- Telugu News పొలిటికల్ ఫొటోలు Father son cm posts father son duo club to be in chief minister post who occupied cms chair here is full list
father son cm posts: రాజకీయాల్లో రాణిస్తున్న తండ్రీ కొడుకులు.. సీఎం పీఠాలను అధిరోహించిన వారసులు.. చిత్రాలు..
రాష్ట్ర రాజకీయాల్లో వారసులు ముఖ్యమంత్రులుగా చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు, తండ్రి తనయులు సీఎం పదవి చేపట్టిన నేతలు ఎవరెవరో ఇక్కడ చూడండి...
Updated on: Jul 28, 2021 | 10:02 PM

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. బసవరాజ్ బొమ్మాయ్ సీఎం కావడంతో తండ్రీ, కొడుకులు సీఎంగా చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.

కొత్త ముఖ్యమంత్రి తండ్రి సోమప్ప రాయప్ప బొమ్మాయ్ 1996-98లో కర్ణాటక సీఎంగా పనిచేశారు. సీఎంలుగా పనిచేసిన తండ్రుల బాటలో కుమారులు పయనించి వారు కూడా మళ్లీ ముఖ్యమంత్రి పీఠాలను అధిరోహించి రికార్డు సృష్టించారు.

కర్నాటక సీఎంగా హెచ్.డీ. దేవెగౌడ 1994 నుంచి 1996 వరకు పనిచేశారు. ఆయన కుమారుడు హెచ్.డీ. కుమారస్వామి కూడా రెండు సార్లు కర్నాటక సీఎంగా సేవలందించారు.

తమిళనాడు రాష్ట్రంలో ఎం కరుణానిధి 1969-2011 సంవత్సరాల మధ్య ఐదు సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు సీఎం పీఠాన్ని కైవసం చేసుకొని తండ్రి కరుణానిధి బాటలో పయనించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. అతని కుమారుడు జగన్ మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు.

ఒడిశా: నవీన్ పట్నాయక్ 2000 నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి బిజూపట్నాయక్ కూడా సీఎంగా పనిచేశారు. 1961-63, 1990-95లో బిజూ పట్నాయక్ ఒడిశా సీఎంగా మూడు సేవలందించారు.

జార్ఖండ్ సీఎంగా షిబూ సోరెన్ మూడు సార్లు పనిచేయగా, అయన కుమారుడు హేమంత్ సోరెన్ రెండవసారి సీఎం అయ్యారు.

ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఉన్న పెమా ఖండు తండ్రి దోర్జి ఖండు కూడా గతంలో సీఎంగా పనిచేశారు. 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.

మేఘాలయలో పీఏ సంగ్మా, కాన్రాడ్ సంగ్మాల తండ్రికొడుకులు ముఖ్యమంత్రులుగా పదవులు నిర్వర్తించారు.

జమ్మూ కశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో అబ్దుల్లా ఫ్యామిలీకి చెందిన మూడు తరాల వారు సీఎం పదవిలో ఉన్నారు. షేక్ అబ్దులా తర్వాత, ఆయన కుమారుడు ఫరూఖ్ అబ్దుల్లా సీఎంగా పనిచేశారు.

జమ్మూకశ్మీరులో ఫరూఖ్ అబ్దుల్లా, అతని కుమారుడు ఒమర్ అబ్దుల్లాలు ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు.

జమ్మూ కశ్మీర్: గతంలో జమ్మూకాశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ పనిచేసిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రే.

ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ సిఎం అయ్యారు. ములాయం సింగ్ యాదవ్ మూడు పర్యాయాలు యూపీ సీఎం కుర్చీలో ఉన్నారు. 2012-17లో అఖిలేష్ ఒకేసారి సీఎం పదవిలో ఉన్నారు.

ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ తండ్రి హేమ్వతి నందన్ బహుగుణ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

దేవి లాల్ , అతని కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలా కూడా హర్యానా సీఎంలుగా పనిచేశారు.

శంకరరావు చవాన్,అతని కుమారుడు అశోక్ చవాన్ మహారాష్ట్రలో సీఎంలుగా పనిచేశారు.
