Sonu Sood: రోడ్డుపక్కన ఉన్న జూస్ షాపులో సడన్‌‌‌గా ప్రత్యక్షమైన సోనూసూద్ ..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jul 28, 2021 | 1:41 PM

రియల్ హీరో సోనూసూద్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే..కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో సోనూ ఆపద్బాంధవుడిగా మారారు.

Sonu Sood: రోడ్డుపక్కన ఉన్న జూస్ షాపులో సడన్‌‌‌గా ప్రత్యక్షమైన సోనూసూద్ ..
Sonu Sood

Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. తెరమీద విలన్‌ పాత్రల్లో కనిపించే సోనూ సూద్‌లోని హీరోని.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచం.. సరికొత్తగా పరిచయం చేసుకుంది. సొంతూళ్లకు వెళ్లలేని వలసకూలీలు నడుస్తూ నడుస్తూ ప్రాణాలు కోల్పోవడం- అత్యంత భయంకరమైన సంక్షోభాన్ని కళ్లకు కట్టింది. ఎంతోమంది వలసకూలీలు, పేదలు, విద్యార్థులు సోనూ సూద్‌ను కదిలించారు. ఈ ఒక్క వ్యక్తి అడుగు ముందుకేసి, ఎంతోమందికి భరోసాగా మారాడు. కరోనా పాండమిక్ టైమ్‌లో రియల్ హీరోగా మారారు… రీల్ విలన్ సోనూసూద్‌. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు.  రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశనలుమూలల నుంచి ఎవరు సాయం కోరిన సోనూసూద్ చేస్తూ వచ్చారు. సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు.. దేశమంతటా ప్రశంసలు దక్కాయి. ఇక సోనూసూద్ పై అభిమానంతో కొందరు తమ పిల్లలకు సోనూ పేరు పెట్టుకుంటున్నారు. మరికొంతమంది ఆయనకు గుడులు కూడా కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే రిక్షా మీద గడ్డి తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తి ఆయన కంట పడ్డాడు. వెంటనే కారు దిగి.. స్వయంగా ఆయనే రిక్షా తొక్కుకుంటూ వెళ్లారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు జ్యూస్ షాపులోకి రావడం.. అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది.

అలాగే సోనూ కూడా తన అభిమానులు ప్రేమగా పిలిస్తే ఎంతదూరమైనా..ఎక్కడికైనా వెళ్తుంటారు. ఈ క్రమంలోనే  బంజారా హిల్స్ రోడ్ నెంబర్3 లో రోడ్డు పక్కన ఉన్న జూస్ షాపుకు సడన్ గా వచ్చి సర్‌ప్రైజ్ చేశారు సోనూ. ఆ షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడిన సోనూ.. బత్తాయి జ్యుస్ ను స్వయంగా చేసుకొని తాగారు. అంతే కాదు చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు సోను.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పెళ్ళిపెటాకుల చేసుకున్న మరో సినీజంట.. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు

SR Kalyana Mandapam: ఆకట్టుకొంటున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ ట్రైలర్..

Sumanth: అక్కినేని వారి ఇంట పెళ్లిబాజాలు.. రెండో పెళ్ళికి రెడీ అయిన సుమంత్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu