- Telugu News Photo Gallery Technology photos Nothing company introduce new ear phones nothing ear 1 buds here the full details about nothing 1 ear buds features and price
Nothing Ear 1: వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో కొత్త ఇయర్ ఫోన్స్.. తక్కువ ధరలో అద్భుత ఫీచర్లు..
Nothing Ear 1: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకులైన కార్ల్ పెయ్ స్థాపించిన నథింగ్ కంపెనీ తాజాగా మార్కెట్లోకి నథింగ్ ఇయర్ 1 పేరుతో కొత్త ఇయర్ ఫోన్స్‌ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఇయర్ ఫోన్స్ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉండడం విశేషం....
Updated on: Jul 28, 2021 | 11:51 AM

ప్రస్తుతం వైర్‌లైస్ ఇయర్ ఫోన్స్ ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ కంపెనీలన్నీ వీటిని తయారు చేయడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా నథింగ్ ఇయర్ 1పేరుతో మరో ఇయర్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చాయి.

వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకులైన కార్ల్ పెయ్ స్థాపించిన నథింగ్ కంపెనీని ఈ ఇయర్ ఫోన్స్‌ను రూపొందించింది. ఈ ఇయర్ ఫోన్స్ ఆగస్టు 17 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి.

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లను ఈ ఇయర్స్ ఫోన్స్‌లో అందించారు. ఈ ఇయర్ ఫోన్ కేస్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం విశేషం.

బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఇయర్ ఫోన్స్‌తో 10 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే 8 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. ఇక ఈ ఇయర్‌ఫోన్ కేస్ మొత్తంగా 34 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

చెమట, వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్‌తో పాటు ఫాస్ పేరింగ్ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు. ఇక ఇయర్ డిటెక్షన్ ద్వారా మ్యూజిక్‌ను ప్లే అండ్ పాజ్ చేసుకోవచ్చు.

బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేసే ఈ ఇయర్ ఫోన్స్ ఎస్‌బీసీ, ఏఏసీ బ్లూటూత్ కోడెక్స్‌ను కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ ఇయర్స్ ఫోన్స్ రూ. 5,999కి అందుబాటులో ఉండనున్నాయి.




