హాట్ షాట్స్ తో లింక్ లేదన్న బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ..కాన్పూర్ లోని స్టేట్ బ్యాంక్ లోనూ రాజ్ కుంద్రా ఖాతాలు

Umakanth Rao

Umakanth Rao | Edited By: Anil kumar poka

Updated on: Jul 28, 2021 | 11:59 AM

పోర్న్ చిత్ర కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా నిర్వహిస్తున్న హాట్ షాట్స్ యాప్ తో తనకు ఏ మాత్రం సంబంధం లేదని బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ స్పష్టం చేసింది. తన యాప్ ప్రాజెక్టు కోసం కుంద్రా పలువురు బాలీవుడ్ నటీమణులను అప్రోచ్ అయినట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి.

హాట్ షాట్స్ తో లింక్ లేదన్న బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ..కాన్పూర్ లోని స్టేట్ బ్యాంక్ లోనూ రాజ్ కుంద్రా ఖాతాలు
No Link With Raj Kundras Hot Shots Says Bollywood Actress Celina Jaitly

పోర్న్ చిత్ర కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా నిర్వహిస్తున్న హాట్ షాట్స్ యాప్ తో తనకు ఏ మాత్రం సంబంధం లేదని బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ స్పష్టం చేసింది. తన యాప్ ప్రాజెక్టు కోసం కుంద్రా పలువురు బాలీవుడ్ నటీమణులను అప్రోచ్ అయినట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. వీరిలో ఈమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ వదంతులను ఈమె మేనేజర్ ఖండించారు. ఇవి నిజం కావన్నారు. సెలీనా జైట్లీ, కుంద్రా భార్య శిల్పా శెట్టి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని, శెట్టి ఆధ్వర్యంలోని జెఎల్ స్ట్రీమ్స్ యాప్ ని జైట్లీ ఇష్టపడేదని ఆయన చెప్పాడు. కానీ దీనితో కూడా ఆమెకు లింక్ లేదన్నాడు. సెలీనాయే కాకుండా అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా కుంద్రా తన యాప్ లో బాగస్వాములను కావాలని కోరేవాడని తెలిసిందన్నారు. జెఎల్ స్ట్రీమ్స్ యాప్ ప్రొఫ్షనల్స్ పై చక్కని ప్రభావం చూపేదని ఆయన చెప్పాడు. అటు-రాజ్ కుంద్రా ఆర్ధిక లావాదేవీల్లో అతని భార్య శిల్పాశెట్టికి కూడా పరోక్షంగా సంబంధం ఉన్నట్టు ముంబై పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంలో ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వలేమన్నారు.ఈ కారణం వల్లే కుంద్రాకు వివిధ బ్యాంకుల్లో గల ఖాతాలను పరిశీలిస్తున్నట్టు వారు చెప్పారు.

కుంద్రాకు ఎస్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ సౌతాఫ్రికాలలో గల ఏడున్నర కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అటు కాన్పూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఇతనికి రెండు అకౌంట్లు ఉన్నాయని, వాటి లోని సొమ్మును స్తంభింపజేయవలసిందిగా తమను ముంబై పోలీసులు కోరారని ఈ బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ అకౌంట్లలో కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి :Bunny Vasu – Sundar Pichai Video: గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు లేఖ రాసిన మెగా నిర్మాత బన్నీ వాసు..

 ఆంధ్ర-తమిళనాడు బోర్డర్ కుప్పంలో పోలీసుల పేరుతో కర్ణాటక దొంగల హల్‌చల్‌..:Kuppam Video.

 బాహుబలి బల్లాల దేవా రేంజ్ లో ఏకాంగా బైక్ నే అమాంతం ఎత్తితే ఎలా ఉంటుంది..ఇదిగో ఇలా ఉంటుంది.(వీడియో):Viral Video.

 మార్చరీ గది నుంచి గురక శబ్దం..! షాక్‌ తిన్న డాక్టర్లు!అరుదైన ఘటన..:Snoring Noise From Mortuary Video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu