Rashmika Mandanna: తగ్గేదే లే అంటున్న రష్మిక.. చేతిలో అర డజన్‏కు పైగా సినిమాలు.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

టాలీవుడ్‏లో ఇప్పుడు రష్మిక మందన్నా హావా నడుస్తోందనే చెప్పుకోవాలి. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‏గా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ..

Rashmika Mandanna: తగ్గేదే లే అంటున్న రష్మిక.. చేతిలో అర డజన్‏కు పైగా సినిమాలు.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..
Rashmika Mandanna
Follow us

|

Updated on: Jul 28, 2021 | 6:21 PM

టాలీవుడ్‏లో ఇప్పుడు రష్మిక మందన్నా హావా నడుస్తోందనే చెప్పుకోవాలి. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‏గా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. విజయ్ దేవరకొండ సరసన నటింటిన గీతా గోవిందం సినిమాతో రష్మిక కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటి వరకు సరైన హిట్ లేని రష్మిక.. ఈ మూవీతో టాప్ హీరోయిన్‏లలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత రష్మికకు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. డియర్ కామ్రేడ్, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్‏గా నటిస్తోంది ఈ కన్నడ బ్యూటీ. అటు టాలెంటెడ్ హీరో శర్వానంద్ .. డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది.

ఇక ఇవే కాకుండా.. రష్మిక బాలీవుడ్‏లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను మూవీలో నటిస్తోంది. స్పై థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ‘గుడ్ బై’ సినిమాలోనూ రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల మూడో సినిమాకు కూడా కమిట్ అయినట్లు రష్మిక వెల్లడించారు.

ఇటీవల జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ కేవి.. తదుపరి చిత్రం కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‏తో చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. కామెడీ థ్రిల్లర్ జోనర్‏లో రాబోతున్న ఈ సినిమాకు శివకార్తికేయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. అలాగే ఈ హీరోకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఈ మూవీని ఓ బడా నిర్మాత నిర్మించబోతున్నట్లుగా సమాచారం. ఇక తాజా సమాచారం ప్రకారం ఇందులో రష్మిక హీరోయిన్‏గా చేయబోతున్నట్లుగా సమాచారం.

Also Read: R Narayana Murthy: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంచలన కామెంట్స్

20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా.. ఎలా.. ?  ఆసక్తికరంగా ‘సావిత్రి w/o సత్యమూర్తి’ పోస్టర్..

Singer Smita: రేపు హైదరాబాద్ గోషామహాల్‏లో ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్.. వివరాలను షేర్ చేసిన సింగర్  స్మిత..