పెళ్ళిపెటాకుల చేసుకున్న మరో సినీజంట.. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు

ఇటీవల కాలంలో సినిమాతారల పెళ్లిళ్లు పెటాకులవుతున్న వరహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ బాలీవుడ్..

పెళ్ళిపెటాకుల చేసుకున్న మరో సినీజంట.. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు
Mukhesh

ఇటీవల కాలంలో సినిమాతారల పెళ్లిళ్లు పెటాకులవుతున్న వరహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ బాలీవుడ్ అనే కాకుండా అన్ని వుడ్ లలో ఇదే తంతు..కొన్ని బంధాలు పెళ్ళికి ముందు బ్రేక్ అవుతుంటే మరి కొన్ని పెళ్లితర్వాత జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మలయాళ చిత్ర రంగంసంబంధించిన ముఖేశ్.. మెతిల్ దేవికలు విడిపోతున్న వార్తలు ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేస్తున్నాయి. తమ ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు డ్యాన్సర్‌ దేవిక మీడియాముఖంగా వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో తాను విడాకులకు అప్లై చేసినట్లుగా ఆమె చెప్పారు. ఈ వ్యవహారంలో తన భర్త ముఖేశ్ అభిప్రాయం ఏమిటో తనకు తెలీదని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ముఖేశ్‌ మంచివాడే కానీ మంచి భర్త కాలేకపోయాడని తెలిపింది. పెళ్లై ఎనిమిదేళ్లవుతున్నా అతడిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నానని పేర్కొంది. అయితే ముఖేష్ కు గతంలో నటి సరితను పెళ్లాడారు.ఆ తర్వాత ఆమె అతడినుంచి విడాకులు కోరుతూ తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్త తాగుబోతు అని.. పలువురు అమ్మాయిలతో అతడికి అక్రమ సంబంధం ఉందని ఘాటు ఆరోపణలు చేసింది సరిత. ఆ విడాకుల తర్వాత దేవికను పెళ్లాడారు ముఖేష్. ఇక దేవిక మాట్లాడుతూ.. అతడి మీద వస్తున్న రాజకీయ ఆరోపణల గురించి స్పందించేంత అవసరం, ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. అతడి మీద గృహహింస ఆరోపణలు కూడా చేయడం లేదు. అలా అని నేనేమీ ఆవేశంలో, కోపంతో అతడితో విడిపోవడం లేదు’ అని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SR Kalyana Mandapam: ఆకట్టుకొంటున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ ట్రైలర్..

Sumanth: అక్కినేని వారి ఇంట పెళ్లిబాజాలు.. రెండో పెళ్ళికి రెడీ అయిన సుమంత్

హాట్ షాట్స్ తో లింక్ లేదన్న బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ..కాన్పూర్ లోని స్టేట్ బ్యాంక్ లోనూ రాజ్ కుంద్రా ఖాతాలు

 

Click on your DTH Provider to Add TV9 Telugu