AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: ఉప్పెనలా ఎగసిపడుతోన్న ఆఫర్లు.. కృతి ఖాతాలో మరో రెండు సినిమాలు..

కృతి శెట్టి.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ చిన్నది. బూచి బాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్

Krithi Shetty: ఉప్పెనలా ఎగసిపడుతోన్న ఆఫర్లు.. కృతి ఖాతాలో మరో రెండు సినిమాలు..
Krithi Shetty
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2021 | 9:07 AM

Share

Krithi Shetty: కృతి శెట్టి.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌‌‌స్టార్ అయిపోయింది ఈ చిన్నది. బూచిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కృతిశెట్టి. ఈ మంగుళూరు బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసింది. కవ్వించే కళ్ళు, క్యూట్ స్మైల్‌‌‌తో యువతను ఫిదా చేసింది. ఉప్పెన సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం తరవాత కృతికి వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడి ఖాతాలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో రెండు సినిమాలు కూడా వచ్చి చేరాయని తెలుస్తోంది. ఇప్పటికే నాని, సుధీర్ బాబు, రామ్ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్‌‌‌లో కనిపించనున్నాడు నాని. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తోన్నారు. సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్‌‌‌తోపాటు కృతిశెట్టి కూడా నటిస్తోంది. అలాగే ఇంద్రగంటి మహాన్‌‌‌‌కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తోన్న సినిమాలో కృతి హీరోయిన్‌‌‌గా ఎంపిక అయింది. ఈ సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌‌‌ను పరిశీలిస్తున్నారు. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తోన్న సినిమాలోనూ ఈ చిన్నది ఎంపిక అయ్యింది. తమిళ్ దర్శకుడు లింగ్ స్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ మూడు సినిమాలతోపాటు ఇప్పుడు మరో రెండు సినిమాలకు ఈ చిన్నది సైన్ చేసిందని తెలుస్తోంది. అక్కినేని యంగ్ హీరో నాగచైత్న సరసన కృతి ఎంపిక అయినట్టు వార్తలు వస్తోన్నాయి. కింగ్ నాగార్జున నటిస్తోంది బంగార్రాజు సినిమాలో చైతన్య కీలకపాత్రలో నటిస్తోన్నాడు. చైతూకు జోడిగా ఈ అమ్మడిని ఫిక్స్ చేశారట. అలాగే మరో యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న ఓ సినిమాలో కృతి ఫైనల్ అయ్యిందని టాక్. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా వరస సినిమాలతో కృతి తెలుగులో ఫుల్ బిజీ అయిపోతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rana Daggubati: ఆయనకు ఉన్న గొప్ప లక్షణం అదే.. పవన్ పై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్

Karthika Deepam: మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం..కార్తీక్ లో మొదలైన ఆలోచన..అన్నీ సరిచేస్తున్న వంటలక్క!

Ram Gopal Varma : నీకింకా బుద్ధి రాలేదా.. హీరో సుమంత్ పై విరుచుకుపడిన వివాదాల వర్మ..

మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
ఇక ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..
ఇక ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..
నడిరోడ్డుపై కాలిబూడిదైన స్కూల్‌ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతతో
నడిరోడ్డుపై కాలిబూడిదైన స్కూల్‌ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతతో