Karthika Deepam: మోనితను నిలదీసిన ప్రియమణి..దొరికిన ఆచూకీ.. అంజి కోసం బయలుదేరిన దీప!

మూడుముళ్ల బంధం గొప్పతనానికి.. ప్రేమ పేరుతో చేస్తున్న అరాచాకానికీ మధ్య జరుగుతున్న ఘర్షణ కార్తీకదీపం. ప్రతిరోజూ బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ కొత్త మలుపులతో సాగిపోతోంది.

Karthika Deepam: మోనితను నిలదీసిన ప్రియమణి..దొరికిన ఆచూకీ.. అంజి కోసం బయలుదేరిన దీప!
Karthika Deepam Serial Episode 1107
Follow us
KVD Varma

|

Updated on: Aug 02, 2021 | 8:14 AM

Karthika Deepam: మూడుముళ్ల బంధం గొప్పతనానికి.. ప్రేమ పేరుతో చేస్తున్న అరాచాకానికీ మధ్య జరుగుతున్న ఘర్షణ కార్తీకదీపం. ప్రతిరోజూ బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ కొత్త మలుపులతో సాగిపోతోంది. కుటుంబ బంధాల మధ్య ఉండే సున్నితత్వం.. మూర్ఖత్వం మాటున ఉండే క్రూరత్వం రెండిటినీ సమపాళ్ళలో పరిచయం చేస్తున్న సీరియల్ కార్తీకదీపం ఇంటిళ్ళపాదీ కలిసి కూచుని చూడగాలిగే సీరియల్ గా విజయవంతంగా నడిచిపోతోంది. ఎన్నిరోజులైనా.. ఎన్ని ఎపిసోడ్ లు గడిచినా కార్తీకదీపం వినోద కాంతులు ప్రతి ఇంటా ప్రతిరోజూ ప్రసారం అవుతూనే వస్తున్నాయి. కార్తీకదీపం సీరియల్ కు అక్షరరూపం ఇది. ప్రతిరోజూ అందర్నీ అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఇప్పటికి 1106 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఈరోజు 1107 ఎపిసోడ్ ప్రసారం అవుతోంది. మరి ఇంతావరకూ ఏం జరిగిందో సంక్షిప్తంగా..

ఇదీ జరిగింది..

కార్తీక్ ను 25వ తేదీన పెళ్ళిచేసుకుని తీరతాను అని శపథం చేసింది మోనిత. అంతేకాదు.. అందుకోసం రిజిస్ట్రార్ ఆఫీసులో దరఖాస్తు కూడా పెట్టుకుంది. తన భర్త వలెనే గర్భవతి అయ్యానని మోనిత చెబుతున్నా.. దీప మాత్రం కార్తీక్ మీద నమ్మకంతోనే ఉంటుంది. మోనిత కావాలని పదే పదే కార్తీక్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ ఎదో ఒక ఇబ్బంది సృష్టించాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. దీపను ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది. ఆమె అలజడి సృష్టించిన ప్రతిసారీ దీప తన చాకచక్యంతో ఆ పరిస్థితులను ఎదుర్కుంటూనే వస్తోంది. కార్తీక్ తండ్రికి గుండేనొప్పి వచ్చేలా చేసి.. ఆసుపత్రికి వెళ్లి నానా రాద్ధాంతం చేసిన మొనితను అంజి పేరుతో గట్టిగా అడ్డుకుంటుంది దీప.. ఏసీపీ రోషిణి సహకారంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మరోవైపు ఏసీపీ రోషిణి ఈ కేసు విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తూ వస్తోంది. ఆమె మోనితను పూర్తిగా నమ్మదు. ఈలోపు దీప ఆమెకు అంజి విషయం చెబుతుంది. అంజి ద్వారా మోనిత ఎదో పాపపు పని చేసింది అనే అనుమానం రోషిణికి కలుగుతుంది. మోనితను పిలిచి అంజి గురించి ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె కంగారుపడిపోతుంది. అయితే, అంజి రోషిణికి దొరకలేదని తెలుసుకుని రిలాక్స్ అవుతుంది. కార్తీక్ ను బెదిరిద్దామని ఇంట్లో చికెన్ తింటూ ఫోన్ చేస్తుంది. అయితే, అదేసమయంలో కార్తీక్ పక్కనే ఉన్న దీప నేరుగా ఫోన్ లో మాట్లాడుతూనే మోనిత ఇంటివద్దకు కార్తీక్ తో కలిసి వెళుతుంది. అక్కడ మోనితకు గట్టి షాక్ ఇస్తుంది. కార్తీక్, మోనిత ఇద్దరూ అక్కడ ఉన్న పాన్ ఒకరికి ఒకరు తినిపించుకుని వెనుదిరుగుతారు. ఇదీ ఇప్పటి వరకూ జరిగింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది.. దీప..మోనిత టామ్ అండ్ జెర్రీ ఆట ఎలా సాగబోతోంది? తెలుసుకుందాం..

మోనిత నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది!

ఏసీపీ రోషిణి వద్దకు కార్తీక్ వస్తాడు. అతన్ని చూసిన రోషిణి అదేమిటి డాక్టర్ బాబు డాక్టర్ వద్దకు వెళ్ళేవాడిలా అయ్యాడు అంటూ అడుగుతుంది. దీంతో మెడమ్ మోనిత రోజు రోజుకీ శృతి మించుతోంది. చాలా అల్లరి పెడుతోంది. అని చెబుతాడు. దానికి రోషిణి.. మీ తప్పే కదా అని నిలదీస్తుంది. పదే పదే ఆమె ఇంటికి వెళతారు.. గంటల కొద్దీ గడుపుతారు. అక్కడే తాగుతారు.. అక్కడే తింటారు. దీన్ని ఏమంటారు. మీరు స్నేహం అని చెప్పినా అది నమ్మేదిగా అనిపించదు. ఎందుకంటే ఒక ఆడా..మగా మధ్య స్నేహానికి సన్నని హద్దు ఉంటుంది. మీరు ఆ హద్దు దాటేసినట్టు కనిపిస్తోంది. ప్రపంచానికి మీరు ఆ హద్డుకి చెరోవైపూ ఉన్నట్టు కనిపించదు. నిజానికి వారికి ఆ హద్దు గీతా కనిపించదు.” అంటూ చెబుతుంది. మేడమ్ నాకేమీ తెలీదు అని కార్తీక్ అంటాడు. తను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది అంటాడు.. మరి అప్పుడు మీరు కదా కేసు పెట్టాలి? మోనిత ఎందుకు కేసు పెట్టింది? మరి మోనిత కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు. మీరు డాక్టర్.. ఒక మగవాడికి సంబంధం లేకుండా ఆడది గర్భవతి కావడం సాధ్యమేనా? అని అడుగుతుంది రోషిణి. ”నేను దీపకు అన్యాయం చేయదలుచుకోలేదు.” అంటాడు కార్తీక్. మరి మోనిత పరిస్థితి ఏమిటి? అని అడుగుతుంది రోషిణి. ”ఒక భార్య..ఇద్దరు పిల్లలు ఉండగా మరొక స్త్రీని పెళ్ళిచేసుకోవడం చట్టప్రకారం నేరం తెలీదా? భార్య ఉండగా మరో స్త్రీ గర్భవతి కావడానికి కారణం కావడమూ నేరమే మీకు తెలీదా?” అని ప్రశ్నిస్తుంది రోషిణి. దీంతో కార్తీక్ నిస్సహాయంగా మారిపోతాడు. టేబుల్ మీద ఉన్న నీళ్ళు తీసుకుని తాగుతాడు.

దీప కోసం ఆలోచిస్తున్నాను..

కూర్చోండి కార్తీక్ అని ఆతన్ని కూచోపెట్టి.. తానూ అతని ఎదురుగా కూచుంటుంది రోషిణి. ”చూడండి కార్తీక్..నేను ఎటువంటి ఎమోషన్స్ లేని పోలీస్ ఆఫీసర్ని. నాకు డ్యూటీ తప్ప మరో విషయం గురించి ఎక్కువ ఆలోచించడం అలవాటులేదు. కేసులో చట్టప్రకారం ఏది కరెక్ట్ అనిపిస్తే అది వెంటనే చేసేస్తాను. కానీ, మొదటిసారిగా మీ కేసు విషయంలో ఎక్కువ ఆలోచిస్తున్నాను. దీనికి కారణం దీప. దీప పధ్ధతి నాకు నచ్చింది. దీప కళ్ళలో నిజాయితీ నాకు నచ్చింది. దీప చెప్పే మాటలు నాకు కరెక్ట్ అనిపించాయి. దీప కోసమే నేను కొద్దిగా ఈ కేసు విషయంలో అన్ని కోణాల్లోనూ ఆలోచించడం మొదలు పెట్టాను. అప్పుడు అంజి పేరు బయటకు వచ్చింది..” అంటూ రోషిణి చెబుతుండగా..అది చెబుదామనే ఇక్కడకు వచ్చాను మేడమ్ అంటూ అడ్డు పడతాడు కార్తీక్.”మీకు అంజి ఆచూకీ తెలిస్తే చెప్పండి మేడమ్ నేను వెళ్లి తీసుకువస్తాను.” అంటాడు. ”వద్దు డాక్టర్ మీరు ఈ విషయంలో కలగచేసుకుని ఇంకో ప్రమాదంలో పడకండి. ఈ కేసును ఎక్కడ మొదలు పెట్టాలో.. ఎక్కడ ముగించాలో నాకో క్లారిటీ ఉంది. అంజి విషయం మీరు పక్కన పెట్టండి. మీరు హాయిగా దీప, పిల్లలతో గడపండి. కేసు విషయం నేను చూసుకుంటాను.” అంటూ చెబుతుంది రోషిణి. దీంతో ఆమెకు నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.

మోనితను నిలదీసిన ప్రియమణి 

ఇక మోనిత తన ఇంటికి వచ్చి దీప ఇచ్చిన షాక్ నుంచి తెరుకోలేకపోతుంది కార్తీక్. డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ప్రియమణి అక్కడకు వస్తుంది. వస్తూనే ”అంజి ఎవరు?” అని మోనితను ప్రశ్నిస్తుంది. కానీ మోనిత సమాధానం చెప్పదు. డైనింగ్ టేబుల్ సర్దమని చెబుతుంది. ”అవి నేను సర్దుతాను. కానీ ఈ విషయంలో నేను సర్దుకుపోను అమ్మా. కార్తీక్ అయ్య మీకు కడుపు చేసి మోసం చేశారని బాధపడుతున్నాను. కానీ, మీరు అంజి పేరు చెబితేనే పడుతున్న కంగారు.. దీపమ్మ వచ్చి అంజి గురించి చెప్పిన వెంటనే మీరు పడిన కంగారు చూస్తుంటే.. మీరే ఎదో తప్పు చేసినట్టు కనిపిస్తోంది. అసలు ఈ విషయం నాకు తెలియాల్సిందే.” అని అడుగుతుంది ప్రియమణి. దీంతో ప్రియమణి మీద సీరియస్ అవుతుంది మోనిత. తనని నోర్మూసుకుని అవతలకు పొమ్మంటుంది. ”వెళతాను అమ్మా.. మీరు మోసపోయారని ఇన్నాళ్ళూ అనుకుంటున్నాను. కానీ, మీరు ఏదైనా మోసం చేశారని తెలిసిందో.. ఎటువంటి పరిస్థితిలోనూ మిమ్మల్ని ఇక జీవితంలో నమ్మను.” అంటూ వెళ్ళిపోతుంది ప్రియమణి.

అంజి ఆచూకీ దొరికింది 

రాత్రి పిల్లల దగ్గర నిద్రపోతున్న దీపకు రోషిణి కాల్ చేస్తుంది. కార్తీక్ కు చెప్పకుండా సూర్యాపేట వెళ్ళమంటుంది. అక్కడ అంజి ఉన్నాడని చెబుతుంది. దీంతో దీప ఆలోచనలో పడుతుంది. కార్తీక్ కి చెప్పకుండా ఎలా వెళ్ళాలి. మేడమ్ ఏమో చెప్పోద్దంది. కార్తీక్ కి పిన్ని ఇంటికి వెళతానని చెబుతాను అనుకుంటుంది. తరువాత వారణాశిని కారు ఏర్పాటుచేయమని చెప్పాలి అనుకుంటుంది. ఈలోపు అక్కడ మోనితకు ఫోన్ వస్తుంది. అంజి సూర్యాపేటలో ఉన్నట్టు అవతల వ్యక్తి చెబుతాడు. మీకు థాంక్స్..మీరు అడిగిన ఎమౌంట్ నేను ఇప్పుడే ట్రాన్స్ ఫర్ చేస్తాను అని చెబుతుంది మోనిత. తరువాత.. ఎంతో కష్ట సమయంలో మంచి వార్త తెలిసింది. ఇప్పడు దీప సంగతి తేలుస్తాను. కార్తీక్ ని పెళ్లి చేసుకుని దీపకు షాక్ ఇస్తాను. అనుకుంటుంది. సూర్యాపేట ఎంత దూరం ఉందొ తెలుసుకుని బయలుదేరుతుంది.. ప్రియమణిని పిలిచి.. నేను బయటకు వెళుతున్నాను. తెల్లారేసరికి వస్తాను. అని చెబుతుంది. తరువాత.. ప్రియమణి దగ్గరకు వెళ్లి ”నేను ఏమీ మోసం చేయడం లేదు. మీ కార్తీక్ అయ్యమీద పిచ్చి ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను.” అని చెప్పి వెళ్ళిపోతుంది మోనిత.

సూర్యాపేట బయలుదేరిన దీప 

దీప సూర్యాపేట వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. ఈలోపు కార్తీక్ వస్తాడు. పిల్లలు నిద్రపోయారా అని అడుగుతాడు. తరువాత ఆమెతో మాట్లాడతాడు. ”నేను నీమీద అనుమానంతో పదేళ్ళు దూరం పెట్టాను. కానీ, నువ్వు కనీసం సమయం కూడా తీసుకోకుండా నన్ను నమ్మవు.” అంటాడు. కార్తీక్. ”ఇది చిన్న జీవితం డాక్టర్ బాబు. మీకు అనుమానం వచ్చిందని దూరం పెట్టారని.. నేను అనుమానించి దూరం పెడితే మిగిలేది దూరమే.” అంటుంది దీప. ” నాకు మీరు కావాలి. పిల్లలకు మనం కావాలి. మనకు మన కుటుంబం కావాలి.. మన మధ్యలో ఎవరైనా వస్తే మనం ఏకం కావాలి.” అంటూ చెబుతుంది దీప. తరువాత తను బయటకు వెళుతున్నానని చెబుతుంది దీప. ఎక్కడికి అని అడుగుతాడు కార్తీక్. పిన్ని దగ్గరకు అని చెబుతుంది. నిజమేనా అని అడుగుతాడు. నిజమే అంటుంది దీప. సరే నేను డ్రాప్ చేస్తాను అంటాడు కార్తీక్. వద్దని అతన్ని వరించి సూర్యాపేట బయలుదేరుతుంది దీప.

ఇటు దీప.. అటు మోనిత ఇద్దరూ సూర్యాపేట అంజి కోసం బయలుదేరారు. పిన్నికి ఆరోగ్యం బాలేదు అని చెప్పి దీప వెళ్ళింది. కానీ, భాగ్యం కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. దీంతో దీప ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచనలో పడతాడు కార్తీక్. ఇప్పుడు అంజి దొరికాడా? దొరికితే ఎవరికీ? అసలే అంజి దొరికితే బెదిరించి దరికి తెచ్చుకోవాలని మోనిత చూస్తోంది.. అంజి దొరికితే తన సంసారాన్ని చక్కదిద్దుకోవాలని దీప చూస్తోంది. మరి ఏం జరగబోతోంది? వచ్చే ఎపిసోడ్ లో చూడాల్సిందే!

Also Read: Karthika Deepam: ట్విస్ట్ ఇద్దమనుకుంటే షాక్ ఇచ్చిన కార్తీక్..దీప..మోనిత నషాళానికి అంటిన అంజి ‘పాన్’ మసాలా!

Karthika Deepam: అంజిని ప్రేమించావా మోనితా.. వంటలక్క భలే ఇరికించింది.. రంగంలోకి దిగిన డాక్టర్ బాబు!

Karthika Deepam: మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం..కార్తీక్ లో మొదలైన ఆలోచన..అన్నీ సరిచేస్తున్న వంటలక్క!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!