AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagananna Vidya Deevena: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేడు జగనన్న విద్యా దీవెన రెండో విడత డబ్బులు జమ..!

Jagananna Vidya Deevena: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న ఉద్దేశంతో రూపొందించిన జగనన్న విద్యా దీవెన రెండో విడత కార్యక్రమాన్ని గురువారం..

Jagananna Vidya Deevena: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేడు జగనన్న విద్యా దీవెన రెండో విడత డబ్బులు జమ..!
Jagananna Vidya Deevena
Subhash Goud
|

Updated on: Jul 29, 2021 | 6:07 AM

Share

Jagananna Vidya Deevena: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న ఉద్దేశంతో రూపొందించిన జగనన్న విద్యా దీవెన రెండో విడత కార్యక్రమాన్ని గురువారం ప్రభుత్వం అమలు చేయనుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. కాగా, రెండో విడత సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు 693 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నారు.

ఇప్పటికే మొదటి దశలో భాగంగా ఏప్రిల్‌ 19న సీఎం వైఎస్‌ జగన్‌ 671 కోట్ల రూపాయలను జమ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు పెట్టిన బకాయిలు రూ. 1,774 కోట్లతో సహా గురువారం వేయబోయే విద్యా దీవెనతో మొత్తం రూ. 5573 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పటివరకూ విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్దలు, అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి, నాడు నేడు కింద మొత్తం 25,714 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇక మూడో విడత విద్యాదీవెన ఈ డిసెంబర్‌లో, నాలుగో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

కాగా, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు రూపకల్పన చేశారు. అందులో ఒకటి జగనన్న విద్యాదీవెన. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో ఈ పథకానికి ప్రవేశపెట్టారు సీఎం జగన్‌. వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన కింద ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఈ జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల ఖాతాల్లో నాలుగు త్రైమాసికాలకు డబ్బు వేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కాలేజీలకు వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లే వీలు ఉంటుందని, ఫీజులు నేరుగా చెల్లించడం వల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకోవడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవీ కూడా చదవండి

Srisailam Reservoir: ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. చరిత్రలోనే తొలిసారిగా..

Polavaram : ఫలించిన పోరాటం : రూ. 55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని కోరామన్న విజయసాయిరెడ్డి