MAA elections: ఎన్నికా.. ఏకగ్రీవమా… మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. మూవీ ఆర్టిస్టుల ఎన్నికల్లో ప్రచారమంతా మా సొంత భవంతి నిర్మాణం..
MAA elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. మూవీ ఆర్టిస్టుల ఎన్నికల్లో ప్రచారమంతా మా సొంత భవంతి నిర్మాణం చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే మంచు విష్ణు బిల్డింగ్ కట్టడానికి మొత్తం ఖర్చు తానే చూసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. బాలయ్య కూడా తనదైన స్టైల్‌లో మా పై కౌంటర్ వేయడం తో ఎన్నికల హీట్ మరింత పెరిగింది. ఇక అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు పోటీబరిలో దిగారు. కానీ మరోవైపు మురళీ మోహన్ లాంటి సీనియర్ ఏకగ్రీవం చేయాలని పట్టుబడుతున్నారు. సినీపెద్దలతో తాను ముచ్చటించానని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఈ సెప్టెంబర్ లో ఎన్నికల నిర్వహణకు `మా` క్రమశిక్షణా సంఘం సన్నాహకాల్లో ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో నేడు (29న ) మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 కు క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఈ వర్చువల్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్‌లో క్రమ శిక్షణ సంఘం సభ్యులతో పాటు మా కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు.
మా ఎన్నికల నిర్వహణ, జనరల్ బాడీ మీటింగ్ డేట్ ఎనౌన్స్ మెంట్ మరియు తదితర మా సమస్య ల పై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. అలాగే ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు రాసిన లేఖ పై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈరోజు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఎన్నికలు జరిగితే తేదీ ఎప్పుడో నిర్ణయిస్తారు. లేదు ఏకగ్రీవం అనుకుంటే ఎవరిని ఎంపిక చేస్తారు? అన్నదానిపై చర్చిస్తారనే భావిస్తున్నారు. మరో వైపు ఈసారి మహిళలకు అవకాశం ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో 950 మందితో ఉన్న మా అసోసియేషన్ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :