Tollywood: ‘థియేటర్లను బతికించండి’.. గొంతెత్తుతున్న తెలుగు నటులు..

ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్‌ నటుడు ఆర్‌ నారాయణ మూర్తి. ఓటీటీ వచ్చి పేదోడి ఎంటర్‌టైన్మెంట్‌ను....

Tollywood: 'థియేటర్లను బతికించండి'.. గొంతెత్తుతున్న తెలుగు నటులు..
Theaters
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 29, 2021 | 10:05 AM

ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్‌ నటుడు ఆర్‌ నారాయణ మూర్తి. ఓటీటీ వచ్చి పేదోడి ఎంటర్‌టైన్మెంట్‌ను దెబ్బతీసిందన్నారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నారప్ప లాంటి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 25శాతం మంది మాత్రమే చూశారన్నారు. దీనికి కారణం వారి దగ్గరే ఓటీటీ ఉందని.. పేదోడి దగ్గర అలాంటివి లేకపోడంతో నారప్ప సినిమాని చూడలేకపోయాడన్నారు. సినిమానే పేదోడికి పండగని… థియేటరే వారికి వినోదం అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు థియేటర్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. సురేష్‌ బాబు వంటి సినీ పెద్దలు కలుగజేసుకుని థియేటర్లు ఓపెన్‌ అయ్యేలా చూడాలని.. పెద్ద సినిమాలతోపాటు.. చిన్న సినిమాలు కూడా విడుదల చేసిన నాడే.. థియేటర్‌ బతుకుతుందన్నారు నారాయణమూర్తి. ఓటీటీలపై కొన్ని రోజులుగా కొందరు సినిమా ప్రముఖులు కామెంట్స్‌ చేస్తూ వస్తున్నారు. ఓటీటీ వచ్చాక థియేటర్‌ వ్యవస్థ నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తే ఎన్నో కుటుంబాలు బతుకుతాయంటున్నారు. నటులకు స్టార్‌డమ్‌ రావాలన్నా.. సినిమాలకు రీచ్‌ పెరగాలన్నా థియేటర్ల వల్లే సాధ్యమంటున్నారు.

ఇక హీరో నాని మరో రకంగా రియాక్ట్‌ అయ్యారు. ఆయన ఓటీటీ పేరు ఎత్తకుండానే… సినిమా థియేటర్ల వల్లే ఇండస్ట్రీ బతుకుతుందని అన్నారు. తిమ్మరుసు ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు హాజరైన నాని.. థియేటర్లు సాధ్యమైనంత త్వరగా ఓపెన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే.. పాలకులు మాత్రం థియేటర్లనే ముందుగా మూసేస్తున్నారని.. లేటుగా తెరుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని, నాని వ్యాఖ్యలపై రియాక్ట్‌ అయ్యారు. థియేటర్లు తెరుచుకోమని ఎప్పుడో నిర్మాతలకు చెప్పామన్నారు.

Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేడు జగనన్న విద్యా దీవెన రెండో విడత డబ్బులు జమ..!

మిస్టరిగా మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..