెలుచుకున్న మనీని కరోనా తో ఇబ్బంది పడుతున్న ఓ స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్..
అంతకుముందు, స్టార్ మా కోసం నాగార్జున , చిరంజీవిలు మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో షో ను నిర్వహించగా.. తాజాగా జెమిని టీవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Prawns Fry Recipe: గోదావరి జిల్లాల స్టైల్‌లో టేస్టీ టేస్టీగా రొయ్యల ఫ్రై తయారీ విధానం