Karthika Deepam: మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం..కార్తీక్ లో మొదలైన ఆలోచన..అన్నీ సరిచేస్తున్న వంటలక్క!

డాక్టర్ బాబును పెళ్ళిచేసుకోవాలని మోనిత చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీప పూర్తిగా తన భర్త వెనుక నిలబడి మోనిత ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటోంది. అయినా తన ప్రయత్నాలు వదలడం లేదు.

Karthika Deepam: మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం..కార్తీక్ లో మొదలైన ఆలోచన..అన్నీ సరిచేస్తున్న వంటలక్క!
Karthika Deepam Latest Episode 1104
Follow us
KVD Varma

|

Updated on: Jul 29, 2021 | 7:57 AM

Karthika Deepam: డాక్టర్ బాబును పెళ్ళిచేసుకోవాలని మోనిత చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీప పూర్తిగా తన భర్త వెనుక నిలబడి మోనిత ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటోంది. అయినా తన ప్రయత్నాలు వదలడం లేదు. తాను చేస్తున్నది తప్పు అని అసలు తెలుసుకోవడం లేదు. పిచ్చిపట్టినదానిలా ప్రవర్తిస్తూ వస్తోంది. కార్తీక్ ను అనుకున్నట్టుగానే 25వ తేదీన పెళ్లి చేసుకుని తీరాలనే పట్టుదలతో ఉంది మోనిత. ఇదే విషయంపై కార్తీక్ ను నిలదీసింది. నన్ను పెళ్లిచేసుకో అంటూ అడిగింది. దీప కాళ్ళు పట్టుకుని కార్తీక్ అంటే తనకు పిచ్చి అంటూ చెప్పింది. ఎంతో రాద్ధాంతం చేసింది. కార్తీక్ మాత్రం తన తప్పులేదు అంటూ సపష్టం చేశాడు. దీంతో అతని కుటుంబాన్ని నాశనం చేస్తానని శపథం చేసి ఉక్రోషంతో వెళ్ళిపోయింది. మరోవైపు కార్తీక్ తండ్రి ఆరోగ్యం కొద్దిగా కుదుటపడిందని డాక్టర్లు చెప్పారు. కార్తీక్ ను కొన్నిరోజులు తండ్రికి కనపడకుండా ఉంటేనే మంచిది అని సూచించారు. అదేవిధంగా త్వరగా సమస్యను పరిష్కరించుకోకపోతే ఆయన ఆరోగ్యం మరింత పాడవుతుందని హెచ్చరించారు. ఇదీ ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటూ సాగుతున్న కార్తీకదీపం మెగా సీరియల్ నిన్నటి (1103 ఎపిసోడ్) వరకూ జరిగిన ముచ్చట. తరువాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నింపుతూ సాగుతున్న కార్తీకదీపం ఈరోజు 1104 వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. మరి ఈ ఎపిసోడ్ లో ఏమి జరగబోతోంది. మోనిత కొత్త ప్రయత్నాలు ఏమిటి? దీప ఆమెను అడ్డుకునేందుకు ఏమి చేయబోతోంది. డీఎస్పీ రోషిణి ఈ కేసు ముడిని ఏరకంగా విప్పబోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జాగబోతోంది. తెలుసుకుందాం రండి!

వండి పెట్టడం కాదమ్మా..ఉండి పెడితేనే బావుంటుంది!

”అసలు మోనిత ఏమి అనుకుంటుందే. కనీసం డాక్టర్ అని కూడా మర్చిపోయి ఆసుపత్రి అనికూడా చూడకుండా రచ్చ రచ్చ చేసింది. దాని పీడ ఎలా వదులుతుంది? దాని  వాలకం చూస్తుంటే వందమంది భాగ్యాలు వచ్చినా సరే భయపడేలా లేదు.” అంటూ దీపతో భాగ్యం అంటుంది. ”తాను డాక్టర్ అనే విషయం నాకు తెలుసు. కార్తీక్ కూడా ఆమె డాక్టర్ అనే ఓపిక పడుతున్నాడు. రోషిణి మేడం అంజిని పట్టుకుంటుంది. అప్పటివరకూ కొద్దిగా ఓపిక పట్టాలి. నువ్వు ఈ విషయంలో కంగారు పడకు పిన్నీ.” అంటూ భాగ్యకు సర్ది చెబుతుంది దీప. ఉదయాన్నే లేచి తయారు అవుతున్న దీపను చూసి పిల్లలు ఇద్దరూ ఏమిటమ్మా ఇంత ఉదయాన్నే నిద్రలేచి తయారు అవుతున్నావు? ఎక్కడికన్నా వెళుతున్నావా అని అడుగుతారు. ”తాతయ్యను ఈరోజు డిస్చార్జి చేస్తున్నారు. నానమ్మ లేదు కదా. నేను వెళ్లి తాతయ్యకు అవసరమైన మందులు ఇవ్వాలి.” అని చెబుతుంది దీప. అదేమిటి అమ్మ పిన్ని ఉందికదా అని అడుగుతారు పిల్లలు. అయినా, నువ్వు రోజూ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. సరిగ్గా ఇంటిలో ఉండడం లేదు. మాకు ఇంట్లో బోర్ కొడుతోంది. అని పిల్లలు గొడవ చేస్తారు. దీంతో దీప నేను మీకు వండి పెట్టి వెళుతున్నాను కదా అని అడుగుతుంది. దీనికి సౌర్య.. ”వండి పెట్టటం కాదమ్మా నువ్వు ఉండి పెడితేనే మాకు బావుంటుంది” అంటుంది. ఈ మాటతో దీపకు ఏమి చెప్పాలో అర్ధం కాదు. పిల్లలు తామూ తాతయ్య దగ్గరకు వస్తామని అడుగుతారు. వారిని వారించిన దీప మొక్కల ఎగ్జిబిషన్ పెట్టారు. వారణాశితో కలిసి అక్కడకు వెళ్లి మొక్కలు తీసుకురండి. అవి పూలు పూసేసరికి మీకు గుడ్ న్యూస్ చెబుతాను అంటూ వారిని ఒప్పిస్తుంది.

మీ పెళ్ళికి ఒకరు అభ్యంతరం చెప్పారు!

మోనిత నిద్రపోతూ ఉంటుంది. ఫోన్ మోగుతూ ఉంటుంది. ప్రియమణి అర్ధరాత్రి దాకా ఇంటికి రాలేదు. పదిన్నర అయినా లేవలేదు. ఫోన్ మోగుతోంది. లేపితే ఏమంటుందో.. అనుకుంటుంది. కానీ, ఫోన్ పదే పదే మోగుతూ ఉంటె.. ”ఏదైనా అర్జెంటు పని ఉందేమో లేపుదాం ఏదైతే అదే అవుతుంది.” అనుకుంటూ మోనితను లేపుతుంది. మోనిత బద్ధకంగా నిద్రలేచే సరికి మళ్ళీ ఫోన్ మోగుతుంది. అది చూసిన మోనిత వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి..”చెప్పండి దుర్గాప్రసాద్ సార్” అంటుంది. ”అమ్మా 25వ తేదీన మీ పెళ్ళికి ఒకరు అబ్జక్షన్ చెప్పారు.” అని చెబుతాడు. ఎవరు అని మోనిత ప్రశ్నిస్తుంది. ”ఎవరో అంజి అంట” అని దుర్గాప్రసాద్ చెప్పగానే మోనిత ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒక్కసారిగా అంజితో తాను చేయించిన అరాచకం గుర్తువస్తుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. దుర్గాప్రసాద్ ”అంజి అబ్జక్షన్ విత్ డ్రా చేసుకుంటేనే మీ పెళ్లి అవుతుంది” అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో మోనితకు కంగారు మొదలవుతుంది. వంటలక్కను తక్కువగా లెక్కేశాను. ఎంత పని చేస్తోందో. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే వంటలక్క దగ్గర ఓడిపోయినట్టే..నెవర్..మోనిత ఓడిపోకూడదు. గెలవాలి.. అనుకుంటుంది. మరోపక్క ప్రియమణి ఎదో జరగకూడనిది జరిగింది. అందుకే అంత కంగారు పడుతోంది. అనవసరంగా నిద్రలేపాను అని బాధపడుతుంది.

మా కాపురానికి మోనిత గ్రహణం పట్టింది.. వదిలిపోతుంది!

కార్తీక్ తండ్రి ఆనందరావు ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువస్తాడు ఆదిత్య. గుమ్మంలోనే దీప ఎదురై ఉండండి మావయ్య దిష్టి తీస్తాను అంటుంది. దిష్టి తీసి లోపలి రండి మావయ్య అని పిలుస్తుంది దీప. ఆనందరావు దీపను అమ్మా దీప నీకెందుకమ్మా ఇవన్నీ అంటాడు. అదేంటి మామయ్యా అలా అంటారు అని అడుగుతుంది. ”నా కొడుకు చేసిన పనికి నాకు సిగ్గువేస్తోంది అమ్మా.. నీ మొహం చూడాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది అంటాడు.” దానికి దీప ” అలా అనకండి మావయ్యా.. మీ అబ్బాయి చాలా మంచి వారు.” అని చెబుతుంది. ఇంకా వాడిని వెనకేసుకు రాకు దీపా అంటాడు ఆనందరావు. ”ఇంతవరకూ నాకు ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు. ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు,, ఇద్దరు కూతుర్లు ఆదిత్య.. నువ్వు.. స్వప్న అంతే.” అంటాడు. దానికి దీప ”అలా అనవద్దు మావయ్యా.. ఆయన ఎప్పటికీ మీ సుపుత్రుడే.. మీ వంశోద్ధారకుడే. మా కాపురానికి గ్రహణం పట్టింది మావయ్యా.. గ్రహణం ఎక్కువ కాలం ఉండదు. వదిలిపోవాల్సిందే. ఆ గ్రహణం పేరు మోనిత. తనే ఎలాగైనా మీ అబ్బాయిని పెళ్ళిచేసుకోవాలని నాటకాలు ఆడుతోంది. మీరు మీ కొడుకును దూరం పెట్టి ఉండగలరేమో కానీ, ఆయన మీ దూరాన్ని భరించలేరు మావయ్యా.. ఆయన చిన్న పిల్లాడి లాంటి వారు. అయినా, కష్టం వచ్చినపుడు మనం అందరం ఆయన చేయి వదిలేస్తే ఆయన ఏమైపోతారు మావయ్యా.”  అంటూ దీప చెబుతుంది. దీంతో పక్కనే ఉన్న ఆదిత్య లేచి దీపకు రెండు చేతులూ ఎట్టి దణ్ణం పెడతాడు.

నాకు తెలీని విషయాలు చాలా ఉన్నాయి 

కార్తీక్ ఒంటరిగా రోడ్డుపై నడిచి వెళుతుంటాడు. అంజి తనకు మోనిత గురించి ఎదో చెప్పడానికి ప్రయత్నించడం.. తాను అతని చెంప పగులగొట్టడం.. దీప తనతో అంజి ఇప్పుడు ఉంటె బావుండేది.. దీని పెళ్లి పెటాకులు చేసే పని సరిగ్గా చేసేవాడు అని అనడం తలుచుకుంటాడు. అసలు మోనితకి అంజికి పెద్దగా పరిచయం లేదు. మరి ఎందుకు అంజి పేరు దీప చెప్పగానే మోనిత సైలెంట్ అయిపోతోంది. నాకు తెలియని విషయాలు ఏవో చాలా ఉన్నట్టున్నాయి అనుకుంటూ వెళతాడు.

ఇవాళ నాకేదో మూడింది..

మోనితకు డీఎస్పీ రోషిణి ఫోన్ చేస్తుంది. ఇవాళ నాకేదో మూడినట్టు ఉంది అనుకుంటూ మోనిత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఒక్కసారి ఇక్కడకు రా మోనిత ని చెబుతుంది రోషిణి. ఆమె ఎందుకు రమ్మంది అని ఆలోచిస్తుంటుంది మోనిత. ఈలోపు ప్రియమణి వచ్చి కాఫీ తెమ్మంటారా అమ్మా అని అడుగుతుంది. దీనికి మోనిత ఎప్పుడూ నీ కాఫీ గోల ఏమిటి అంటూ విసుక్కుంటుంది. ఇంతలో ప్రియమణి నాకు కాఫీ తీసుకురా అంటూ దీప అక్కడకు ఎంట్రీ ఇస్తుంది. . దీపను చూసి షాక్ అవుతుంది మోనిత. ఈలోపు డీఎస్పీ రోషిణి మోనితకు ఫోన్ చేస్తుంది. అది చూసిన మోనిత ఫోన్ లిఫ్ట్ చేయడానికి తటపటాయిస్తూ ఉంటుంది. అప్పుడు దీప డీఎస్పీ ఫోన్ చేస్తే అలా ఆలోచిస్తావే? మాట్లాడు అంటుంది. దీంతో మోనిత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎంతసేపు? నీకోసం కూడా నేను ఎదురుచూడాలా? అంటూ రోషిణి చిరాకు పడుతుంది. వస్తున్నా మేడం అని సమాధానం ఇస్తుంది మోనిత. మోనిత దీపను  చూసి నేను రోషిణి మేడం దగ్గరకు వెళుతున్నాను. అక్కడ మీ సంగతి తెలుస్తాను అంటూ వెళ్లబోతుంది. ఆమెను దీప అపి.. ”వెళ్తున్నాను.. కాదు వెళదాం. అక్కడ అంజి ఉన్నాడో.. మరెవరైనా ఉన్నారో? నీ పాత కథలు ఏమి చెప్పారో.. కొత్త కథనాల గురించి మేడం కి ఏమి తెలిసిందో? అన్నీ తేల్చుకుందాం” అంటుంది.. ఈ సన్నివేశాలు రేపటి ఎపిసోడ్ (1105)లో తెలుస్తాయి.

Also Read: Karthika Deepam: మిమ్మల్ని అద్నర్నీ నాశనం చేసేస్తాను..మోనిత శాపం.. ఏదైనా చేసుకో కార్తీక్ స్ట్రాంగ్ రిప్లై!

Karthika Deepam Serial: విషం తాగిన దీప.. పిచ్చెక్కిన మోనిత..నోరు విప్పిన కార్తీక్.. సూపర్ సీన్!

Karthika Deepam Serial: స్టాఫ్ తో బయటకు గెంటించేస్తా.. దీప వార్నింగ్! అంజి మిస్సింగ్..మలుపు తిరిగిన మోనిత కథ!!