Actor Karthik: ‘సీతాకోకచిలక’ హీరో కార్తీక్‌కు తీవ్ర గాయాలు.. వ్యాయామం చేస్తున్న సమయంలో

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jul 29, 2021 | 7:41 AM

సీనియర్ నటుడు కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చెన్నైలోని తన ఇంటిలో వ్యాయామం చేస్తున్న సమయంలో కార్తీక్ ప్రమాదవశాత్తూ...

Actor Karthik:  ‘సీతాకోకచిలక’ హీరో కార్తీక్‌కు తీవ్ర గాయాలు.. వ్యాయామం చేస్తున్న సమయంలో
Actor Karthik

Follow us on

సీనియర్ నటుడు కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చెన్నైలోని తన ఇంటిలో వ్యాయామం చేస్తున్న సమయంలో కార్తీక్ ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. దీంతో  కాళ్ళు,మెడ దగ్గర గాయాలయ్యాయి. కుంటుంబ సభ్యులు ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు కార్తీక్. ఇటీవల ఆయన విషమ పరిస్థితుల్లోకి వెళ్లి.. డాక్టర్ల మెరుగైన వైద్యంతో కోలుకున్నారు. కార్తీక్ బీపీ, శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.

పేరుకు తమిళ నటుడు అయినా కూడా తెలుగులో కూడా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు నటుడు కార్తీక్. ఈయన తెలుగులోనూ చాలా సినిమాలు చేసాడు. ఆయన చేసిన ‘సీతాకోకచిలక’ సినిమా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. అన్వేషణ, మగరాయుడు, అభినందన, అనుబంధం, పుణ్య స్త్రీ లాంటి సినిమాలు ఆయనకు తెలుగులో మంచి పేరు తీసుకొచ్చాయి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఓం 3డి సినిమాలో విలన్‌గా కనిపించాడు కార్తీక్.  నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే అనూహ్యంగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంతంగా పార్టీ కూడా పెట్టారు. కానీ అనారోగ్య కారణాలతో ఆ పార్టీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. గత తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరఫున ప్రచారం చేసాడు.  తాజాగా కార్తీక్ ప్రమాదానికి గురయ్యాడని తెలియడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితిపై  అభిమానులు కంగారు పడుతున్నారు.

Also Read: ‘థియేటర్లను బ్రతికించండి’.. గొంతెత్తుతున్న తెలుగు నటులు..

మిస్టరిగా మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu