AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harishrao : కల్యాణ లక్ష్మి వద్దంటున్నారు.. 90 శాతానికిపైగా జనాభాకు బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : హరీశ్‌ రావు

కల్యాణ లక్ష్మి పథకం వద్దని బీజేపీ నేతలు చెబుతున్నారని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో ఇలా పేదింటి ఆడపిల్ల పెండ్లికి సాయం అందిస్తున్నారా..

Harishrao : కల్యాణ లక్ష్మి వద్దంటున్నారు.. 90 శాతానికిపైగా జనాభాకు బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ  :  హరీశ్‌ రావు
Harish Rao
Venkata Narayana
|

Updated on: Jul 28, 2021 | 10:08 PM

Share

Harishrao : కల్యాణ లక్ష్మి పథకం వద్దని బీజేపీ నేతలు చెబుతున్నారని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో ఇలా పేదింటి ఆడపిల్ల పెండ్లికి సాయం అందిస్తున్నారా అని ఆయన నిలదీశారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల కోసమే పనులు‌చేస్తుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, తమది తెలంగాణ కోసం, ప్రజల కోసం పని చేసే పార్టీ అని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజలు తెలివైన వారని, అంతిమంగా పని చేసేవాళ్లకే తమ మద్ధతిస్తారని ఆయన చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 87.41 లక్షల మందికి రేషన్‌ కార్డులు అందించామని, కొత్తగా మరో 3,09,083 కార్డులు పంపిణీ చేస్తున్నామని హరీశ్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు 90 లక్షల 50 వేలకు చేరాయని, మొత్తం 2,79,23,000 మంది లబ్దిదారులు ఉన్నారని హరీశ్ రావు చెప్పారు. కొత్త కార్డుల ద్వారా నెలకు అదనంగా రూ.14 కోట్ల విలువగల 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్‌ బియ్యం అందిస్తున్నామని ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్‌ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నామని, తాము ఓట్ల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని తేల్చి చెప్పారు. గజ్వేల్‌లో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి లబ్దిదారులకు రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also : RS Praveen Kumar : జెండా ఎత్తుకుంటారా? కొత్త జెండాను ప్రకటిస్తారా? మాజీ ఐపీఎస్‌ RS ప్రవీణ్‌కుమార్‌ రూటెటు?

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి