Viral Video: నీటిలో హీట్ వేవ్స్.. మృత్యువాత పడుతున్న చేపలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Viral Video: హీట్ వేవ్స్ మనుషులపైనే కాదు.. జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా జలచరాలపై పెను ప్రభావం కనబరుస్తోంది.
Viral Video: హీట్ వేవ్స్ మనుషులపైనే కాదు.. జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా జలచరాలపై పెను ప్రభావం కనబరుస్తోంది. తాజాగా హీట్ వేవ్ కారణంగా యునైటెడ్ అమెరికాలో ఓ నదిలో చేపలు చనిపోతున్నాయి. ఈ విషయాన్ని స్వచ్చంధ సంస్థ అయిన రివర్ కీపర్ వెల్లడించింది. దీనికి సంబంధించి నిరూపణలు చూపిస్తూ అండర్ వాటర్ వీడియో ఫుటేజీని ఒకదానిని విడుదల చేసింది. నీటిలో వేడి కారణంగా అందులో జీవిస్తున్న చేపలు కొన్ని మృత్యువాత పడుతుండగా.. మరికొన్ని తీవ్రంగా గాయపడుతున్నాయి.
వాటి చర్మంపై గాయాలు అవుతున్నాయి. కొలంబియాలోని ఈ నదిలో నీరు చాలా వేడిగా ఉంటున్నాయి. దాంతో అందులో జీవించే సాల్మన్ చేపలకు గాయాలు అవుతున్నాయి. ఈ వీడియోలో కొన్ని సాల్మన్ చేపలు గుంపుగా వెళ్తున్నాయి. కొన్ని చేపలకు గాయాలు అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఈ వీడియోలో. అలా జరగడానికి అధిక ఉష్ణోగ్రతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. జులై 16వ తేదీన ఈ వీడియో తీసినప్పుడు నీటి ఉష్ణోగ్రతలు 70 డిగ్రీల ఫారన్ హీట్స్ వద్ద ఉన్నట్లు గుర్తించారు.
Video:
Also read:
అంధుల కోసం ప్రత్యేక కెమెరా అభివృద్ధి చేసిన అమెరిక పరిశోధకులు.. వీడియో