AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Reservoir: ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. చరిత్రలోనే తొలిసారిగా..

Srisailam Reservoir: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరద నీరు పోటెత్తడంతో అలర్ట్ అయిన..

Srisailam Reservoir: ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. చరిత్రలోనే తొలిసారిగా..
Srisailam
Shiva Prajapati
|

Updated on: Jul 28, 2021 | 10:12 PM

Share

Srisailam Reservoir: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరద నీరు పోటెత్తడంతో అలర్ట్ అయిన అధికారులు.. ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉపనధులు వాగులు, వంకలు పొంగిపొర్లి.. కృష్ణమ్మలో కలిసిపోయాయి. ఫలితంగా కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఎత్తగా.. దిగువన ఉన్న జూరాలకు వరద పోటెత్తింది. దాంతో జూరాల ప్రాజెక్టు సైతం నిండటంతో అధికారులు.. ఈ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

అలా వదిలిన నీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్టుకు వస్తోంది. దాంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. జలాశయం 2 గేట్లను ఎత్తివేశారు. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 879 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. ఇక 215 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గానూ శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 200 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది.

రికార్డు సృష్టించిన శ్రీశైలం డ్యామ్.. కాగా, శ్రీశైలం డ్యామ్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. తొలకరి ఆరంభంలోనే శ్రీశైలం జలాశయం నిండటం ఇదే తొలిసారి. ప్రాజెక్టు ఇంత త్వరగా నిండటం డ్యామ్ చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. జులై నెలలో ఎప్పుడూ డ్యామ్ నిండటం.. గేట్లు ఎత్తివేయడం జరుగలేదని, ఇతే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.

Also read:

Viral Video: నీటిలో హీట్ వేవ్స్.. మృత్యువాత పడుతున్న చేపలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Harishrao : కల్యాణ లక్ష్మి వద్దంటున్నారు.. 90 శాతానికిపైగా జనాభాకు బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : హరీశ్‌ రావు

Telangana Corona Updates: తెలంగాణలో స్థిరంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..