AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Halia Tour: ఆగస్టు 2వ తేదీన హాలియాకు సీఎం కేసీఆర్.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి జగదీశ్ రెడ్డి

హాలియాలో సీఎం కేసీఆర్ పర్యటన నేప‌థ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి గురువారం పరిశీలించారు.

Balaraju Goud
|

Updated on: Jul 29, 2021 | 10:00 PM

Share
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 2వ తేదీన నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ ఆగస్టు 2వ తేదీన మధ్యాహ్నం  హాలియాకు వస్తారని, ఇక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. హాలియాలో ప్రగతి సమీక్షా కార్యక్రమంలో భాగంగా అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారు

1 / 6
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. నాగార్జన సాగర్ ఉపఎన్నికల హామీల్లో భాగంగా అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పర్యటన కొనసాగనుంది.

2 / 6
కృష్ణపట్టెతోపాటు, సాగర్‌ ఎడమకాలువ చివరి భూములకు సాగునీరందించేందుకు రూ.2,500 కోట్లతో 13 లిఫ్ట్‌లకు ఫిబ్రవరి 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నరలో వీటినిర్మాణం పూర్తిచేస్తానని హామీఇచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించి సమీక్షించనున్నారు.

3 / 6
హాలియాలో సీఎం కేసీఆర్ పర్యటన నేప‌థ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి గురువారం పరిశీలించారు. నియోజకవర్గ ప్రగతి సమీక్ష నిర్వహించేందుకు, సమావేశ నిర్వహణకు ప్రభుత్వ ఐ.టి.ఐ., మార్కెట్ యార్డ్ ను స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డి.ఐ.జి. ఏ.వి.రంగనాథ్, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

4 / 6
సీఎం పర్యటనలో నియోజక వర్గంలో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దీర్ఘకాలిక సమస్యలుపై వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జ‌డ్పీటీసీలు, అధికారులతో సీఎం సమీక్షించి సలహాలు, సూచనలు, దిశా నిర్దేశం చేస్తారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

5 / 6

6 / 6