AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : మెగాస్టార్ లూసీఫర్ రీమేక్‌‌‌కు ఇంట్రస్టింగ్ టైటిల్.. చక్కర్లు కొడుతోన్న వార్త

మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌‌‌‌లో ఉన్నారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు. ఏమాత్రం గ్యాప్ రాకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల...

Chiranjeevi : మెగాస్టార్ లూసీఫర్ రీమేక్‌‌‌కు ఇంట్రస్టింగ్ టైటిల్.. చక్కర్లు కొడుతోన్న వార్త
Megastar
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2021 | 10:08 AM

Share

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌‌‌లో ఉన్నారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు. ఏమాత్రం గ్యాప్ రాకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా నలుగురు దర్శలకులను లైన్‌‌‌లో పెట్టేశారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది. మరో కొద్దిరోజుల్లో ఈ సినిమా షూటింగ్‌‌‌కు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ఆతర్వాత చిరు మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ సినిమాను రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు మహాన్ రంగ దర్శకత్వం వహిస్తోన్నారు. అలాగే మెహర్ రమేష్, బాబీ డైరెక్షన్‌‌‌‌లోనూ సినిమాలు చేయనున్నారు చిరు. ఇక ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతుండగానే లూసీఫర్ రీమేక్ పనులు కూడా మొదలు పెట్టేశారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌‌‌‌లో భారీసెట్‌‌‌ను వేస్తున్నారు. త్వరలోనే మెగాస్టార్ షూటింగ్‌‌‌‌లో జాయిన్ అవ్వనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌‌‌గా నాయన తారను అనుకుంటున్నారట. తెలుగు కోసం ప్రత్యేకంగా హీరోయిన్ పాత్రను సృష్టిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్‌‌‌‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా కోసం పలు పేర్లను పరిశీలించిన చిత్రయూనిట్ ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. దాదాపు ఇదే టైటిల్‌‌‌‌ను ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  కథలో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తమన్ ఆల్‌‌‌‌‌రెడీ రికార్డింగ్ కూడా మొదలు పెట్టేశాడట. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఆగస్టు మూడోవారంలో చిరు జాయిన్ అవ్వనున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Krithi Shetty: ఉప్పెనలా ఎగసిపడుతోన్న ఆఫర్లు.. కృతి ఖాతాలో మరో రెండు సినిమాలు..

Acharya Update: చివరి దశకు చేరుకున్న షూటింగ్‌.. కాకినాడ బయలు దేరనున్న చిరంజీవి, సోనూసూద్‌.. ఐదు రోజుల పాటు అక్కడే..

Rana Daggubati: ఆయనకు ఉన్న గొప్ప లక్షణం అదే.. పవన్ పై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్