Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్5 సిద్దమవుతోంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేనివిధంగా భారీ టీఆర్ఫీ తో ఈ షో విజయవంతంగా
Bigg Boss 5: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేనివిధంగా భారీ టీఆర్ఫీతో ఈ షో విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 5వ సీజన్‌కు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారి ఈ షో ద్వారా హోస్ట్ గా బుల్లి తెరపై సందడి చేశాడు తారక్. తనదైన మాటలతో, కంటెస్టెంట్స్‌ను ఆట పట్టిస్తూ.. ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఆతర్వాత సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా మారాడు. కంటెస్టెంట్స్‌కు పంచ్‌లువేస్తూ నవ్విస్తూ అలరించాడు . ఆతర్వాత సీజన్ 3, సీజన్ 4లకు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పటివరకు జరిగిన అనీ సీజన్స్ విజయవంతంగా సాగుతూ వచ్చాయి. దాంతో ఇప్పుడు సీజన్ 5 కోసం ప్రేక్షకుల ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సీజన్ లోపాల్గొనే కంటిస్టెంట్స్ వీళ్ళే అని కొన్ని పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. అంతే కాదు సీజన్-5 కు ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
ఇక ఇప్పుడు స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 5కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. శరవేగంగా కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసి.. సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్ సీజన్ 5ను టెలికాస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. గత రెండు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా నడిపించిన కింగ్ అక్కినేని నాగార్జున ఐదో సీజన్‌కు కూడా హోస్ట్ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా చేయకపోవచ్చు అన్న టాక్ కూడా నడుస్తోంది. అలాగే రానా సీజన్ 5కు హోస్ట్ అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అందులో నిజం లేదంటూ రానా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే హోస్ట్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించాలని నిర్వాహకులు చూస్తున్నారట. మరికొన్ని రోజుల్లో దీనిపై ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి: