RS Praveen Kumar : జెండా ఎత్తుకుంటారా? కొత్త జెండాను ప్రకటిస్తారా? మాజీ ఐపీఎస్ RS ప్రవీణ్‌కుమార్ రూటెటు?
ఖాకీ డ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఖద్దరు షర్టు వేసుకోబోతున్నారు. కాకపోతే ఆ కలర్ ఏంటన్నదే ఇప్పుడు సస్పెన్స్. BSP జెండా ఎత్తుకుంటారా? కొత్త జెండాను ప్రకటిస్తారా?..
RS Praveen Kumar : ఖాకీ డ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఖద్దరు షర్టు వేసుకోబోతున్నారు. కాకపోతే ఆ కలర్ ఏంటన్నదే ఇప్పుడు సస్పెన్స్. BSP జెండా ఎత్తుకుంటారా? కొత్త జెండాను ప్రకటిస్తారా? అసలు.. మాజీ ఐపీఎస్ RS ప్రవీణ్‌కుమార్ రూటెటు? అనేది అనేకమందిలో మెదులుతోన్న ప్రశ్న. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్‌కుమార్ త్వరలో రాజకీయ పార్టీ నాయకుడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. త్వరలో నల్గొండ వేదికగా రాజకీయ జెండాను ఎత్తుకోబోతున్నామని సూర్యాపేటలో స్పష్టతనిచ్చారు.
అయితే, ప్రవీణ్ కుమార్ రాజకీయ జెండా అంటే కొత్తదా? పాతదా? అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ప్రవీణ్‌కుమార్‌ను దగ్గరగా చూసిన వారెవరూ ఆయన మరొకరి కింద పని చేస్తారని భావించరు. అదే నిజమైతే కొత్త పార్టీ పెట్టడం ఖాయం. కాకపోతే BSP అధినేత్రి మాయావతి అండదండలు ప్రవీణ్‌కు ఉన్నాయనేది బయట జరుగుతున్న చర్చ. కాబట్టే బహుజన సమాజ్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. రాజీనామా అనంతరం జరుగుతున్న సభల్లోనూ బహుజన రాజ్యం రాబోతోందని చెబుతున్నారు ప్రవీణ్.
బహుజన రాజ్యమని చెబుతున్నా BSPలోనే చేరతారా? లేదా? అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. BSPలో చేరినంత మాత్రం ప్రవీణ్ అనుకుంటున్న లక్ష్యాలు నెరవేరుతాయా అని ఆయన వ్యవహారశైలి తెలిసిన వారే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బహుజన సమాజ్ పార్టీలో చేరితే దళిత పార్టీగా ముద్ర పడుతుందని తప్ప, ఇతర వర్గాలకు దగ్గర కాలేరనే చర్చ జరుగుతోంది. ప్రవణ్‌కుమార్ మాత్రం ప్రతి సందర్భంలోనూ బహుజనుల అభివృద్ధే లక్ష్యమంటున్నారు. బహుజన రాజ్యంలో అవమానాలు ఉండవని ఇటీవల కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భాన్ని ప్రస్తావిస్తున్నారు మాజీ ఐపీఎస్.
మరోవైపు పార్టీ అంశంలో ప్రవీణ్ కొంత డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ పెట్టి అందరినీ కలుపుకుని వెళ్లాలా? లేదంటే బీఎస్పీలో చేరి బహుజనుల అభ్యున్నతికి కృషి చేయాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారని చెబుతున్నారు. ఇంకోవైపు వచ్చే నెల మొదటి వారంలోనే నల్గొండ వేదికగా ప్రవీణ్ పొలిటికల్ ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
Read also : SHE Teams : పోకిరీలూ పారా హుషార్..! తాట తీసి దబిడి దిబిడి చేసేస్తున్నారు.!