Ram Gopal Varma : నీకింకా బుద్ధి రాలేదా.. హీరో సుమంత్ పై విరుచుకుపడిన వివాదాల వర్మ..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jul 29, 2021 | 10:01 AM

అక్కినేని హీరో సుమంత్ పెళ్లి విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సుమంత్ రెండో పెళ్లి చేసుకునేందుకు...

Ram Gopal Varma : నీకింకా బుద్ధి రాలేదా.. హీరో సుమంత్ పై విరుచుకుపడిన వివాదాల వర్మ..
Sumanth

Sumanth : అక్కినేని హీరో సుమంత్ పెళ్లి విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌‌‌‌గా మారింది. మరికొద్దిరోజుల్లోనే  సుమంత్ రెండో పెళ్లి చేసుకోనున్నారు. దాంతో అక్కినేని వారి ఇంట పెళ్ళిసందడి మొదలైంది. ఇప్పటికే పెళ్ళిపనులు కూడా మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలోనే పెళ్లిపత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుమంత్ పెళ్లి విషయం తెలిసి అందరూ ఆయనకు విషెస్ తెలుపుతుంటే..వివాదాల వర్మ మాత్రం వెరైటీగా రియాక్ట్ అయ్యారు. మాములు చెబితే ఆయన వర్మ ఎందుకు అవుతాడు.. కాస్త వివాదాన్ని మిక్స్ చేసి.. సుమంత్ పెళ్లి పై కామెంట్ చేశారు. ‘ నీకింకా బుద్ధి రాలేదా.. నీ కర్మ’ అంటూ సుమంత్ పై మండిపడ్డారు ఆర్జీవీ. అంతే కాదు ఆయన చేసుకోబోయే యువతిని ఉద్దేశించి కూడా కామెంట్ చేశారు వర్మ.

సుమంత్ 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. పెళ్ళైన రెండు సంవత్సరాలకే మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు. కీర్తి రెడ్డి మరొకరిని వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. సుమంత్ మాత్రం సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇన్నాళ్ల తర్వాత సుమంత్ కు పెళ్లి పై గాలి మళ్లింది. అయితే సుమంత్ పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా సంచల వ్యాఖ్యలు చేశారు వర్మ. ‘ఒక్క సారి అయ్యాక కూడా నీకు ఇంకా బుద్దిరాలేదా సుమంత్.?నీకర్మ ఆ పవిత్ర (సుమంత్ చేసుకోబోయే అమ్మాయి) కర్మ. అనుభవించండి అంటూ రాసుకొచ్చాడు. అలాగే మరో ట్వీట్ లో ఒక పెళ్లి నూరేళ్ళ పంట అయితే రెండో పెళ్లి ఏంటయ్యా స్వామి.? నా మాట విని మానెయ్ ..పవిత్రగారు మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. తప్పు మీది, సుమంత్ ది కాదు.. ఆ దౌర్భాగ్యపు వ్యవస్థది’. అంటూ రాసుకొచ్చాడు వర్మ. ఇదిలా ఉంటే వర్మ దర్శకత్వంలో సుమంత్ ప్రేమకథ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కూడా..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Dushara Vijayan: స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్.. అంత పొగరు ఎందుకు నీకు ?.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..

Rashmika Mandanna: తగ్గేదే లే అంటున్న రష్మిక.. చేతిలో అర డజన్‏కు పైగా సినిమాలు.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu