AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Srinath: ఒక్కో రోజు ఒక్కో ఆలోచన వచ్చేది.. ఏదేదో అవ్వాలనుకుని చివరికి నటినయ్యాను. శ్రద్ధా ఆసక్తిర వ్యాఖ్యలు.

Shraddha Srinath: మలయాళం సినిమా 'కొహినూర్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల తార శ్రద్ధా శ్రీనాథ్‌. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక....

Shraddha Srinath: ఒక్కో రోజు ఒక్కో ఆలోచన వచ్చేది.. ఏదేదో అవ్వాలనుకుని చివరికి నటినయ్యాను. శ్రద్ధా ఆసక్తిర వ్యాఖ్యలు.
Shradda Srinath
Narender Vaitla
|

Updated on: Jul 29, 2021 | 12:09 PM

Share

Shraddha Srinath: మలయాళం సినిమా ‘కొహినూర్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల తార శ్రద్ధా శ్రీనాథ్‌. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక రెండో సినిమా ‘యూటర్న్‌’తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అనంతరం తమిళం, కన్నడంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ప్రస్తుతం కలియుగం అనే సినిమాలో నటిస్తోందీ చిన్నది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్‌ విషయంలో తనకు ఎన్నో ఆలోచనలు ఉండేవని చెప్పుకొచ్చిన శ్రద్ధా.. తొలుత లాయర్‌ అవ్వాలని ‘లా’లో చేరారని కానీ ఒక్కో రోజు ఒక్కో ఆలోచన వచ్చేదని చెప్పుకొచ్చింది. ఆస్ట్రోనాట్‌, న్యూస్‌ రీడర్‌, సైకోథెరపిస్ట్‌ ఇలా రోజుకో కెరీర్‌లో సెటిల్‌ అవ్వాలనే కల ఉండేదని కానీ చివరికి నటనపై దృష్టిసారించానని తెలిపింది. మొత్తం పది రకాల కెరీర్ల గురించి ఆలోచించి.. నటన తనకు పర్‌ఫెక్ట్‌ అని ఫిక్సయ్యానని తెలిపిందీ బ్యూటీ. ఇక కెరీర్‌ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాల గురించి చెప్పిన శ్రద్ధా.. ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఆరేళ్లు అవుతోంది. ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలు సొంతం చేసుకున్నాయి. అలాగే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా.. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ‘ఈ అమ్మాయి ఏడాది కంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండదు’ అన్ని మాటలు వినిపించాయి. అయితే వాటికి నేను స్పందించలేను. ఇండస్ట్రీలో నిలదొక్కుకొని సమాధానం ఇవ్వాలనుకున్నా’ అంటూ విమర్శలకు సరైన సమాధనం చెప్పిందీ బ్యూటీ. ఇక నటిగా మారకముందు శ్రద్ధా చాలా లావుగా ఉండేది. అయితే మొక్కవోని ధీక్షతో భారీగా తగ్గి నాజుగ్గా మారిందీ చిన్నది.

Also Read: Chiranjeevi : మెగాస్టార్ లూసీఫర్ రీమేక్‌‌‌కు ఇంట్రస్టింగ్ టైటిల్.. చక్కర్లు కొడుతోన్న వార్త

Krithi Shetty: ఉప్పెనలా ఎగసిపడుతోన్న ఆఫర్లు.. కృతి ఖాతాలో మరో రెండు సినిమాలు..

Rana Daggubati: ఆయనకు ఉన్న గొప్ప లక్షణం అదే.. పవన్ పై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్