AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా.. ఎలా.. ?  ఆసక్తికరంగా ‘సావిత్రి w/o సత్యమూర్తి’ పోస్టర్..

ఇటీవల కాలంలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నాయి. సరికొత్త కాన్సెప్ట్‏తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న

20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా.. ఎలా.. ?  ఆసక్తికరంగా 'సావిత్రి w/o సత్యమూర్తి' పోస్టర్..
Savithri Satyamurthi
Rajitha Chanti
|

Updated on: Jul 28, 2021 | 4:22 PM

Share

ఇటీవల కాలంలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నాయి. సరికొత్త కాన్సెప్ట్‏తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాలు సూపర్ హిట్ అందుకుంటున్నాయి. హీరోహీరోయిన్స్‏తో సంబంధం లేకుండా.. కథ నచ్చితేచాలు.. జై కొట్టేస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా రెగ్యులర్ ఫార్మాట్‏కు పూర్తి భిన్నంగా 20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య అనే కాన్సెప్ట్‏తో సినిమా తెరకెక్కిస్తున్నారు కొత్త దర్శకుడు చైతన్య కొండ. వైవిధ్యమైన కాన్సెప్ట్‎తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సావిత్రి w/o సత్యమూర్తి అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‏లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ సినిమాలో హాస్యనటి శ్రీలక్ష్మి, కేరింత ఫేమ్ పార్వతీశం ప్రధాన పాత్రలలో నటించగా.. వారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏ1 క్రియేషన్స్ బ్యానర్ పై నరేంద్ర నిర్మిస్తుండగా.. ఇందులో శ్రీలక్ష్మి, పార్వతీశం భార్యభర్తలుగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మూవీ ఫస్ట్‏లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘సావిత్రి w/o సత్యమూర్తి’ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, కుటుంబసమేతంగా అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక సినిమా అని చిత్రయూనిట్ తెలిపింది.  ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సత్య కశ్యప్ సంగీత అందిస్తున్నారు.

Also Read: Singer Smita: రేపు హైదరాబాద్ గోషామహాల్‏లో ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్.. వివరాలను షేర్ చేసిన సింగర్  స్మిత.. 

Pushpa Shooting: కోలుకున్న సుకుమార్‌.. చిన్న బ్రేక్‌ తర్వాత మళ్లీ మొదలైన పుష్ప షూటింగ్‌. హైదరాబాద్‌లో…

Anchor Syamala: ఉయ్యాలో.. జంపాలో.. కొడుకుతో ఆటలాడుతున్న స్టార్‌ యాంకర్

Sonu Sood: రోడ్డుపక్కన ఉన్న జూస్ షాపులో సడన్‌‌‌గా ప్రత్యక్షమైన సోనూసూద్ ..

Follow Us
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?