R Narayana Murthy: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంచలన కామెంట్స్

కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమపై మరోసారి ఆర్థికంగా దెబ్బపడింది.

R Narayana Murthy: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంచలన కామెంట్స్
R Narayana Murthy
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2021 | 6:01 PM

కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమపై మరోసారి ఆర్థికంగా దెబ్బపడింది. దీంతో పలు సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని ప్రకటించడంతో.. అటు సినీ కార్మికులతోపాటు.. సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వాలు అనుమతిచ్చినప్పటికీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. ఈ క్రమంలోనే గతంలో తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయవద్దని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలను హెచ్చరించింది. అయితే సినిమాకు పెట్టిన బడ్జెట్ అయినా రావాలంటే సరైన ధరకు చిత్రానికి ఎక్కడైనా విడుదల చేస్తామని ఇటు నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో థియేటర్లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటూ సినీ పరిశ్రమలో రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే పీపూల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేదవాడికి వినోదాన్ని అందించాలంటే.. థియేటర్లు తెరుచుకోవాలని.. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ విషయంపై చొరవ తీసుకోవాలని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. విజయవాడ ఐలాపూరంలో రైతు నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఓటీటీలో విడుదలైన నారప్ప సినిమా తెలుగు రాష్ట్రాలలో కేవలం 25 శాతం మంది మాత్రమే చూసారు కానీ మిగతా 75 శాతం మంది చూడలేకపోయారు. మధ్య తరగతి బడుగు వర్గాల ఇళ్ళల్లో ఓటీటీ లేదు.. మరి వినోదాన్ని వాళ్లకెప్పుడు అందిస్తారు. థియేటర్‏లో సినిమా చూడడం ఒక పండుగ.. థియేటర్ అనుభూతే వేరు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞపి.. వెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని కోరుతున్నాను అన్నారు నారాయణమూర్తి. అలాగే అందరూ కరోనాతో ఫైట్ చెయ్యాల్సిందేనని తెలిపారు. పేద వాడికి వున్న ఒకే ఒక వినోదం థియేటర్. సినిమా బతకాలి థియేటర్స్ బతకాలి. సినీ పరిశ్రమ పెద్దలు కూడా థియేటర్ ఓపెన్ అయేటట్టు చూడాలి. మనిషి వున్నంత కాలం థియేటర్ వుంటుంది. థియేటర్ లేకపోతే స్టార్ డమ్‏లు ఉండవు. పరిశ్రమ పెద్దలు సినిమాలను ఓటీటీలలో విడుదల చేయకుండా థియేటర్‏లో రిలీజ్ అయ్యేటట్టు చూడాలని కోరారు.

Also Read: 20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా.. ఎలా.. ?  ఆసక్తికరంగా ‘సావిత్రి w/o సత్యమూర్తి’ పోస్టర్..

Singer Smita: రేపు హైదరాబాద్ గోషామహాల్‏లో ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్.. వివరాలను షేర్ చేసిన సింగర్  స్మిత..